మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 కారణంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2020 జూలై 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన X తరగతి, XII తరగతి పరీక్షలను సీ.బీ.ఎస్.ఈ. రద్దు చేసింది


రద్దు చేసిన X తరగతి, XII తరగతి పరీక్షల అసెస్‌మెంటు సిబిఎస్‌ఇ కమిటీ సూచించిన అసెస్‌మెంటు పధకం ప్రకారం జరుగుతుంది.


విద్యార్థుల భద్రతా సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు కేంద్ర హెచ్.‌ఆర్.‌డి. మంత్రి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు


అసెస్‌మెంట్ స్కీమ్ ఆధారంగా ఫలితాలు 2020 జూలై 15వ తేదీ నాటికి ప్రకటించడం జరుగుతుంది - శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’

Posted On: 26 JUN 2020 4:37PM by PIB Hyderabad

వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన అభ్యర్థనలను, కోవిడ్-19 కారణంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, 2020 జూలై 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన X వ తరగతి, XII వ తరగతుల పరీక్షలను రద్దు చేయాలని సి.బి.ఎస్.ఈ. నిర్ణయించింది. పరీక్షలను రద్దు చేయాలన్న సి.బి.ఎస్.ఈ. ప్రతిపాదనను, మరియు వారి X వ తరగతి మరియు XII వ తరగతి పరీక్షలలో విద్యార్థుల తుది పనితీరును అంచనా వేసే పథకాన్నీ సుప్రీంకోర్టు ఈ రోజు అంగీకరించింది.

 

 

జూలై 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు నిర్వహించవలసిన X వ తరగతి, XII వ తరగతుల సి.బి.ఎస్.ఈ. పరీక్షలను రద్దు చేయాలన్న సి.బి.ఎస్.ఈ. ప్రతిపాదనను అంగీకరించి, విద్యార్థుల భద్రతా సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. రద్దు చేసిన పరీక్షలకు, విద్యార్థుల పనితీరు ప్రాతిపదికన అసెస్‌మెంట్ చేయడానికి, సి.బి.ఎస్.ఈ. యొక్క సాధికార కమిటీ నిర్ణయించిన అసెస్‌మెంట్ పధకం ఆధారంగా X వ తరగతి, XII వ తరగతులు రెండింటికీ ఫలితాన్ని ప్రకటిస్తారని ఆయన చెప్పారు.

షరతులు అనుకూలమైన వెంటనే 2020 జూలై 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించాల్సిన పరీక్షలలో సి.బి.ఎస్.ఈ. XII తరగతి విద్యార్థులకు ఐచ్ఛిక పరీక్షను నిర్వహిస్తుందని శ్రీ నిశాంక్ తెలిపారు. అసెస్‌మెంట్ పధకం ఆధారంగా ఫలితాలు ప్రకటించబడే అభ్యర్థులను తమ పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఈ ఐచ్ఛిక పరీక్షలలో హాజరు కావడానికి అనుమతిస్తారు. అయితే, X వ తరగతిలో ఉన్న అభ్యర్థుల కోసం తదుపరి పరీక్షలు నిర్వహించడం జరగదనీ, అసెస్‌మెంట్ పధకం ఆధారంగా సి.బి.ఎస్.ఈ. ప్రకటించిన ఫలితాన్నే అంతిమంగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇంతవరకు పేర్కొన్న అసెస్‌మెంట్ పధకం ఆధారంగా ఫలితాలను 2020 జూలై 15వ తేదీ లోగా ప్రకటిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. తద్వారా, అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడానికి వీలౌతుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆరోగ్యం మా ప్రధాన ఆందోళన కాబట్టి మేము ఈ పథకాన్ని సుప్రీంకోర్టుకు ప్రతిపాదించామని ఆయన అన్నారు.

X తరగతి, XII తరగతి పరీక్షల సి.బి.ఎస్.ఈ. నోటిఫికేషన్ కోసం దయచేసి ఇక్కడ నొక్కండి.

 

 

*******

 


(Release ID: 1634590) Visitor Counter : 257