ఆర్థిక మంత్రిత్వ శాఖ
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమం కోసం ప్రపంచ బ్యాంకు మరియు భారత ప్రభుత్వం 750 మిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేశాయి
Posted On:
06 JUL 2020 4:19PM by PIB Hyderabad
కోవిడ్-19 సంక్షోభం తీవ్రంగా ప్రభావితం చేసిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్.ఎస్.ఎమ్.ఈ.ల) చేతుల్లోకి పెరిగిన ఆర్థిక ప్రవాహానికి మద్దతుగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ. అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమం కోసం ప్రపంచ బ్యాంకు మరియు భారత ప్రభుత్వం ఈ రోజు 750 మిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేశాయి.
ప్రపంచ బ్యాంక్ యొక్క ఎమ్.ఎస్.ఎమ్.ఈ. అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమం ప్రస్తుత కోవిడ్ ప్రభావాన్ని తట్టుకోవటానికి మరియు మిలియన్ల ఉద్యోగాలను రక్షించడంలో సహాయపడటానికి సుమారు 1.5 మిలియన్ల ఆచరణీయ ఎమ్.ఎస్.ఎమ్.ఈ. ల యొక్క తక్షణ ద్రవ్యత మరియు రుణ అవసరాలను పరిష్కరిస్తుంది. కాలక్రమేణా ఎమ్.ఎస్.ఎమ్.ఈ. రంగాన్ని నడిపించడానికి అవసరమైన విస్తృత సంస్కరణల మధ్య ఇది మొదటి అడుగు.
ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ ఖరే మరియు ప్రపంచ బ్యాంకు తరపున కంట్రీ డైరెక్టర్ (ఇండియా) శ్రీ జునైద్ అహ్మద్ సంతకం చేశారు.
కోవిడ్-19 మహమ్మారి ఎమ్.ఎస్.ఎమ్.ఈ. రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, ఇది జీవనోపాధి మరియు ఉద్యోగాలు కోల్పోయేలా చేసిందని శ్రీ ఖరే చెప్పారు. ఎన్.బి.ఎఫ్.సి. లకు సమృద్ధిగా ఆర్థిక రంగ ద్రవ్యత ఉండేలా చూడటంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది, మరియు చాలా రిస్క్ విముఖంగా మారిన బ్యాంకులు ఎన్.బి.ఎఫ్.సి. లకు రుణాలు ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ముందుకు కొనసాగిస్తున్నాయి. సంక్షోభం నుండి బయటపడేందుకు వీలుగా, ఆచరణీయ ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు రుణాలు కొనసాగించడానికి ఎన్.బి.ఎఫ్.సి. లు మరియు బ్యాంకులను ప్రోత్సహించడానికి లక్ష్యంగా హామీలు ఇవ్వడంలో ఈ ప్రాజెక్టు ప్రభుత్వానికి తోడ్పడుతుంది.
ప్రపంచ బ్యాంక్ గ్రూప్, దాని ప్రైవేట్ రంగ సంస్థ - ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐ.ఎఫ్.సి) తో సహా, ఎమ్.ఎస్.ఎమ్.ఈ. రంగాన్ని రక్షించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ఈ విధంగా మద్దతు ఇస్తుంది :
*లిక్విడిటీని అన్ లాక్ చేయండం :
మార్కెట్‌లోకి ద్రవ్యతను చొప్పించడానికి ఆర్.బి.ఐ. మరియు భారత ప్రభుత్వం (జి.ఒ.ఐ) తీసుకున్న ప్రారంభ మరియు నిర్ణయాత్మక చర్యల నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ లాభపడింది. ప్రస్తుత అనిశ్చితుల కారణంగా, రుణగ్రహీతలు తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి రుణదాతలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, ఈ రంగంలో ఆచరణీయ సంస్థలకు కూడా రుణాలు పరిమితమయ్యాయి. ఋణ హామీలతో సహా పలు రకాల సాధనాల ద్వారా బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఆర్ధిక సంస్థల (ఎన్.బి.ఎఫ్.సి) నుండి రుణాలు ఇవ్వడం ద్వారా ఎం.ఎస్.ఎం.ఈ. రంగానికి రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు ఈ కార్యక్రమం మద్దతు ఇస్తుంది.
* ఎన్.బి.ఎఫ్.సి. లు మరియు ఎస్.ఎఫ్.బి. లను బలోపేతం చేయడం
ఎన్.బి.ఎఫ్.సి. లు మరియు చిన్న ఆర్ధిక బ్యాంకులు (ఎస్.ఎఫ్.బి.లు) వంటి కీలకమైన మార్కెట్-ఆధారిత రుణ మార్గాల నిధుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఎం.ఎస్.ఎం.ఈ. ల అత్యవసర మరియు వైవిధ్యమైన అవసరాలకు ప్రతిస్పందించడానికి వారికి సహాయపడుతుంది. ఇందులో ఎన్.బి.ఎఫ్.సి. ల కోసం ప్రభుత్వ రీఫైనాన్స్ సదుపాయానికి మద్దతు కూడా ఉంటుంది. సమాంతరంగా, రుణాలు మరియు ఈక్విటీ ద్వారా ఐ.ఎఫ్.సి. కూడా ఎస్.ఎఫ్.బి. లకు ప్రత్యక్ష సహాయాన్ని అందిస్తోంది.
* ఆర్థిక ఆవిష్కరణలను ప్రారంభించడం
ప్రస్తుతం, ఎం.ఎస్.ఎం.ఈ. లలో కేవలం 8 శాతం మాత్రమే అధికారిక క్రెడిట్ చానెల్స్ ద్వారా సేవలు పొందుతున్నాయి. ఈ కార్యక్రమం ఎం.ఎస్.ఎం.ఈ. రుణాలు మరియు చెల్లింపులలో ఫిన్ టెక్ మరియు డిజిటల్ ఆర్థిక సేవలను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. సంస్థలను, ముఖ్యంగా, ప్రస్తుతం అధికారిక ఛానెళ్లతో ప్రాప్యత లేని చిన్న సంస్థలును రుణదాతలు, సరఫరాదారులు మరియు కొనుగోలుదారులు వేగంగా మరియు తక్కువ ఖర్చుతో చేరుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
శ్రీ జునైద్ అహ్మద్ మాట్లాడుతూ, ఎం.ఎస్.ఎం.ఈ. రంగం భారతదేశం యొక్క వృద్ధికి మరియు ఉపాధి కల్పనకు కేంద్రంగా ఉందని మరియు కోవిడ్-19 అనంతర భారతదేశం యొక్క ఆర్ధిక పునరుద్ధరణకు కీలకంగా ఉంటుందని అన్నారు. తక్షణ అవసరం ఏమిటంటే, ప్రభుత్వం ఈ వ్యవస్థలోకి చొప్పించిన ద్రవ్యతను ఎం.ఎస్.ఎం.ఈ. ల ద్వారా పొందేలా చూడటం. ఎం.ఎస్.ఎం.ఈ. ల కోసం మొత్తం ఆర్ధిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ చర్యలన్నీ, ఎన్.బి.ఎఫ్.సి. లు మరియు ఎస్.సి.బి. ల పాత్రను సమర్థవంతమైన ఆర్థిక మధ్యవర్తులుగా పెంపొందించడం ద్వారా, అదేవిధంగా, ఎం.ఎస్.ఎం.ఈ. రంగానికి ఆర్థిక పరిధిని విస్తృతం చేయడానికి ఫిన్ టెక్ ను ప్రోత్సహించడం ద్వారా, ఈ రెండు లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తాయి.
కొత్త ఎం.ఎస్.ఎం.ఈ. ప్రాజెక్టుతో సహా భారతదేశం యొక్క అత్యవసర కోవిడ్-19 ప్రతిస్పందనకు మద్దతు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ఇప్పటివరకు 2.75 బిలియన్ల డాలర్ల ఆర్ధిక సహాయం ఇవ్వడానికి కట్టుబడి ఉంది. భారతదేశ ఆరోగ్య రంగానికి తక్షణ మద్దతు కోసం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ముందుగా ఒక బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించారు. మరింత ఏకీకృత డెలివరీ ప్లాట్‌ఫామ్‌తో సహా - రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామీణ మరియు పట్టణ జనాభాకు అందుబాటులో ఉండే విధంగా, పేదలు మరియు బలహీన వర్గాల వారికి నగదు బదిలీ మరియు ఆహార ప్రయోజనాలను పెంచడానికి మే నెలలో మరొక బిలియన్ డాలర్ల ప్రాజెక్టు ఆమోదించబడింది.
అంతర్జాతీయ పునఃనిర్మాణం మరియు అభివృద్ధి బ్యాంకు (ఐ.బి.ఆర్.డి) నుండి 750 మిలియన్ డాలర్ల రుణం, 5 సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌తో సహా 19 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంది.
****
(Release ID: 1636926)
Visitor Counter : 320
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam