గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

భారత గిరిజనుల ఉత్పత్తులను జీఈఎం వేదిక‌పైన ఆవిష్క‌రించిన శ్రీ అర్జున్ ముండా


ట్రైఫెడ్ వెబ్‌సైట్‌నూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కేంద్ర మంత్రి

'బి వోక‌ల్ ఫ‌ర్ లోక‌ల్' వెబ్‌నార్‌ మరియు గిరిజనులను ప్రధాన స్రవంతితో అనుసంధానించడానికి.. గో డిజిటల్‌-ట్రైఫెడ్‌ అనే భారీ డిజిటలైజేషన్ డ్రైవ్ ప్రారంభం

Posted On: 28 JUN 2020 2:05PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మన దేశంలో నెల‌కొన్న అసాధార‌ణ పరిస్థితి సమాజంలోని అన్ని వర్గాల వారినీ ప్రభావితం చేసింది. కోవిడ్ కార‌ణంగా పేద మరియు అట్టడుగు వర్గాల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సంక్ష‌భ కాలంలో గిరిజనులు కూడా చాలా ఘోరంగా ప్రభావితమయ్యారు. ఇలాంటి తీవ్ర‌ సమస్యాత్మక సమయాల్లో గిరిజన చేతివృత్తుల భారాన్ని తగ్గించడానికి, గిరిజనుల జీవనోపాధి అభివృద్ధిని కొనసాగించడానికి, వెనుకబడిన ఆర్థిక కార్యకలాపాలను తిరిగి శక్తివంతం చేయడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక స‌త్వ‌ర కార్యక్రమాలను ప్రారంభించింది.


జీవనోపాధిని మార్చే దిశ‌గా అడుగులు గిరిజ‌నుల‌కు సంబంధించిన ట్రైఫెడ్ డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్స్‌ ప్రారంభోత్స‌వంలో కేంద్ర గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి అర్జున్ ముండా వీడియో కాన్ఫ‌రెన్సింగ్ విధానంలో పాల్గొని ప్ర‌సంగించారు. "ట్రైఫెడ్ వారియర్స్" బృందం గిరిజనుల‌ జీవితాలను మరియు జీవనోపాధిని మార్చడానికి గాను అటవీ ఉత్పత్తి, చేనేత వస్త్రాలు మరియు హస్త కళలతో కూడిన గిరిజనుల వాణిజ్యాన్ని కొత్త ఉన్న‌త శ్రేణుల‌కు తీసుకువెళుతుందని అన్నారు. వ్యాపార కార్యకలాపాలు, షాపింగ్ మరియు కమ్యూనికేషన్లతో పాటు వివిధ అవసరాల కోసం ఎక్కువ మంది ప్రజలు ఇటీవ‌ల ఆన్‌లైన్ వైపున‌కు చూస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో గ్రామ ఆధారిత గిరిజన ఉత్పత్తిదారులను మ్యాప్ చేయడానికి మరియు అనుసంధానించడానికి గాను..  డిజిటలైజేషన్ డ్రైవ్‌ను అవలంబించడం ఒక మేటి ప‌రిణామం అని అన్నారు.


అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన అత్యాధునిక‌మైన మేటి ఈ- ప్లాట్‌ఫామ్‌ల్ని అందిపుచ్చుకొని గ్రామీణ ఆధారిత గిరిజ‌నుల‌ ఉత్ప‌త్తుల‌ను జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల‌కు చేరేలా ముఖ్యమైన వ్యూహాత్మక విధానంతో ముందు‌కు సాగితే మంచి ఫ‌లితాలుంటాయ‌ని అన్నారు. ఇదే విష‌యాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారిస్తూ ఈ రోజు ట్రైఫెడ్ నిర్వహించిన వెబ్‌నార్ ‘ట్రైఫెడ్ గోస్ డిజిట‌ల్‌’ మరియు “బీ ఓక‌ల్ ఫ‌ర్ లోక్‌” #గోట్రైబ‌ల్ వెబ్‌నార్‌లు జ‌రిగాయి. వీటిలో దాదాపు 200 మందికి పైగా పాల్గొన్నారు.

A person sitting in front of a computer screenDescription automatically generated


మంత్రి హృదయపూర్వక ప్రశంసలు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా చేతల మీదుగా ట్రైబ్స్‌ ఇండియా ఉత్పత్తుల్ని కేంద్ర ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్‌లో  (జీఈఎం) (విభిన్న శ్రేణి ప్రదర్శనతో) ఆవిష్క‌రించారు. దీనికి తోడు ట్రైఫెడ్‌ యొక్క కొత్త వెబ్‌సైట్ (https://trifedtribal.gov.in) ను కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. ట్రైఫెడ్ ఛైర్మ‌న్ శ్రీ రమేష్ చంద్ మీనా, ట్రైఫెడ్ బోర్డు సభ్యుడు ప్రతిభా బ్రహ్మ, జీఈఎం జేఎస్ & సీఎఫ్ఓ శ్రీ రాజీవ్ కండ్‌పాల్, పీఐబీ ఏడీజీ ‌శ్రీమతి నాను భాసిన్ త‌దిత‌రులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ట్రైఫెడ్ బృందానికి అన్ని విభాగాధిపతులు, ఉన్నతాధికారులు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా మంత్రి హృదయపూర్వక ప్రశంసలను వ్యక్తం చేశారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా మొదట ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్‌లో ట్రైబ్స్ ఇండియా స్టోర్‌ను ప్రారంభించారు. ఇది కొనుగోళ్లను మ‌రింత సులభతరం చేయడంలో సహాయపడుతుంద‌ని అన్నారు. అప్పుడు పునరుద్ధరించిన వెబ్‌సైట్ (https: //trifed.tribal.gov.in/) గిరిజన వర్గాల ప్రయోజనాల కోసం జరుగుతున్న పథకాలు మరియు కార్యక్రమాల సంబంధిత స‌మాచారం, ఇత‌ర  వివరాల్ని కూడా కలిగి ఉంటుంద‌ని అన్నారు.

A flat screen televisionDescription automatically generated


గిరిజనుల‌ సాధికారత ప్రధాన స్రవంతి నుండి దూరం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రస్తుత అసాధార‌ణ పరిస్థితి గురించి మరియు వలస కార్మికులు బాగా నష్టపోయార‌ని మంత్రి వెల్ల‌డించారు. గిరిజన చేతి వృత్తుల వారు, గిరిజన సంగ్రాహకుల యొక్క ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించడానికి "ట్రైఫెడ్‌ వారియర్స్" మరియు మంత్రిత్వ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాల విష‌యమై ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గిరిజన వర్గాలకు సాధికారత వారి నైపుణ్యాలను ఉపయోగించుకోవడం ఇప్పటివరకు ప్రధాన స్రవంతి నుండి విడ‌దీయ‌బ‌డింద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో గిరిజన వర్గాల‌ వారికి త‌గిన సాధికారత ఇవ్వడంపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు అపూర్వమైన పరిస్థితుల్లో అందుబాటులోకి వ‌చ్చిన అవకాశాలనూ మనం వినియోగించుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. గిరిజనులను ప్రధాన స్రవంతికి అనుసంధానించడంలో ట్రైఫెడ్‌ ప్రధాన పాత్ర పోషిస్తోందని శ్రీ ముండా అభిప్రాయపడ్డారు మరియు ఈ రోజు ప్రారంభించిన వారి రెండు ప్రధాన కార్యక్రమాలకు కృషి చేసిన జట్టును అభినందించారు. గిరిజన వర్గాలు, ముఖ్యంగా అడవికి సంబంధించి, సమాచారం మరియు జ్ఞానం యొక్క సంపదను వెలికితీసి ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని, మరియు ఆదివాసి సమాజానికి ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే కాకుండా ఈ సమస్యాత్మక కాలంలో దేశానికి ఎక్కువ సహాయం చేయటానికి ఎలా ఉపయోగపడుతుందో యోచించాల‌ని కోరారు.

గిరిజ‌నుల ఆర్థిక వ్య‌వ‌స్థ రెండు నుంచి మూడు రెట్ల వృద్ధి ట్రైఫెడ్ కార్యకలాపాలపై ఈ వివరణాత్మకమైన‌ ప్రదర్శన అనంత‌రం ట్రైఫెడ్ సంస్థ ఛైర్మన్ శ్రీ రమేష్ చంద్ మీనా ట్రైఫెడ్‌ బృందాన్ని నిరంతర కృషిని అభినందించారు. ఈ చ‌ర్య‌ల‌తో 2 లక్షల కోట్ల గిరిజన ఆర్థిక వ్యవస్థ క‌చ్చితంగా రెట్టింపు లేదా మూడు రెట్లు పెరుగ‌గ‌ల‌ద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. తాజాగా చేప‌ట్టిన‌ ప్రయత్నాల‌తో  గిరిజన సేకరణదారులు మరియు చేతి వృత్తులవారి ఉత్పత్తులు, ఉత్పాద‌కాల‌కు క‌చ్చితంగా స్వ‌దేశంలోనూ మరియు విదేశాల్లోనూ గ‌రిష్ఠంగా క‌వ‌రేజీ ల‌భించ‌నుంద‌ని వెల్ల‌డించారు.

కేంద్ర మంత్రి నిరంతర మద్దతు అభినంద‌నీయం ట్రైఫెడ్ డైరెక్ట‌ర్ శ్రీ ప్ర‌వీర్‌కృష్ణా కార్య‌క్ర‌మంలో స్వాగత ప్రసంగం చేస్తూ రెండు డిజిటల్ కార్యక్రమాలను వెబ్‌నార్ ద్వారా లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలా చేయ‌డం దేశంలో క‌చ్చితంగా ఇదే మొద‌టిదై ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. గిరిజన సంక్షేమం కోసం కేంద్ర మంత్రి నిరంతరాయంగా ఇస్తున్న మద్దతును ఆయ‌న ఈ సంద‌ర్భంగా అభినందించారు. అనంత‌రం ఆయ‌న ట్రైఫెడ్ యొక్క ప్రతిష్టాత్మక డిజిటలైజేషన్ డ్రైవ్ గురించి వివ‌రించారు. ఇది దాదాపు 50 లక్షలకు పైగా గిరిజనులకు (చేతివృత్తులవారు, సేకరించేవారు, నివాసులు) స‌మాన పోటీదారుల‌కు దీటుగా నిల‌ప‌డ‌మే దీని ల‌క్ష్యమ‌ని ఆయ‌న అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారిని ప్రధాన స్రవంతిలోకి తేవ‌డమే ల‌క్ష్యంగా వీటిని రూపొందించిన‌ట్టుగా తెలిపారు. జీఈఎం వేద‌క‌పైకి ట్రైబ్స్ ఇండియా స్టోర్‌ను అందుబాటులోకి తేవ‌డ‌మ‌నే విష‌యాన్ని సాకారం చేసినందుకు స‌హ‌క‌రించిన‌ జీఈఎం బృందానికి ఆయ‌న త‌న కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ విభాగాలు మంత్రిత్వ శాఖలు ట్రైబ్స్‌ ఉత్పత్తులు కొనే వీలు జీఈఎం సంస్థ జేఎస్ & సీఎఫ్‌ఓ జీఎం శ్రీ రాజీవ్ కాండ్‌పాల్ మాట్లాడుతూ ట్రైఫెడ్ ఇండియా స్టోర్‌ను జీఈఎం డిజిట‌ల్ వేదిక‌పైకి తెచ్చేందుకు  గాను జీఈఎం, ట్రైఫెడ్‌ బృందాలు ఎలా శ్ర‌మించాయ‌న్న విష‌యాన్ని వివ‌రించారు. తాజా చ‌ర్య‌ల‌తో ప్రభుత్వ విభాగాలు మంత్రిత్వ శాఖలు మరియు పీఎస్‌యూలు ఇక‌పై ట్రైబ్స్‌ ఇండియా ఉత్పత్తులను ప్రభుత్వ ఈ - మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) ద్వారా పొందేందుకు వీలు క‌ల్పించ‌నుంది. తాజా చ‌ర్య‌తో జీఎఫ్ఆర్ నిబంధనల ప్రకారం వారు షాపింగ్ చేసేందుకు త‌గిన వీలు క‌లుగ‌నుంది. జీఈఎంలో సామాజిక చేరికలు ప్రధానంగా ఉన్నాయి స్టార్ట్‌అప్‌లు, గ్రామీణ పారిశ్రామిక వేత్తలు, గిరిజన పారిశ్రామికవేత్తలు, మహిళలు, గిరిజనులు వంటి సముచిత సరఫరాదారులను ప్రోత్సహించ‌డంపై ప్ర‌ధానంగా తాము దృష్టి సారించ‌డ‌మైంద‌ని అన్నారు. కొత్తగా ప్రారంభించిన గ్రామీణాభివృద్ధి స్టోర్ విష‌యాన్ని ఉదాహరణగా తీసుకొంటూ.. దానికి ఇటీవ‌ల ల‌భించిన‌ సానుకూలపు స్పందనను గురించి వివ‌రించారు.

వివరణాత్మక ప్ర‌జెంటేష‌న్‌ ప్ర‌సంగం అనంత‌రం ట్రైఫెడ్‌ ప్రారంభించిన అన్నింటినీ మ‌రియు కలిగి ఉన్న డిజిటల్ పరివర్తన వ్యూహాల‌ను గురించి మరియు గిరిజన సమాజ పరిస్థితిని స‌ర‌ళ‌త‌రం చేయడానికి బృందం ముందుకు వచ్చిన వివిధ చర్యల గురించి ఒక వివరణాత్మక ప్ర‌జెంటేష‌న్‌ చేశారు. ఈ ప్రదర్శన కొనసాగుతున్న డిజిటల్ కార్యక్రమాలపై దృష్టి సారించింది, ముఖ్యంగా ఈ రోజు ప్రారంభించబడిన రెండు డిజిట‌ల్ ప్ర‌ధానాంశాల‌పై ప్ర‌ద‌ర్శ‌న సాగింది. దేశంలో ఆయా గిరిజనుల భారాల్ని తగ్గించడానికి ట్రైఫెడ్‌ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలను కూడా ఇందులో వివ‌రించారు.గిరిజ‌నుల వ్య‌వ‌హారాల కార్య‌క్ర‌మ‌మైన వాన్ ధన్ యోజన (స్టార్ట్-అప్ స్కీమ్) విజయవంతంగా అమలు చేయడంతో పాటు మొత్తం 2000 కోట్ల రూపాయల (ప్రభుత్వ మరియు ప్రైవేట్ వాణిజ్యం ద్వారా) ఎంఎఫ్‌పీ పథక‌పు ఎంఎస్‌పీ గురించి ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో ప్ర‌ధానంగా తెలియ‌జేశారు. స‌ర్కారు చ‌ర్య‌లు 1205 గిరిజన సంస్థల స్థాపనకు దారితీసింది మరియు 22 రాష్ట్రాలలో 3.6 లక్షల గిరిజన సేకరణదారులు మరియు 18075 స్వయం సహాయక బృందాలకు ఉపాధి అవకాశాలను కల్పించింద‌ని ఈ ప్రదర్శనలో తెలియ‌జేశారు. దీనికి తోడుగా ఇతర కార్యక్రమాల ప్రభావాన్ని గురించి వివరించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, నాగాలాండ్, మణిపూర్ వంటి వివిధ ఛాంపియన్ రాష్ట్రాల ఫలితాలను ఉదాహరణలుగా ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో హైలైట్ చేశారు. ఈ సంక్షోభ సమయంలో ఇతర చర్యలనూ కూడా ప్రదర్శనలో వెలుగులోకి తెచ్చారు.
 
కోవిడ్ నేప‌థ్యంలో అడ్వైజ‌రీల జారీ కోవిడ్ -19 సంక్షోభ‌ సమయంలో గుర్తుంచుకోవాల్సిన‌ ఎంఎఫ్‌పీల‌కు విష‌య‌మై ట్రైఫెడ్ అడ్వైజ‌రీల‌ను జారీ చేసింది. వ్యక్తిగత పరిశుభ్రత కాపాడటానికి, నగదు రహిత పద్ధతులను అవలంబించడాన్ని సూచించే ప‌లు పద్ధతులను ఇందులో ప్ర‌ధానంగా అందించింది. 1205 వాన్ ధన్ కేంద్రాలలో ఇటీవల మంజూరు చేసిన వాన్ ధన్ స్వయం సహాయక సంఘాల నుండి 15,000 ‘వాన్ ధన్ సోషల్ డిస్టెన్సింగ్ అవేర్‌నెస్ కమ్ లైవ్‌లిహుడ్ సెంటర్స్’ ఏర్పాటుకు కృషి చేస్తోంది. ఈ అభియాన్‌ను ప్రోత్సహించడానికి డిజిటల్ కమ్యూనికేషన్ వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి ట్రైఫెడ్‌ యునిసెఫ్‌తో కలిసి పనిచేసింది. దీనికి అదనంగా, గిరిజన సమాజం యొక్క మనుగడకు అవసరమైన ఆహారం, రేషన్‌ను అందించడంలో ట్రైఫెడ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ యొక్క #iStandWithHumanity Initiative తో గిరిజన కుటుంబాలతో నిలిచి ఉండ‌డం అనే విభాగంలో త‌న‌ భాగస్వామ్యం కలిగి ఉంది.

A screenshot of a cell phoneDescription automatically generatedA screenshot of a computerDescription automatically generated


అత్యాధునిక వెబ్‌సైట్‌తో మేలు ప్ర‌భుత్వం చేప‌ట్టిన స‌రికొత్త డిజిటల్ వ్యూహం మొత్తం గిరిజన ఉత్ప‌త్తుల సరఫరా-డిమాండ్ గొలుసులోని ప్రతి దశను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇందుకు అత్యాధునిక వెబ్‌సైట్‌ను ((https://trifed.tribal.gov.in)ను కలిగి ఉంటుంది, ఈ వెబ్‌సైట్ ఈ చ‌ర్య‌ల‌కు సంబంధించిన స‌మ‌స్త సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఆర్గ‌నైజేష‌న్‌తో పాటు వివిధ గిరిజన సంక్షేమ పథకాలకు సంబంధించిన స‌మ‌స్త‌ సమాచారాన్ని అందిస్తుంది. గిరిజన జీవితాలు మరియు వాణిజ్యం యొక్క ప్రతి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ మరియు ప్రైవేట్ వాణిజ్యం ద్వారా ఎంఎఫ్‌పీల సేకరణను డిజిటలైజేషన్ చేయడం మరియు ఇదే వేదిక‌పై గిరిజనులకు సంబంధించిన చెల్లింపులను కూడా ట్రైఫెడ్ ప్రారంభించింది.

జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలోకి గిరిజ‌నుల ఉత్ప‌త్తులు ఈ-కామర్స్ విధానం విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ట్రైబ్స్‌ ఇండియా ఉత్పత్తులు www.tribesindia.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అన్ని ప్రాంతాలు కలిసి పనిచేస్తాయి, వివిధ రకాల మరియు సమర్పణలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎమ్ మరియు షాప్‌క్లూస్‌లతో పాటుగా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో సులభంగా అందుబాటులో ఉండేలా వివిధ చర్య‌లు చేప‌డుతున్నారు. ఈ ఉత్పత్తుల‌లో సృజనాత్మక కళాఖండాలు మరియు డోక్రా మెటల్ క్రాఫ్ట్, అందమైన కుండలు, వివిధ రకాల పెయింటింగ్స్ నుండి రంగురంగుల, సౌకర్యవంతమైన దుస్తులు, విలక్షణమైన ఆభరణాలు, సేంద్రీయ మరియు సహజ ఆహారాలు, పానీయాల వరకు ఇందులో ఉన్నాయి. దీనికితోడు ట్రైబ్స్ ఇండియా ఈ- మార్కెట్‌ప్లేస్ రిటైల్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ మార్గంలో అందుబాటులోకి వ‌స్తోంది. ఇది అమ్మ‌కం స్టాక్‌, సోర్సింగ్ మరియు అమ్మకాలను ఆటోమేట్ చేస్తుంది. ఈ-మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ దాదాపు 5 లక్షల మంది గిరిజన కళాకారులను ఆన్-బోర్డ్‌లోకి తీసుకురావడానికి ప్రతిష్టాత్మకమైన చొరవగా చెప్పుకోవ‌చ్చు. జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలోకి గిరిజ‌నుల ఉత్ప‌త్తుల‌కు ప్రాప్తిని అందిస్తుంది. ఇది జూలై 2020 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

 

********

 


(Release ID: 1635008) Visitor Counter : 335