శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

రాష్ట్రం లో కోవిడ్-19 ను ఎదుర్కోవటానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తో చేతులు కలిపిన - బి.ఎస్.ఐ.పి.


Posted On: 07 JUL 2020 12:50PM by PIB Hyderabad

కోవిడ్-19 యొక్క నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నిర్విరామంగా కృషి చేస్తోంది.  శాస్త్ర, సాంకేతిక విభాగం (డి.ఎస్.టి) పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన బిర్బల్ సాహ్ని పాలియో సైన్సెస్ సంస్థ (బి.ఎస్.ఐ.పి) రాష్ట్రంలో కోవిడ్-19 ను ఎదుర్కోవడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో చేతులు కలిపింది.  లక్నోలోని ఐదు కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలలో ఒకటిగా బి.ఎస్.ఐ.పి., కోవిడ్-19 పరీక్షా ప్రయోగశాలను ప్రారంభించడానికి చర్యలు చేపట్టింది.

ఈ సంస్థలోనే పురాతన డి.ఎన్.ఏ-2ఏ. ప్రయోగశాల అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడ వెంటనే పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది.

చందౌలి జిల్లా నుండి మొదటి బ్యాచ్ అనుమానాస్పద కోవిడ్ నమూనాలు 2020 మే నెల 2వ తేదీన బి.ఎస్.ఐ.పి. స్వీకరించింది. అప్పటినుంచి ఈ ప్రయోగశాల 24 గంటలూ పనిచేస్తూ, నోడల్ అధికారులు నిర్ణయించిన విధంగాఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుండి రోజుకు సుమారు 400 నమూనాలను పరీక్షిస్తోంది.

ఈ రోజు వరకు, 12,000 కంటే ఎక్కువగా నమూనాలను పరీక్షించగా, వీటిలో నాలుగు వందలకు పైగా నమూనాలు సార్స్-కోవ్-2 పాజిటివ్ గా నిర్ధారించారు.  బి.ఎస్.ఐ.పి. లో సిబ్బందీ, ఇతర వనరులు పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఇది చాలా ప్రశంసనీయం.

బి.ఎస్.ఐ.పి. డైరెక్టర్ డాక్టర్ వందనా ప్రసాద్ నేతృత్వంలో, సమర్థవంతమైన పనితీరు కోసంబి.ఎస్.ఐ.పి. అంకితమైన శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది.  ఈ బృందంలో డాక్టర్ అనుపమ్ శర్మ, డాక్టర్ పవన్ గోవిల్, డాక్టర్ కమలేష్ కుమార్, డాక్టర్ శైలేష్ అగర్వాల్, డాక్టర్ వివేశ్ వీర్ కపూర్, డాక్టర్ సంతోష్ పాండే, డాక్టర్ నీరజ్ రాయ్ ఉన్నారు. కోవిడ్-19 పరీక్షా ప్రయోగశాలకు, డాక్టర్ నీరజ్ రాయ్ ఇన్-ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు.  ఆయనకు కన్నాజ్, జి.ఎం.సి.కి చెందిన మైక్రో బయాలజిస్ట్, డాక్టర్ అనుజ్ కుమార్ త్యాగితో పాటు సత్య ప్రకాష్, డాక్టర్ వరుణ్ శర్మ, డాక్టర్ ఇందు శర్మ, పి.నాగార్జున, ప్రశాంత్, హర్ష, రిచా  వంటి సమర్థులైన సిబ్బంది మద్దతుగా నిలిచి, పరీక్ష ఫలితాలను విశ్లేషించడంలో, వివరించడంలో సహాయపడుతున్నారు.

కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి, బి.ఎస్.ఐ.పి. బృందం గణనీయమైన కృషి చేస్తోంది.   కోవిడ్-19 పరీక్షల్లో, లక్నో క్లస్టర్ లోని పరిశోధనా సంస్థలు అఖిల భారత స్థాయిలో రెండవ స్థానంలో నిలిచాయి.

"అనేక అవరోధాలు ఉన్నప్పటికీ, కరోనా వైరస్ కు సంబంధించిన ఆర్.టి.-పి.సి.ఆర్. పరీక్షను అందుబాటులో ఉన్న వనరులతో, అసాధారణమైన వేగంతో, అతి ఎక్కువ సంఖ్యలో చేయడంలో బి.ఎస్.ఐ.పి. ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. భాగస్వామ్య ప్రయోజనం, నిబద్ధత, సంకల్పం, అకుంఠిత దీక్షతో ఈ  పనిని చేస్తున్నందుకు కృతజ్ణతలు." అని  డి.ఎస్.టి. కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ప్రశంసించారు.

తాత్కాలిక నమూనా సేకరణ స్థలము, తాత్కాలిక కారిడార్ మరియు పరీక్షా ప్రయోగశాలల  ఛాయాచిత్రం

BIMP

*****


(Release ID: 1636976) Visitor Counter : 185