శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఆత్మనిర్భర్ భారత్ సాధించడానికి కోవిడ్-19 ఒక పిలుపుగా పనిచేస్తుందని డాక్టర్ రఘునాథ్ మషెల్కర్ చెప్పారు

‘ఆత్మనిర్భరత’ కు ఐదు స్థంభాలని డాక్టర్ మషెల్కర్ ప్రత్యేక ప్రస్తావన - కొనండి, తయారు చేయండి, మరింత మెరుగుకోసం కొనండి, మంచిగా కొనండి, కలిసి చేసుకోండి (ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని నిర్మించడం)

Posted On: 03 JUL 2020 2:12PM by PIB Hyderabad

కోవిడ్-19 ఆత్మనిర్భర భారత్ సాధించడానికి ప్రతి ఒక్కరూ మనల్ని మనం పునర్నిర్మించుకోవాలని, చైతన్య పరుచుకోవాలి, పునరుత్తేజం కావాలి అని  పద్మ విభూషణ్, డాక్టర్ రఘునాథ్ అనంత్ మషెల్కర్ అన్నారు. 

కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సమ్మర్ రీసెర్చ్ ట్రైనింగ్ ప్రోగ్రాం (సిఎస్ఐఆర్-ఎస్ఆర్టిపి), 2020, నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సిఎస్ఐఆర్-నీస్ట్) చేత సమన్వయం చేసిన కార్యక్రమంలో డాక్టర్ మషెల్కర్ 'ఆత్మనిర్భర్ భారత్ ఆత్మబిశ్వాస్ తో నిర్మాణం' పై ప్రసంగించారు. 

డాక్టర్ మషెల్కర్ మాట్లాడుతూ, స్వావలంబన లేదా ఆత్మనిర్భర్ భారత్ సాధించాలనే మన ప్రయత్నంలో, ప్రపంచం నుండి మనల్ని వేరుచేయలేము, కానీ ప్రపంచ సరఫరా గొలుసుతో కలిసిపోతాము అని అన్నారు. ‘ఆత్మనిర్భర’కి మూలం అయిన ఐదు స్తంభాలపై ఆయన ఉద్ఘాటించారు. మన దేశం అభివృద్ధి చెందాలంటే, సాంకేతిక పరిజ్ఞానం, నమ్మకంపైనే ఆధారపడే దేశ యువత శక్తిపై తనకు నిస్సందేహమైన విశ్వాసం ఉందని ఆయన తెలిపారు.

‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ ఉత్పత్తులను సమీకరించడంపైనే కాకుండా, భారతదేశంలో కూడా ఆవిష్కరించడంపై దృష్టి పెట్టాలని డాక్టర్ మషెల్కర్ అభిప్రాయపడ్డారు. ఉత్పత్తులను సమీకరించడం ఉద్యోగాలను సృష్టిస్తుందనడంలో సందేహం లేదని, అయితే కొత్త ప్రత్యామ్నాయాల కోసం మనం తీవ్రమైన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పరిశోధన ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన, పరిశోధన డబ్బును జ్ఞానంగా మారుస్తుందని, ఆవిష్కరణ జ్ఞానాన్ని డబ్బుగా మారుస్తుందని, అందువల్ల మన దేశం అభివృద్ధి చెందడానికి ఇద్దరూ చేతులు కలపాలి. మనకు ప్రతిభ మరియు సాంకేతికతలు ఉన్నాయని ఆయన నొక్కిచెప్పారు, కాని ఇప్పుడు మన సామర్థ్యాలను విశ్వసించడం లేదా నమ్మడం అవసరం.

ఇది చాలా ముఖ్యం ఎందుకంటే కోవిడ్-19 తరువాత ప్రపంచం అంతా చైనాకు ప్రత్యామ్నాయ గమ్యం కోసం వెతుకుతుంది, ఎందుకంటే చైనాపై నమ్మకం పోతుంది.  ప్రత్యామ్నాయంగా భారతదేశం వైపు ప్రపంచం చూస్తోంది అని అన్నారు.   వ్యాపారం చేసే ప్రక్రియను సులభతరం చేయడానికి, విదేశీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించడానికి భారతదేశం సరైన లాజిస్టిక్స్, తగిన మౌలిక సదుపాయాలను సమకూర్చుకో  వలసిన  అవసరం ఉందని ఆయన తెలిపారు.

 

*****

 



(Release ID: 1636230) Visitor Counter : 227