ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వార్షిక క్షయ వ్యాధి నివేదిక 2020 విడుదల చేసిన డాక్టర్ హర్షవర్ధన్


2019లో కొత్తగా 24.04 లక్షల మంది క్షయ రోగులు తెలిశారు ఇది 2018 కన్నా 14% ఎక్కువ

తప్పిపోయిన కేసుల సంఖ్య 2.9 లక్షలకు తగ్గింది

తెలిసిన క్షయ రోగులందరికీ హెచ్ ఐ వి పరీక్షలు జరపడం 2018లో 67 శాతం నుంచి 2019లో 81% శాతానికి పెరిగింది

క్షయ వ్యాధిని ఎదుర్కోవడానికి, దానితో ముడిపడి ఉన్న నిందను రూపుమాపడానికి మనందరం కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు

Posted On: 24 JUN 2020 4:48PM by PIB Hyderabad

 

 

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ క్షయ వ్యాధిపై 2020 వార్షిక నివేదికను విడుదల చేశారు.  చాక్షుష కార్యక్రమంలో  ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ  శాఖ సహాయ మంత్రి  శ్రీ అశ్వనీ కుమార్ చౌబే కూడా పాల్గొన్నారు.  క్షయ రోగులకు నిక్షయ్ కార్యక్రమం కింద నేరుగా నగదు బదిలీపై కూడా వారు ఒక మాన్యువల్,   శిక్షణా మాడ్యూల్,   నిక్షయ్ పత్రిక త్రైమాసిక వార్తా లేఖను  విడుదల చేశారు. 

నివేదికలో పేర్కొన్న విధంగా కీలకంగా సాధించిన కార్యాలు: 

  • 2019లో కొత్తగా  24.04 లక్షల మంది క్షయ రోగులు తెలిశారు.  ఇది 2018 కన్నా 14% ఎక్కువ
  • నిక్షయ్ వ్యవస్థ ద్వారా ఆన్ లైన్ లో దాదాపు మొత్తం  క్షయ రోగుల ప్రకటన ప్రకటన సాధ్యమైంది 
  • 2017లో 10 లక్షలు ఉన్న తప్పిపోయిన కేసుల సంఖ్య 2018లో  2.9  లక్షలకు తగ్గింది 
  • ప్రైవేటు రంగం  వెల్లడి  35 శాతం పెరిగి 6.78 లక్షలకు చేరింది
  • అణువుల ఆధారంగా రోగ నిర్ధారణ చేయడం ఇప్పుడు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల క్షయ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన పిల్లల సంఖ్య  2018లో 8 శాతానికి పెరిగింది.  .
  • తెలిసిన క్షయ రోగులందరికీ హెచ్ ఐ వి పరీక్షలు జరపడం 2018లో 67 శాతం నుంచి 2019లో  81% శాతానికి పెరిగింది 
  • చికిత్సా సేవల విస్తరణ వల్ల చికిత్స పొందిన వారికి నయం కావడం 12% పెరిగింది.   2018లో నయమైన చికిత్సల శాతం 69% నుంచి 2019లో 81శాతానికి పెరిగింది. 
  • దేశవ్యాప్తంగా 4.5 లక్షలకు పైగా  డి ఓ టి కేంద్రాల ద్వారా అన్ని గ్రామాలలో చికిత్సా సౌకర్యం 
  • క్షయ రోగులకు నిక్షయ్ ఫాషన్ యోజన కింద నేరుగా నగదు బదిలీ సౌకర్యం 
  • చికిత్సకు మద్దతు ఇచ్చేవారికి  ప్రోత్సాహకాలు 
  • ప్రైవేటు వారికి ప్రోత్సాహకాలు  మరియు 
  • గిరిజన ప్రాంతాలలో క్షయ రోగులకు  రవాణా ప్రోత్సాహకాలు 

వార్షిక నివేదికను విడుదల చేస్తూ ఈ పనితో ముడిపడి ఉన్న వారందరూ కలసికట్టుగా పని చేస్తున్నందుకు  డాక్టర్ హర్ష వర్ధన్ వారిని అభినందించారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే దిశగా పని చేస్తున్నామని ఆయన అన్నారు. 

50లక్షలకు పైగా జనాభా ఉన్న పెద్ద రాష్ట్రాలలో  గుజరాత్, ఆంద్రప్రదేశ్ ,  హిమాచల్ ప్రదేశ్ లకు  ఉత్తమ రాష్ట్రం బహుమతి లభిందించి.   50 లక్షలకు తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో త్రిపుర,  నాగాలాండ్  బహుమతులు గెలుచుకున్నాయి.   కేంద్ర పాలిత ప్రాంతాలలో దాద్రా నాగర్ హవేలీ మరియు డామన్ & డయ్యు ఉత్తమంగా నిలిచాయి.  

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్ ,  ఓ ఎస్ డి శ్రీ రాజేష్ భూషణ్ ,   అదనపు కార్యదర్శి  ఆర్తీ అహుజా,   ఏఎస్ & ఎఫ్ఏ డాక్ట్రర్ ధర్మేంద్ర సింగ్ గంగ్వార్,    డైరెక్టర్ (డిజిహెచ్ఎస్) శ్రీ రాజీవ్ గార్గ్ మరియి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ,  కేంద్ర క్షయ డివిజన్ కు చెందిన  ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.    నివేదిక విడుదల కార్యక్రమం వీడియో కాన్ఫరెన్సు పద్ధతిలో   చాక్షుష రీతిలో  జరిగింది.   అన్ని రాష్ట్రాలు /  కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు ,   భాగస్వామ్య సంస్థలు,  పౌర సమాజ బృందాలు మరియు   టి బి ఛాంపియన్లు పాల్గొన్నారు. 

 

*****



(Release ID: 1634348) Visitor Counter : 217