ఆర్థిక మంత్రిత్వ శాఖ

బ్యాంకుల క్రమబద్ధీకరణ (సవరణ) ఆర్డినెన్స్‌, 2020కి రాష్ట్రపతి ఆమోదంసహకార బ్యాంకుల మెరుగైన నిర్వహణ, పటిష్ట నియంత్రణ కోసం సవరణలు

ప్రజలు లేదా ఖాతాదారులు లేదా బ్యాంకింగ్ లేదా సరైన నిర్వహణ ప్రయోజనాల కోసం పునర్నిర్మాణం లేదా సమ్మిళితానికి వీలు

Posted On: 27 JUN 2020 7:10AM by PIB Hyderabad

బ్యాంకు ఖాతాదారుల భద్రతను మరింత పటిష్టపరిచేందుకు, బ్యాంకుల క్రమబద్దీకరణ (సవరణ) ఆర్డినెన్స్‌‌, 2020కి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు.

ఆర్డినెన్స్‌ ద్వారా బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టం, 1949కు సవరణలు చేసి, సహకార బ్యాంకులకు వర్తింపజేస్తారు. ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, సహకార బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంకు పర్యవేక్షణలోకి తెచ్చి, వాటి పరిపాలనను మెరుగుపరచడానికి ఆర్డినెన్స్‌ ద్వారా వీలవుతుంది. సహకార చట్టాల కింద ఉన్న సహకార సంఘాల రిజిస్ట్రార్ల అధికారాలు యథావిధిగానే కొనసాగుతాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) లేదా వ్యవసాయం కోసం దీర్ఘకాలిక రుణాలు ఇచ్చే సహకార సంఘాలకు కొత్త సవరణలు వర్తించవు. బ్యాంక్‌ లేదా బ్యాంకర్‌ లేదా బ్యాంకింగ్‌ పదాలు వాడని, చెక్కులను డ్రా చేయని సంస్థలకు కూడా సవరణలు వర్తించవు.

బ్యాంకుల క్రమబద్ధీకరణ చట్టంలోని సెక్షన్‌ 45ను కూడా ఆర్డినెన్స్‌ ద్వారా సవరిస్తారు. దీనివల్ల ప్రజలు, ఖాతాదారులు, బ్యాంకు వ్యవస్థ ప్రయోజనాలు కాపాడటానికి లేదా సరైన నిర్వహణ కోసం మారటోరియం అవసరం లేకుండానే బ్యాంకు పునర్నిర్మాణం లేదా సమ్మేళనానికి వీలవుతుంది. బ్యాంకు ఆర్థిక వ్యవస్థకు ఆటంకం కలగకుండా ఈ ప్రక్రియ సాగుతుంది.

 

(గెజిట్ ఆర్డినెన్స్‌ నోటిఫికేషన్‌ను చూడటానికి క్లిక్ చేయండి)

****(Release ID: 1634726) Visitor Counter : 382