ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
మయన్మార్ యొక్క ఎ-1 మరియు ఎ-3 బ్లాకుల అభివృద్ధి కోసం ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ అదనపు పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదించింది
Posted On:
24 JUN 2020 4:42PM by PIB Hyderabad
మయన్మార్‌లోని ష్వే ఆయిల్ & గ్యాస్ ప్రాజెక్ట్ బ్లాక్స్‌లోని ఎ-1 మరియు ఎ-3 బ్లాకుల్ని మరింత అభివృద్ధి చేసేందుకు గాను ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ సంస్థ (ఓవీఎల్) 121.27 మిలియన్ డాలర్ల (సుమారు రూ.909 కోట్లు) మేర అదనపు పెట్టుబడి పెట్టనుంది. ఈ తాజా ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తన ఆమోదాన్ని తెలిపింది. దక్షిణ కొరియా, భారత్ మరియు మయన్మార్ సంస్థల కన్సార్టియంలో భాగంగా ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ (ఓవీఎల్), 2002 నుండి మయన్మార్‌లో ష్వే ప్రాజెక్టు అన్వేషణ, అభివృద్ధి పనులలో పాలుపంచుకుంటోంది. భారత దేశపు పీఎస్‌యూ గెయిల్ కూడా ఈ ప్రాజెక్టులో పెట్టుబడిదారిగా ఉంది. ఈ ప్రాజెక్టులో ఓవీఎల్ 2019 మార్చి 31 నాటికి US $ 722 మిలియన్ల మేర పెట్టుబడి పెట్టింది. ష్వే ప్రాజెక్ట్ నుండి మొదటి గ్యాస్ జూలై 2013లోనూ.. ప్లాటీయు ఉత్పత్తి డిసెంబర్ 2014 నుంచి మొదలైంది. ఈ ప్రాజెక్ట్ 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి తగిన సానుకూల నగదు ప్రవాహాన్ని సృష్టిస్తోంది. పొరుగు దేశాలలో చమురు మరియు సహజ వాయువు అన్వేషణ, అభివృద్ధి ప్రాజెక్టుల్లో భారత సంస్థల భాగస్వామ్యం భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీల మేరకు అనుసంధానించబడింది. సమీపంలోని పొరుగు దేశాలతో ఇంధన వంతెను అభివృద్ధి చేయడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ 121.27 మిలియన్ డాలర్లు (సుమారు రూ.909 కోట్లు) అదనపు పెట్టుబడికి భారత్ ఈ పెట్టుబడులు పెడుతోంది.
*******
(Release ID: 1634056)
Visitor Counter : 205