మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఔషధ ఆవిష్కరణ హాకథాన్ 2020 (డిడిహెచ్ 2020)ని సంయుక్తంగా ప్రారంభించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
ఔషధ ఆవిష్కరణ హాకథాన్ 2020- ఔషధ ఆవిష్కరణ ప్రక్రియకు మద్దతుగా జాతీయ స్థాయిలో తీసుకున్న మొట్టమొదటి చర్య: రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
అంతర్జాతీయ స్థాయి ప్రతిభను ఆకర్షించేందుకు ఈ హాకథాన్‌లో ప్రపంచవ్యాప్తంగా గల ఎవరైనా పాల్గొనవచ్చు: రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
ఇన్ సిలికో డ్రగ్ డిస్కవరీ విధానం, ఔషధ ఆవిష్కరణలలో మెషిన్ లెర్నింగ్ వంటి గణన పద్దతులను ఉపయోగిస్తుంది. కృత్రిమ మేథ, బిగ్ డాటా వంటివి ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపకరిస్తాయి- డాక్టర్ హర్షవర్దన్
Posted On:
02 JUL 2020 5:03PM by PIB Hyderabad
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈరోజు డ్రగ్ డిస్కవరీ హాకథాన్( ఔషధ ఆవిష్కరణల హాకథాన్) ను కేంద్ర సహాయ మంత్రి శ్రీ సంజయ్ థోత్రే సమక్షంలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా ప్రారంభించారు.
ఈ ఔషధ ఆవిష్కరణ హాకథాన్‌ను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఎఐసిటిఇ, సిఎస్ఐఆర్ లు సంయుక్తంగా చేపట్టాయి. దీనికి భాగస్వామ్య సంస్థలైన సిడిఎఐసి, మైగవ్,షోర్డింగర్, చెమ్ యాక్సాన్ మద్దతు నిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ విజయ రాఘవన్, ఎఐసిటిఇ ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్ర బుద్దే, ,సిఎస్ఐఆర్ డిజి డాక్టర్ శేఖర్ మండే, ఎఐసిటిఇ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ కుమార్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ బి.సురేష్, ఎం.హెచ్.ఆర్.డి. ఛీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ డాక్టర్ అభయ్ జెరే లు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీ పోఖ్రియాల్, ఔషధ ఆవిష్కరణలకు మద్దతు నిచ్చేందుకు , ఇలాంటి హాకథాన్ నిర్వహణకు జాతీయ స్థాయిలో చొరవ చూపడం ఇదే మొదటి సారి అని అన్నారు. అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించేందుకు ఇందులో అవకాశం కల్పించారు. ఈ హాకథాన్ ప్రపంచవ్యాప్తంగా గల శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఫాకల్టీ, విద్యార్థులు, కంప్యూటర్ సైన్స్, రసాయన శాస్త్రం, ఫార్మసీ, మెడికల్ సైన్సెస్, బేసిక్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాలకు చెందిన వారు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఎఐసిటిఇలకు హాకథాన్‌లు ఏర్పాటు చేయడంలో ఎంతో అనుభవం ఉందని, అయితే తొలిసారిగా ఒక గొప్ప శాస్త్రవిజ్ఞాన సవాలును ఎదుర్కొనేందుకు ఈ హాకథాన్ నమూనాను ఉపయోగించుకుంటున్నామని ఆయన అన్నారు. మరింత ముఖ్యంగా , ఇది ప్రపంచవ్యాప్తంగా గల పరిశొధకులు, ఫాకల్టీ సభ్యులు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తుంది. మనం సాగిస్తున్న కృషిలో అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడానికి, మన కృషికి మద్దతుగా వారు చేతులు కలపడానికి ఇది పనికివస్తుంది.
ఈ హాకథాన్‌లో పాల్గొన్నవారినుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, మన దేశంలో కంప్యుటేషనల్ పద్ధతిలో ఔషధాల ఆవిష్కరణ సంస్కృతిని ఏర్పాటు చేయవలసి ఉందని అన్నారు. ఎం.హెచ్.ఆర్.డి నవకల్పనల విభాగం, ఎఐసిటిఇ లు ఈ హాకథాన్ ద్వారా కీలక ఔషధ మాలిక్యూల్స్‌ను గుర్తించడంపై దృష్టిపెడతాయన్నారు. ఇలా గుర్తించిన మాలిక్యూల్స్ ను సమర్థత, విషపూరితత్వం, సున్నితత్వం ప్రత్యేకతలను గుర్తించడం కోసం ప్రయోగశాల పరీక్ష కోసం సిఎస్ఐఆర్ పంపుతుంది.దీని లక్ష్యం సార్స్-సిఒవి-2 నిరోధానికి ఔషధంగా ఉపయోగపడే దానిని ఇన్ సిలికో డ్రగ్ డిస్కవరీ విధానంలో గుర్తించడం. అటు నుంచి దీనిని రసాయన సంశ్లేషణ, బయొలాజికల్ పరీక్షలు నిర్వహించడం. ఔషధ ఆవిష్కరణ అనేది సంక్లిష్టమైన, ఖర్చుతో కూడిన , క్లిష్టతరమైన ప్రక్రియ అని ఒక కొత్త ఔషధాన్ని అభివృద్ది చేయడానికి 10 సంవత్సరాలకు పైగా పడుతుందని డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. ప్రస్తుత మందుల నుంచే వాటి కొత్త ఉపయోగాలను తెలుసుకుంటూ క్లినికల్ పరంగా ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించడం వల్ల కొవిడ్ -19కు త్వరగా ప్రత్యేక ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి వీలు కలుగుతుందని ఆయన అన్నారు. ఇన్ సిలికో డ్రగ్ డిస్కవరీలో కంప్యుటేషనల్ పద్ధతులైన మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ, బిగ్ డాటా వంటివి ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే ఈ హాకథాన్ ప్రయత్నాన్ని అభినందించారు. ప్రభుత్వం ఈ హాకథాన్ సంస్కృతిని దేశంలో తీసుకువచ్చిందని, దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారాలను కనుగొనే సవాలును యువత ముందుంచిందని ఆయన అన్నారు.
భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ శాస్త్ర విజ్ఞాన సలహాదారు, ఈ కార్యక్రమ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ ప్రొఫెసర్ కె. విజయ రాఘవన్ మాట్లాడుతూ, ఔషధాల ఆవిష్కరణల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇండియా కొత్త నమూనాను నెలకొల్పేందుకు ఈ హాకథాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇందులో మూడు దశలకు ఒక్కొక్క దానికి మూడునెలల వ్యవధి ఉందని , ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 2021 ఏప్రిల్ - మే నెల పడుతుందని ఆయన అన్నారు. చివరలో ప్రతి దశలో విజయవంతమైన బృందాలకు బహుమతి ఉంటుందన్నారు. మూడవ దశలో గుర్తించిన కీలక మిశ్రమాలను సి.ఎస్.ఐ.ఆర్, ఇతర ఆసక్తి గల సంస్థల వద్ద పరిశోధన స్థాయికి తీసుకువెళ్లడం జరుగుతుంది.
ఈ హాకథాన్ ప్రధానంగా ఔషధ ఆవిష్కరణకు సంబంధించి కంప్యుటేషనల్ అంశాలపై ప్రధానంగా దృష్టిపెడుతుంది. ఇందుకు సంబంధించి మూడు ట్రాక్‌లు ఉన్నాయి. అందులో ట్రాక్ -1 డ్రగ్ డిజైన్ కు సంబంధించి కంప్యుటేషనల్ మోడలింగ్ లేదా ప్రస్తుత డాటాబేస్ నుంచి సార్స్ -సిఒవి 2 ను అంతం చేసే శక్తి కలిగిన లీడ్ కాంపౌండ్‌లను గుర్తించడం ఇందులో ముఖ్యమైనది. తక్కువ విశ్లేషణ , గరిష్ట విశిష్టత సరైన ఎంపికతో ఔషధాల లాంటి సమ్మేళనాలను అంచనా వేయడానికి డేటా అనలిటిక్స్ కృత్రిమ మేధ, ఎంఎల్ విధానాన్ని ఉపయోగించి కొత్త సాధనాలు అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయడానికి ఇందులో పాల్గొనేవారిని ట్రాక్ -2 ప్రోత్సహిస్తుంది. ఇక మూడవ ట్రాక్ . దీనిని ట్రాక్ -3 అని మూన్ -షాట్ విధానం అని అంటారు . ఇది ఈ రంగంలో వినూత్న , సాధరణ ఆలోచనలకు భిన్నమైన ఆలోచనలకు అవకాశం కల్పిస్తుంది.
ఈ మూడు దశల పోటీలో తొలి దశ ఈరోజు ప్రారంభమైంది. ఈ హాకథాన్ లో సవాళ్లు ఉంటాయి. వీటిని సమస్యలుగా పోస్ట్ చేస్తారు.ఇవి నిర్దిష్ట ఔషధ ఆవిష్కరణ అంశాలపై ఆధారపడి ఉంటాయి ఇందులో పాల్గొనేవారు వీటిని పరిష్కరించాల్సి ఉంటుంది.
ఈ పోటీ లోభారతీయ విద్యార్ధులు, దేశ విదేశాల్లోని పరిశోధకులు అందరూ పాల్గొనవచ్చు. ఈ పోటీలో వేలాది మంది విద్యార్థులు పాల్గొంటారని ఆశిస్తున్నారు. ఇది ఆన్‌లైన్ పోటీ అయినందున దేశంలోని లేదా ప్రపంచంలోని ఎక్కడి వారైనా ఇందులో పాల్గొనవచ్చు. ఇందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారు. ఎంట్రీలను పొటీకి రెండు దశలలో స్వీకరిస్తారు. రెండో దశలో అత్యుత్తమ మైన రెండు మూడవ దశకు వెళతాయి. మూడవ స్టేజి చివర పోటీలో ఉత్తమ పరిష్కారాలైన డ్రగ్ మాలిక్యూల్్, డ్రగ్ టార్గెట్లను తదుపరి పరీక్షల స్థాయికి తీసుకువెళ్లి వీటి అంచనాల విషయమై సిఎస్ఐఆర్ పరిశోధనశాల లేద స్టార్టప్‌ల వద్ద దృవీకరణకు గురిచేస్తారు.
ఈ తొలిదశ ప్రారంభొత్సవ కార్యక్రమంలో ఛీప్ ఇన్నొవేషన్ ఆఫీసర్ డాక్టర్ అభయ్ జెరే డ్రగ్ డిస్కవరీ హాకథాన్ కు సంబంధించిన అంశాలను వివరించారు. ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే ఎఐసిటిఇ నుంచి తమ వంతు మద్దతును అందించారు. ఈ హాకథాన్ లో పెద్ద సంఖ్యలో పాల్గొన వలసిందిగా అన్ని సాంకేతిక సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. సమస్యకు సంబంధించిన స్టేట్‌మెంట్లను అబివృద్ధి చేయడంలొ మద్దతు నిచ్చిన నిపుణులందరికీ ప్రొఫెసర్ సహస్రబుద్ధే కృతజ్ఞతలు తెలిపారు
హాకథాన్ విధానం, నేపథ్యం:
-
హాకథాన్‌లో సవాళ్లు ఉంటాయి . వీటిని సమస్యల ప్రకటనలుగా పొస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ప్రత్యేక డ్రగ్ డిస్రవరీ టాపిక్‌లపై ఆధారపడినవి. వీటిని ఈహాకథాన్‌లో పాల్గొన్నవారు పరిష్కరించవలసి ఉంటుంది.
-
మైగవ్ పోర్టల్‌ను ఉపయోగించి భారతీయ విద్యార్థి ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు.
-
ప్రపంచంలొని ఎక్కడివారైనా ప్రొఫెషనల్స్, పరిశోధకులు ఇందులో పాల్గొనవచ్చు.
-
రెండు రకాల సవాళ్లకు సంబంధించిన సమస్యల స్టేట్‌మెంట్‌లను ఇవ్వనున్నారు.ఇందుకు సంబంధించి మొత్తం 29 సమస్యల స్టేట్‌మెంట్లను గుర్తించారు.
-
ట్రాక్ -1 ప్రధానంగా కోవిడ్ -19 వ్యతిరేక ఔషధ రూపకల్పనకు సంబంధించినది.మాలిక్యులార్ మోడలింగ్, ఫార్మాకొఫోర్ ఆప్టిమైజేషన్, మాలిక్యులార్ డాకింగ్ ,హిట్, లీడ్ ఆప్టిమైజేషన్ ఉపకరణాల ద్వారా దీనిని చేపడతారు
-
ట్రాక్ -2 ఇది కొత్త డిజైనింగ్ , కొత్త ఉపకరణాలు, ఆల్గోరిథమ్స్ ఆప్టిమైజింగ్ కు సంబంధించినది. ఇన్ సిలికొ డ్రగ్ డిస్కవరీ ప్రక్రియపై ఇది ఎంతగానో ప్రభావం చూపనుంది.
-
ఇందులో మూడో ట్రాక్ ను మూన్ షాట్ అంటారు. ఇది వివిధ సమస్యలపై .వినూత్న ఆలోచనలకు అవకాశం కల్పిస్తుంది.
డ్రగ్ డిస్కవరీ హాకథాన్ 2020 పై మరిన్ని వివరాల కోసం https://innovateindia.mygov.in/ddh2020/ లింక్‌ను క్లిక్ చేయండి.
****
(Release ID: 1636039)
Visitor Counter : 358