ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి మరియు రష్యా అధ్యక్షుని మధ్య టెలిఫోన్ సంభాషణ


Posted On: 02 JUL 2020 3:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2020 జులై, 2వ తేదీన రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ  వ్లాదిమిర్ పుతిన్ తో టెలీఫోనులో మాట్లాడారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో విజయానికి గుర్తుగా 75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మరియు రష్యాలో రాజ్యాంగ సవరణలపై ఓటును విజయవంతంగా పూర్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధానమంత్రి  హృదయపూర్వకంగా అభినందించారు.

భారతదేశం మరియు రష్యా ప్రజల మధ్య స్నేహాన్ని కొనసాగించడానికి చిహ్నంగా 2020 జూన్ 24వ తేదీన  మాస్కో లో జరిగిన సైనిక కవాతులో ఒక భారతీయ బృందం పాల్గొనడాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తు చేశారు.

కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి యొక్క ప్రతికూల పరిణామాలను పరిష్కరించడానికి ఇరు దేశాలు చేపట్టిన సమర్థవంతమైన చర్యలను నాయకులు పరస్పరం తెలియజేసుకున్నారు. కోవిడ్ అనంతర ప్రపంచంలోని సవాళ్లను సంయుక్తంగా పరిష్కరించడానికి భారతదేశం-రష్యా సంబంధాల యొక్క ప్రాముఖ్యత పై ఇరువురు నాయకులు అంగీకరించారు.

ఈ ఏడాది చివర్లో భారతదేశంలో జరిగే, వార్షిక ద్వైపాక్షిక సదస్సుకు దారితీసే, ద్వైపాక్షిక ఒప్పందాలు మరియు సంప్రదింపుల వేగాన్ని కొనసాగించడానికి వారు అంగీకరించారు.  ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు విచ్చేస్తున్న అధ్యక్షుడు పుతిన్ ‌కు భారతదేశంలో స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు, ప్రధానమంత్రి తెలియజేశారు.

ప్రధానమంత్రి ఫోను చేసినందుకు అధ్యక్షుడు పుతిన్ కృతజ్ఞతలు తెలిపారు.  అన్ని రంగాలలో ఇరు దేశాల మధ్య ప్రత్యేక మరియు గౌరవప్రదమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న తన నిబద్ధతను ఆయన ఈ సందర్భంగా  పునరుద్ఘాటించారు.

 

 

*****



(Release ID: 1635968) Visitor Counter : 290