మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

జె.ఈ.ఈ. మెయిన్స్ మరియు అడ్వాన్స్ తాజా పరీక్ష తేదీలను ప్రకటించిన - కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి

Posted On: 03 JUL 2020 8:51PM by PIB Hyderabad

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నీట్ మరియు జె.ఈ.ఈ. మెయిన్స్ మరియు అడ్వాన్స్ తాజా పరీక్ష తేదీలను ప్రకటించారు.  విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సలహా మేరకు నాణ్యమైన విద్యను నిర్ధారించడానికి జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.‌టి.ఎ) జె.ఈ.ఈ. మరియు నీట్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.  జె.ఈ.ఈ. మెయిన్ పరీక్ష ఇప్పుడు 2020 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరుగుతుందనీ, జె.ఈ.ఈ. అడ్వాన్స్ పరీక్ష 2020 సెప్టెంబర్ 27వ తేదీన జరుగుతుందని ఆయన తెలియజేశారు.  కాగా, నీట్ పరీక్ష 2020 సెప్టెంబర్ 13వ తేదీన జరుగుతుందని ఆయన చెప్పారు.

శ్రీ పోఖ్రియాల్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ, ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో, విద్యార్థుల భద్రత మరియు విద్యా సంక్షేమాన్ని నిర్ధారించడమే, మా ప్రాధాన్యత అని అన్నారు.  పరీక్షలను నిర్వహిస్తున్నప్పుడు, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తామనీ, తద్వారా విద్యార్థులకు ఈ అంటువ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటామనీ ఆయన చెప్పారు.

 

పరీక్షా కేంద్రాల్లో కూడా సామాజిక దూరాన్ని అనుసరిస్తామని, మిగతా అన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నామనీ మంత్రి హామీ ఇచ్చారు.  విద్యార్థులు ఎటువంటి ఒత్తిడిని మనసులో పెట్టుకోకుండా, విద్యార్థులందరూ, వారి చదువులపైనే  శ్రద్ధ పెట్టాలని శ్రీ పోఖ్రియాల్ సూచించారు.  విద్యార్థులు తమ సన్నాహకాలను పూర్తి చేసుకోదానికి వీలుగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులందరి కోసం ఒక టెస్టింగ్ యాప్ ‌ను సిద్ధం చేసింది.  ఈ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులందరూ, విజయం సాధించాలని ఆశిస్తూ, మంత్రి చివరిగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

నీట్ పరీక్ష గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ  "క్లిక్" చేయండి.

 జే.ఈ.ఈ. పరీక్ష గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ  "క్లిక్" చేయండి.

*****

 

 

 


(Release ID: 1636539) Visitor Counter : 147