శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొవిడ్‌ నమూనాల పరీక్షల కోసం అధునాతన వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటు చేసిన ఎన్‌బీఆర్‌ఐ

Posted On: 30 JUN 2020 12:28PM by PIB Hyderabad

 

పుణెలోని జాతీయ వృక్ష పరిశోధన సంస్థ (ఎన్‌బీఆర్‌ఐ) కొవిడ్‌ నమూనాల పరీక్షల కోసం "అధునాతన వైరాలజీ ల్యాబ్‌" ఏర్పాటు చేసింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా దీనిని ఏర్పాటు చేశారు. 

                ఇది, 'జీవ భద్రత స్థాయి' (బీఎస్‌ఎల్‌)-3 స్థాయి కేంద్రం. "వ్యాధి కారకాన్ని బట్టి, దానిని నిర్వహించే కేంద్రానికి జీవ భద్రత స్థాయిని కేటాయిస్తారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం, కొవిడ్‌ పరీక్షలకు బీఎస్‌ఎల్‌-2 స్థాయి చాలు. కానీ, ఇది ఇంకా ఆధునిక కేంద్రం." అని ఎన్‌బీఆర్‌ఐ సీనియర్‌ సైంటిస్ట్‌ డా.సమీర్‌ సావంత్‌ చెప్పారు. ఈ అధునిక కేంద్రంలో నెగెటివ్ ప్రెజర్ఉంది. అంటే ఇది తుంపర్లను పీల్చుకుని ఫిల్టర్ల ద్వారా పంపించగలదు. వైరస్‌, బ్యాక్టీరియాలను ఇది వడగట్టి, పరీక్ష కేంద్రాన్ని సురక్షితంగా ఉంచుతుంది. పరీక్ష సమయంలో వైరస్‌ వ్యాపించకుండా అడ్డుకుంటుంది.

 

అధునాతన వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

 

                ఉత్తరప్రదేశ్‌ కొవిడ్‌ పరీక్షలకు ఈ ల్యాబ్‌ను అనుసంధానిస్తామని ఎన్‌బీఆర్‌ఐ డైరెక్టర్‌ ప్రొ.ఎస్‌.కె.బారిక్‌ చెప్పారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో రోజుకు ఇరవై వేల నమూనాలు పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రొటోకాల్‌ ప్రకారం, తొలివారంలో రోజుకు వంద నమూనాలను పరీక్షిస్తామని, తర్వాత రోజుకు ఐదు వందలకు పెంచుతామని వివరించారు.

                "ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీఎస్‌ఐఆర్‌-డీజీ విజ్ఞప్తితో, ప్రజలకు సేవ చేయడానికి వైరాలజీ ల్యాబ్‌ను ఎన్‌బీఆర్‌ఐ ఏర్పాటు చేసింది. కొవిడ్‌ పరీక్షల్లో పాల్గొనేందుకు, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ ఆరోమాటిక్‌ ప్లాంట్స్‌ (సీఐఎంఏపీ) సైంటిస్టులు కూడా ఎన్‌బీఆర్‌ఐతో కలుస్తారు" అని ప్రొ. బారిక్‌ తెలిపారు.

 

****(Release ID: 1635414) Visitor Counter : 64