శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 డాష్ బోర్డ్ 4 వ తాజా వెర్షన్ను విడుదల చేసిన - ఎన్.ఏ.టి.ఎమ్.ఓ.
Posted On:
06 JUL 2020 3:27PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ కు చెందిన శాస్త్ర, సాంకేతిక విభాగం అధీనంలో పనిచేస్తున్న జాతీయ అట్లాస్ మరియు థిమాటిక్ మ్యాపింగ్ సంస్థ ( ఎన్.ఏ.టి.ఎమ్.ఓ), కోవిడ్-19 డాష్ బోర్డ్ యొక్క 4వ తాజా వెర్షన్ను, దాని అధికారిక పోర్టల్ http://geoportal.natmo.gov.in/Covid19/ ద్వారా 2020 జూన్, 19వ తేదీన విడుదల చేసింది.
కోవిడ్-19 డాష్ బోర్డ్ యొక్క 4 వ తాజా వెర్షన్ లోని ప్రత్యేక లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి :
1. ఒకే ఒక మ్యాప్ విండో ద్వారా వినియోగదారుడు కోవిడ్-19 కి సంబంధించిన అనేక రకాల సమాచారాన్ని పొందవచ్చు.
చిత్రం -1 : కోవిడ్ గణాంకాలు మరియు ఆరోగ్య సౌకర్యాల కోసం ఒకే మ్యాప్ ఫ్రేమ్
2. కోవిడ్ గణాంకాలు : ధృవీకరించబడిన కేసులు, కోలుకున్న కేసులు. మృతుల సంఖ్య, రికవరీ రేటు మరియు మరణాల రేటు వంటి సమాచారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు, ఆసుపత్రులు, పరీక్షల ప్రయోగశాలలు, రక్త నిధులు వంటి సమాచారం కూడా అదే మ్యాప్ ఫ్రేమ్‌లో అందుబాటులో ఉంటాయి.
చిత్రం-2 : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అందజేసిన సమాచారం ఆధారంగా లెక్కించిన రికవరీ రేటు మరణాల రేటుతో సహా రాష్ట్రాల వారీగా కోవిడ్ గణాంకాలు.
3. డేటాను సూచించడానికి 'డ్రిల్ డౌన్' విధానం అనుసరించబడింది. జిల్లాల వారీగా కోవిడ్ కేసుల పంపిణీ మరియు అందుబాటులో ఉన్న ఆరోగ్య మౌలిక సదుపాయాలను తెలుసుకోడానికి వినియోగదారులు ఒక రాష్ట్రాన్ని ఎంచుకోవచ్చు. వినియోగదారులు అధిక జూమ్ స్థాయిలో వ్యక్తిగత ఆరోగ్య సౌకర్యం గురించిన సమాచారాన్ని కూడా కనుగొనవచ్చు. చిరునామా, కేటగిరీలు, నగరంలోని ప్రాంతాలు వంటి సాధారణ ప్రజలకు ఉపయోగకరమైన కొంత సమాచారాన్ని "ఇన్ఫో టూల్" తో సూచించబడింది. సమాచారం స్పష్టంగా కనబడడం కోసం చిత్ర పటాల రూపంలో, సులభంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని పొందుపరచడం జరిగింది.
చిత్రం-3 : మహారాష్ట్ర లో కోవిడ్-19 చికిత్సకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సదుపాయాలను మరియు సౌకర్యాల యొక్క వివరణాత్మక స్థాన సమాచారాన్ని చూపించే దృశ్యం. కోవిడ్ గణాంకాలు - రికవరీ రేటు, మరణ రేటుతో పాటు ధృవీకరించబడిన, చికిత్స పొందుతున్న, కోలుకున్న, మరణించిన కేసుల వివరాలు. గత 15 రోజులలో కోవిడ్ పరిస్థితి గ్రాఫ్‌లో చూపబడింది.
4. గత 14 రోజులకు ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రాలలోని పరిస్థితులను చార్టుల ద్వారా వివరించబడింది. అత్యధికంగా ధృవీకరించబడిన కేసులు నమోదైన మొదటి రెండు స్థానాల్లో ఉన్న రాష్ట్రాల వివరాలు ముందుగా చూపించబడతాయి. ఇతర రాష్ట్రాల వివరాలను వినియోగదారుడు డ్రాప్-డౌన్ ద్వారా ఎంచుకుని చూడవచ్చు.
కోవిడ్-19, ప్రపంచవ్యాప్త ఆరోగ్య విపత్తుగా పరిణమించింది. ప్రాణాంతకమైన ఈ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రపంచంలోని 217 దేశాలు అపారమైన కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయంలో భారతదేశానికి మినహాయింపు లేదు. 2020 జనవరి 30వ తేదీన భారతదేశంలో మొదటి కోవిడ్ పాజిటివ్ కేసును గుర్తించడం జరిగింది. అప్పటి నుండి, ఇది భారతదేశంలో భయంకరమైన పరిస్థితిని సృష్టించింది. దేశ సమాజ ఆరోగ్యంపై దాని ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించడానికి భారత ప్రభుత్వం - కోవిడ్ నిర్దిష్ట ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించడం, భయాందోళనలకు గురైన సామాజిక ప్రవర్తనను నియంత్రించడానికి అవగాహనను పెంపొందించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది.
ఇటువంటి పరిస్థితులలో, పౌరులలో అవగాహనను వ్యాప్తి చేయడం, ఆందోళనలను మరియు ఆందోళన కలిగించే భయాందోళనలను అధిగమించడం కోసం పరిస్థితుల విశ్లేషణను డాష్‌బోర్డ్ ద్వారా వివరంగా తెలియజేయడం జరిగింది. కోవిడ్-19 పోరాట కార్యక్రమాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్నీ సమగ్రపరచడానికి ఒకే విండో ప్లాట్ ఫారమ్ ను రూపొందించడం కోసం, జియోస్పేషియల్ గ్రూప్, సైన్స్ & టెక్నాలజీ విభాగం, సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖల మార్గదర్శకత్వంలో నిర్వహించడానికి ఎన్.ఏ.టి.ఎమ్.ఓ. తన కోవిడ్-19 డాష్ బోర్డ్ ను 2020 ఏప్రిల్, 14వ తేదీన ప్రారంభించింది. ఇతర కోవిడ్ డాష్ బోర్డులు రాష్ట్రాలు, జిల్లాల వారీగా కోవిడ్ కేసుల పంపిణీపై మాత్రమే సాధారణంగా దృష్టి పెడుతున్నట్లు గమనించబడింది. అయితే, ఎన్.ఏ.టి.ఎమ్.ఓ. దాని డాష్ బోర్డ్ లో, ఆరోగ్య మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పొందుపరచడానికి అవకాశం కల్పించింది. దీంతో, ఇది సాధారణ ప్రజలకు ఈ సమస్యలపై సంబంధిత సమాచారాన్ని కనుగొనడానికి సహాయపడుతోంది.
కోవిడ్-19 డాష్ బోర్డు ప్రారంభించిన అనంతరం, ప్రామాణీకరించబడిన నేపథ్య సమాచారం లభ్యతను బట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దీన్ని ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో నవీకరించబడుతోంది.
కోవిడ్-19 మహమ్మారి భారీగా విజృంభించి, అతి తక్కువ వ్యవధిలో చాలా వేగంగా మారుతూ వచ్చింది. జనాభా-సామాజిక-ఆర్ధిక కారకాలను పరిగణనలోకి తీసుకొని పరిస్థితి ప్రభావాన్ని మరింతగా విశ్లేషించవలసిన అవసరం ఉంది. ఇది ఈ దృష్టాంతంలో గరిష్ట జ్ఞానాన్ని పొందటానికి మనకు సహాయపడుతుంది, ఇది ఒక అభ్యాస ఉదాహరణగా పరిగణించబడుతోంది. భవిష్యత్తు రోజుల్లో ఇటువంటి ప్రాణాంతక వ్యాధులపై మరింత శక్తివంతమైన మార్గంలో పోరాడటానికి ఇది మనకు మరింతగా సహాయపడే అవకాశం ఉంది.
*****
(Release ID: 1636896)
Visitor Counter : 303