యు పి ఎస్ సి

యు.పి.ఎస్.సి. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష - 2020 మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష - 2020


పరీక్షా కేంద్రం ఎంపికను సమర్పించడానికి అభ్యర్థులకు నోటీసు

Posted On: 01 JUL 2020 1:37PM by PIB Hyderabad

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 05.06.2020 తేదీన ప్రచురించిన సవరించిన పరీక్షా కార్యక్రమం ప్రకారం, సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2020 [ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2020 తో సహా] 04.10.2020 తేదీ ఆదివారం రోజున భారతదేశమంతటా నిర్వహిస్తుంది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2020 తో సహా సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2020 కి అభ్యర్థులు  పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న కారణంగానూ, అభ్యర్థులలో ఎక్కువ మంది, తమ కేంద్రాలను మార్చవలసిందిగా కోరుతూ సమర్పించిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థులు, తమ పరీక్షా కేంద్రాలను సవరించుకోవడానికి వీలుగా అవకాశం ఇవ్వాలని కమీషన్ నిర్ణయించింది.  దీనితో పాటు, సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2020 మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష, 2020 లకు హాజరయ్యే అభ్యర్థులకు కూడా తమ పరీక్షా కేంద్రాలను  సవరించుకునే అవకాశం కల్పించారు. అయితే, అదనపు అభ్యర్థులకు వసతి కల్పించడానికి వీలుగా, ఆయా కేంద్రాలు తెలియజేసిన అదనపు / మెరుగైన సామర్థ్యానికి అనుగుణంగా అభ్యర్థుల విజ్ఞప్తులు పరిగణించబడతాయి.

అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న కేంద్రాలతో కూడిన విజ్ఞప్తులను కమీషన్ వెబ్ సైట్  https://upsconline.nic.in కు చెందిన సంబంధిత విండో ద్వారా రెండు దశల్లో  అనగా 2020 జూలై, 7వ తేదీ నుండి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మరియు 2020 జూలై, 20వ తేదీ నుండి 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు సమర్పించవచ్చు.  అవసరమైతే, అభ్యర్థులు, కమీషన్ వెబ్‌సైట్‌ను సందర్శించి, తాము ఎంపిక చేసుకున్న కేంద్రాల వివరాలతో కూడిన అభ్యర్థనలను సమర్పించుకోవచ్చు.

"మొదటి-దరఖాస్తు-మొదటి కేటాయింపు" ప్రాతిపదిక సూత్రం ఆధారంగా కేంద్రాలలో మార్పు కోసం వారి అభ్యర్థనలు పరిగణించబడతాయని అభ్యర్థులు దయచేసి గమనించాలి. [ఇది కమిషన్ యొక్క అన్ని పరీక్షలలో అనుసరించబడుతుంది.  మరియు ఈ విషయం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2020 మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష, 2020 నోటీసులతో కూడా పేర్కొనబడింది]  మరియు ఒక నిర్దిష్ట కేంద్రం యొక్క సామర్థ్యం నిండిన తర్వాత, ఆ కేంద్రంలో అవకాశం స్తంభింపచేయబడుతుంది.  సీలింగ్ కారణంగా, తమకు నచ్చిన కేంద్రాన్ని పొందలేని అభ్యర్థులు, మిగిలిన కేంద్రాల నుండి మాత్రమే ఒక కేంద్రాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2020 నోటీసు నెంబరు: 05/2020-సి.ఎస్.పి., తేదీ: 12/02/2020 మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష, 2020 నోటీసు నెంబరు: 06/2020-ఐ.ఎఫ్.ఓ.ఎస్., తేదీ: 12/02/2020 లలో పేర్కొన్న షరతులు మరియు అర్హతల్లో ఎటువంటి మార్పు లేదు.

పై వాటితో పాటు, అభ్యర్థుల కోసం, కమిషన్ వెబ్‌సైట్‌    https://upsconline.nic.in  లో ఒక ఉపసంహరణ విండోను కూడా 2020 ఆగష్టు 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు కమీషన్ అందుబాటులోకి తెస్తుంది.

దరఖాస్తు ఉపసంహరణ యొక్క అన్ని నిబంధనలు మరియు షరతులు సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష, 2020 నోటీసు నెంబరు: 05/2020-సి.ఎస్.పి., తేదీ: 12/02/2020 మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష, 2020 నోటీసు నెంబరు: 06/2020-ఐ.ఎఫ్.ఓ.ఎస్., తేదీ: 12/02/2020 లో పేర్కొన్న విధంగానే ఉంటాయి.

అభ్యర్థి తమ దరఖాస్తును ఉపసంహరించుకున్న అనంతరం, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పునరుద్ధరించడం కుదరదని అభ్యర్థులు గమనించాలి.

 

 

************



(Release ID: 1635760) Visitor Counter : 230