ఆర్థిక సంఘం

ఆర్థిక సంఘం- తన సలహా మండలితో సమావేశం


Posted On: 26 JUN 2020 3:19PM by PIB Hyderabad

పదిహేనవ ఆర్థిక సంఘం (ఎక్స్‌విఎఫ్‌సి) తన సలహా మండలితో 2020 జూన్ 25, 26 తేదీలలో వర్చువల్ సమావేశాలు నిర్వహించింది. ఇప్పుడు కమిషన్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించింది. పదిహేనవ ఆర్థిక సంఘం చైర్మన్ శ్రీ ఎన్. కె. సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషన్ సభ్యులందరూ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సలహా మండలి నుండి డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్, డాక్టర్ సజ్జిద్ జెడ్ చినాయ్, డాక్టర్ ప్రాచీ మిశ్రా, మిస్టర్ నీల్కాంత్ మిశ్రా డాక్టర్ ఓంకర్ గోస్వామి, ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ రతిన్ రాయ్ 25వ తేదీ సమావేశానికి హాజరయ్యారు. డాక్టర్ అరవింద్ వర్మణి, డాక్టర్ డికె శ్రీవాస్తవ, డాక్టర్ ఎం. గోవింద రావు, సలహా మండలి నుండి డాక్టర్ సుదిప్టో ముండ్లే, డాక్టర్ శంకర్ ఆచార్య, డాక్టర్ ప్రణబ్ సేన్లతో కలిసి 26వ తేదీ సమావేశానికి హాజరయ్యారు. 2020-21 సంవత్సరానికి పదిహేనోవా ఆర్థిక సంఘం నివేదికను సమర్పించిన తరువాత, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా జాతీయ లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి రెండవ సమావేశం.

సలహా మండలి సభ్యులు ఏప్రిల్‌లో కమిషన్‌ను కలిసినప్పటి నుండి, మే చివరి వరకు జాతీయ లాక్‌డౌన్ మరింత పొడిగింపు అయింది. ఇప్పుడు పరిమితులు దశలవారీగా ఎత్తివేస్తున్నందున ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా తిరిగి ప్రారంభమవుతాయని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా, మహమ్మారి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థానాలపై ఇప్పటికీ చాలా అనిశ్చితంగా ఉంది. చాలా మంది విశ్లేషకులు మరియు ఆలోచనాపరులు 2020-21 సంవత్సరానికి వారి జిడిపి వృద్ధి అంచనాలను తగ్గించారు. కొనసాగుతున్న సామాజిక దూరం, చాల చోట్ల స్థానిక ఆంక్షల కారణంగా, సరఫరా గొలుసులు ఇంకా పూర్తిగా పునరుద్ధరణ కాలేదు, ఇది రికవరీ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్ను వసూళ్ల పై కూడా ప్రస్తుత పరిస్థితులు పెను ప్రభావాన్ని చూపుతాయని సలహా మండలి చర్చించింది. కొంతమంది కౌన్సిల్ సభ్యులు పన్ను వసూళ్లపై మహమ్మారి ప్రభావం అసమానంగా ఉండవచ్చని సూచించారు.

సాధారణ రుణాల లోటు, అప్పులపై కూడా సమావేశంలో చర్చించారు. మహమ్మారి తర్వాత స్థితిలో ప్రజా రుణాన్ని ఏకీకృతం చేయడానికి అడ్డంకులను సమీక్షించారు. ఆరోగ్యం, పేదలు, ఇతర ఆర్థిక చోదకులకు మద్దతు ఇవ్వడం వలన గణనీయమైన వ్యయ భారాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

సలహా మండలి సభ్యులు ఎంతో అనిశ్చితితో ముందుకు సాగుతున్నారని, ఐదేళ్ల కాలానికి ఆర్థిక బదిలీల రూపకల్పనలో కమిషన్‌కు ఎదురైన సవాళ్లను ప్రశంసించారు. సలహా మండలితో పాటు కమిషన్ వివిధ ఆర్థిక పరిణామాలను సాధ్యమైనంత ఉత్తమమైన అంచనా వేయడానికి నిశితంగా పరిశీలించనున్నాయి.

******

 



(Release ID: 1634584) Visitor Counter : 216