రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 సవాలు సమయంలోనూ కూడా రైతులకు ఎరువులు లభించేలా ఆర్‌సీఎఫ్ చర్యలు
ఖరీఫ్ సీజన్ కోసం 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుమతి చేసుకున్న ఎరువులనూ అందుబాటులోకి తెచ్చిన ఆర్‌సీఎఫ్
Posted On:
01 JUL 2020 4:07PM by PIB Hyderabad
రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్) భారత వ్యవసాయ రంగం యొక్క శ్రేయస్సుకు కట్టుబడి పని చేస్తోంది. కోవిడ్-19 వంటి అత్యంత సవాలు సమయంలో కూడా, ఆర్‌సీఎఫ్ తన అగ్ర బ్రాండ్ ఎరువులైన ‘ఉజ్జ్వాలా’ యూరియా మరియు ‘సుఫాలా’లు ఖరీఫ్ సీజన్‌లో దేశ రైతులకు

లభించేలా చూసుకుంది. కోవిడ్ మహమ్మారి విస్తరణ నేపథ్యంలోనూ ఆర్‌సీఎఫ్ సంస్థ ప్లాంట్లు పనిచేశాయి. వీటి నుంచి ఎరువుల ఉత్పత్తి తగినంత పరిమాణంలో జరిగింది. ఆర్‌సీఎఫ్ తాను తయారు చేసిన ఎరువులే కాకుండా దాదాపుగా రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వర్తకం చేసిన సంక్లిష్ట ఎరువులను కూడా భారత రైతాంగం కోసం అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు అవసరమైన డీఏపీ, ఏపీఎస్ (20: 20: 0: 13) మరియు ఎన్‌పీకే (10: 26:26)లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ప్రచురించిన నివేదిక ప్రకారం ఆర్‌సీఎఫ్ సంస్థ టాప్ 500 ఇండియా ఫార్చ్యూన్ కంపెనీలలో 155వ స్థానానికి ఎగబాకింది. అంతకు ముందు సంస్థ 2018 వ ఏడాదిలో 191వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు తాజాగా ప్రకటించిన జాబితాలో 155వ స్థానానికి చేరుకుంది.
ఆర్‌సీఎఫ్ సంస్థ సీఎమ్‌డీ ఎస్.సి.ముద్గేరికర్ మాట్లాడుతూ, ఆర్‌సీఎఫ్ ఉద్యోగులు చాలా సవాలుగా ఉన్న కాలంలో చేసిన కృషి మరియు ఎరువుల శాఖ బృందం నుంచి తమకు లభించిన పూర్తి మద్దతు మరియు నిరంతరమైన మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహం వల్లనే ఈ విజయాలు సాధించగలిగామని తెలిపారు.
*******
(Release ID: 1635709)
Visitor Counter : 355