రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితాలనూ, ఆర్థిక వ్యవస్థలనూ నాశనం చేస్తున్నందున, బుద్ధుడి సందేశం ఒక దారిచూపేలా ఉపయోగపడుతుందని - రాష్ట్రపతి పేర్కొన్నారు

Posted On: 04 JUL 2020 11:43AM by PIB Hyderabad

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి మానవ జీవితాలనూ, ఆర్థిక వ్యవస్థలనూ నాశనం చేస్తున్నప్పుడు, బుద్ధుడి సందేశం ఒక దారిచూపేలా పనిచేస్తుందని, భారత రాష్ట్రపతి, శ్రీ రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. బుద్ధ భగవానుడు దురాశ, ద్వేషం, హింస, అసూయ మరియు అనేక ఇతర దుర్గుణాలను విడనాడాలని ప్రజలకు బోధించారు.  పశ్చాత్తాపపడని మానవజాతి అదే పాత హింస మరియు ప్రకృతిని నాశనం చేసే విధంగా ప్రవర్తించడం బుద్ధుని సందేశానికి విరుద్ధంగా ఉంది.  కరోనా వైరస్ వ్యాప్తి మందగించిన ఈ సమయంలో, వాతావరణ మార్పుల గురించి చాలా తీవ్రమైన సవాలు మన ముందు ఉన్న సంగతి మనందరికీ తెలుసు.

ఈ రోజు (2020 జూలై 4వ తేదీ) రాష్ట్రపతి భవన్‌ లో ధర్మ చక్ర దివస్ సందర్భంగా అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ఏర్పాటు చేసిన ఆన్ లైన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు.

ధమ్మ ప్రారంభమైన భూమిగా భారతదేశం గర్విస్తున్నదని రాష్ట్రపతి అన్నారు.  భారతదేశంలో, బౌద్ధమతాన్ని అద్భుతమైన సత్యం యొక్క తాజా వ్యక్తీకరణగా మనం చూస్తాము.  బుద్ధ భగవానుని జ్ఞానోదయం, ఆ తరువాత నాలుగు దశాబ్దాలుగా ఆయన చేసిన బోధనలు, మేధో ఉదారవాదం, ఆధ్యాత్మిక వైవిధ్యానికి గౌరవం ఇచ్చే భారతదేశ సంప్రదాయానికి అనుగుణంగా ఉన్నాయి.  ఆధునిక కాలంలో, ఇద్దరు గొప్ప భారతీయులు - మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ - బుద్ధుడి మాటలతో ప్రేరణ పొంది, భారతదేశ భవిష్యత్తును తీర్చి దిద్దారని రాష్ట్రపతి పేర్కొన్నారు. 

వారి అడుగుజాడలను అనుసరించి, బుద్ధుని పిలుపును విని, ఉత్తమ మార్గంలో పయనించాలని ఆయన అందజేసిన ఆహ్వానానికి ప్రతిస్పందించడానికి మనం ప్రయత్నించాలని రాష్ట్రపతి సూచించారు.   ప్రపంచం ప్రస్తుతంస్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక బాధలతో నిండి ఉంది.  తీవ్ర నిరాశతో బాధపడుతున్న రాజులు మరియు సంపన్న ప్రజలుజీవిత క్రూరత్వాల నుండి తప్పించుకోవడానికి బుద్ధుడిని ఆశ్రయించిన కథలు చాలా ఉన్నాయి.  నిజానికి, ఈ అసంపూర్ణ ప్రపంచం మధ్యలో బాధల నుండి విముక్తి లభిస్తుందని ఆయన నమ్మినందువల్ల, బుద్ధుడి జీవితం మునుపటి నమ్మకాలను సవాలు చేస్తుంది.

రాష్ట్రపతి ప్రసంగం చదవడం కోసం ఇక్కడ "క్లిక్" చేయండి.

 

****


(Release ID: 1636418) Visitor Counter : 175