హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీ లో కోవిడ్-19 గురించి జూన్ 21 సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించిన కేంద్ర హోం శాఖ కార్యదర్శి



నిర్ణయాలు సజావుగా, సకాలంలో అమలు అవుతున్నాయని అభిప్రాయపడ్డ సమావేశం, ఢిల్లీ కోవిడ్-19 ప్రతిస్పందన ప్రణాళిక ఖరారు

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా నిర్ణయించిన కాలపరిమితి ప్రకారం ఢిల్లీలో కోవిడ్-19 వ్యాప్తి చెందిన అన్ని క్లస్టర్లతో సహా కంటైన్మెంట్ జోన్ల పునర్లిఖీకరణ జూన్ 26 నాటికి పూర్తవుతుంది

కేంద్ర హోంమంత్రి ఆదేశాల మేరకు జూన్ 27 నుంచి ఎన్‌సిడిసి, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్న, వైరస్ ప్రబలడానికి సంబంధించిన సెరోలాజికల్ సర్వేపై చర్చ

Posted On: 26 JUN 2020 4:10PM by PIB Hyderabad

కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జూన్ 21 న తీసుకున్న కోవిడ్-19 పై వివిధ నిర్ణయాల అమలును సమీక్షించడానికి కేంద్ర హోం కార్యదర్శి జూన్ 25 న ఒక సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవతో పాటు ఢిల్లీ ముఖ్య కార్యదర్శిఆరోగ్య కార్యదర్శి ఈ సమావేశానికి హాజరయ్యారు.

కేంద్ర హోం కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో, నిర్ణయాలు సజావుగా, సమయానుసారంగా అమలు చేయబడుతున్నాయని స్పష్టంగా గుర్తించారు. ఢిల్లీకి కోవిడ్-19 ప్రతిస్పందన ప్రణాళికను ఖరారు చేశారు. కోవిడ్-19 సంబంధిత పనుల కోసం జిల్లా స్థాయి బృందాలను కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా నిర్ణయించిన కాలపరిమితి ప్రకారం ఢిల్లీలో కోవిడ్ -19 వ్యాప్తికి సంబంధించిన అన్ని క్లస్టర్లతో సహా కంటైన్మెంట్ జోన్ల రీ-డ్రాయింగ్ జూన్ 26 నాటికి పూర్తవుతుందని సమావేశంలో అధికారులు తెలియజేశారు. ఇంటింటికీ ఆరోగ్య సర్వేను కూడా జూన్ 30 లోగా పూర్తవుతుంది.

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు ఢిల్లీలో జరిగిన సెరోలాజికల్ సర్వే ఎన్‌సిడిసి, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ సర్వే జూన్ 27 నుండి ప్రారంభమవుతుంది. సంబంధిత సర్వే బృందాల శిక్షణ నిన్న పూర్తయింది. కోవిడ్-19 వ్యాప్తిని భవిష్యత్తులో గుర్తించడానికి బలమైన అంచనా సాధనంగా ఆరోగ్యా సేతు, ఇతిహాస్ యాప్ లను సంయుక్తంగా ఉపయోగించడాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఆమోదించారు. ఢిల్లీ ప్రభుత్వ జిల్లా బృందాలకు ఎన్‌సిడిసి శిక్షకులు నిన్న యాప్‌ల వాడకంపై శిక్షణ ఇచ్చారు.

****


(Release ID: 1634572) Visitor Counter : 230