హోం మంత్రిత్వ శాఖ
వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా వైద్యులకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సవాలు సమయాల్లో దేశాన్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడానికి మన వైద్యుల నిబద్ధత నిజంగా అసాధారణమైనదని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు
మానవాళికి సేవ చేయడానికి 24 గంటలూ నిస్వార్థంగా పనిచేస్తున్న మన వైద్యులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అండగా నిలుస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు
"మన దేశం లోని సాహసోపేతమైన కరోనా యోధుల మెరుగైన ఆరోగ్యం మరియు భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను, మొత్తం దేశం వైద్యుల అంకిత భావం మరియు త్యాగానికి నమస్కరిస్తుంది." అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు
ఇలాంటి పరీక్షా సమయాల్లో వైద్యులకు పూర్తి సహకారం, నైతిక మద్దతు అందిస్తున్న వైద్యుల కుటుంబ సభ్యులకు కేంద్ర హోం మంత్రి కృతజ్ఞతలు తెలిపారు
Posted On:
01 JUL 2020 2:46PM by PIB Hyderabad
ఈ రోజు వైద్యుల దినోత్సవం సందర్భంగా, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఒక ట్వీట్ చేస్తూ, కోవిడ్-19 కు వ్యతిరేకంగా ముందంజలో ఉండి యుద్ధానికి ధైర్యంగా నాయకత్వం వహిస్తున్న భారత వైద్యులకు కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సవాలు సమయాల్లో దేశాన్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచాలనే వారి అత్యంత నిబద్ధత నిజంగా అసాధారణమైనదని కేంద్ర హోం మంత్రి ఉద్ఘాటించారు.
వైద్యుల దినోత్సవం సందర్భంగా, వారి అంకిత భావం మరియు త్యాగానికి దేశం యావత్తూ, వారికి అభివందనాలు పలుకుతోందని కేంద్ర మంత్రి తెలిపారు.
మానవాళికి సేవ చేయడానికి 24 గంటలూ నిస్వార్థంగా పనిచేస్తున్న మన వైద్యులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అండగా నిలుస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు. మన దేశంలోని సాహసోపేతమైన కరోనా యోధుల ఆరోగ్యం మరియు భద్రత కోసం కూడా ఆయన ప్రార్థించారు.
ఇలాంటి పరీక్షా సమయాల్లో, వైద్యులకు పూర్తి సహకారం, నైతిక మద్దతు అందిస్తున్న వైద్యుల కుటుంబ సభ్యులకు కేంద్ర హోంమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
*******
(Release ID: 1635704)
Visitor Counter : 229