మంత్రిమండలి
ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Posted On:
24 JUN 2020 4:38PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
కుషీనగర్ అత్యంత ముఖ్యమైన బౌద్ధ సాంస్కృతిక స్థలం. ఇతర బౌద్ధ యాత్ర స్థలాలైన శ్రావస్తి, కపిలవస్తు, లుంబినికి సమీపంలో ఉంది. ఇక్కడకు బౌద్ధులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. కుషీనగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడం వల్ల ఈ ప్రాంతానికి రవాణా సదుపాయం పెరుగుతుంది. విమానయాన సంస్థల మధ్య పోటీ పెరిగి ప్రయాణ ధరలు తగ్గుతాయి. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకం వృద్ధి చెంది ఆ ప్రాంతం ఆర్థికంగా లబ్ధి పొందుతుంది. అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరలో ఉండడం వల్ల వ్యూహాత్మకంగానూ ముఖ్యమైన ప్రాంతం.
ఉత్తరప్రదేశ్ ఈశాన్య ప్రాంతంలో కుషీనగర్ ఉంది. బౌద్ధులు అత్యధికంగా సందర్శించే గోరఖ్‌పూర్‌కు 50 కి.మీ. దూరంలో ఉంది.
*******
(Release ID: 1634006)
Visitor Counter : 241
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada