రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా మాల్దీవుల నుంచి 198 మంది భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చిన ఐ ఎన్ ఎస్ ఐరావత్

Posted On: 23 JUN 2020 7:50PM by PIB Hyderabad

 

"ఆపరేషన్ సముద్ర సేతు"లో భాగంగా భారత నౌకాదళం తరుపున మాల్దీవులకు వెళ్లిన ఐ ఎన్ ఎస్ ఐరావత్ నౌక మంగళవారం వేకువ జామున ట్యుటికోరన్ ఓడరేవుకు తిరిగి వచ్చింది.   మాల్దీవులలోని మాలే నుంచి  198 మంది భారత జాతీయులు ఈ ఓడలో వచ్చారు.  ఈ విధంగా ఇప్పటివరకు మాల్దీవుల నుంచి ఇండియాకు వచ్చిన భారతీయ పౌరుల  సంఖ్య 2386. 

వారి ప్రయాణానికి మాల్దీవుల లోని భారతీయ దౌత్య కార్యాలయం ఏర్పాట్లు చేసింది.  వైద్య పరీక్షలు చేసి కోవిడ్ -19కు సంబంధించి సముద్రయానానికి సంబంధించిన  భద్రతా నియమాలు అన్ని పాటించిన తరువాత వారిని ఓడలోకి ఎక్కించారు. 

 

ఓడలోనుంచి వారిని త్వరగా దించడానికి ట్యుటికోరన్ ఓడ రేవు వద్ద స్థానిక అధికారులు ఆరోగ్య పరీక్షలు, వలస పత్రాల పరిశీలనఓడ దిగిన వారిని రోడ్డు మార్గంలో పంపడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. 

 

ఆ విధంగా విశ్వ మహమ్మారి కోవిడ్ సందర్బంగా  ఇప్పటివరకు  మాల్దీవులు, శ్రీలంక, ఇరాన్ నుంచి తరలించిన వారి సంఖ్యా 3305.

 

*******


(Release ID: 1633860) Visitor Counter : 277