హోం మంత్రిత్వ శాఖ

పూరి జగన్నాథుడి రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతినివ్వడాన్ని స్వాగతించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా


భక్తుల మనోభావాలను ప్రధాని అర్ధం చేసుకోవడమే కాదు, మన దేశ గొప్ప సంప్రదాయాలను పాటించేలా సంప్రదింపులు జరిపారు: అమిత్ షా

పూరి రాజు, పూరి శంకరాచార్య, సొలిసిటరల్ జనరల్‌తో సంప్రదింపులు జరిపిన అమిత్‌ షా

అత్యవసర కేసు కాబట్టి వెకేషన్ బెంచ్ ఎదుట విచారణ జరిగింది, ఎస్‌సీ తీసుకున్న నిర్ణయానికి మార్గం సుగమం అయింది: అమిత్‌ షా

ఒడిశా ప్రజలకు శుభాకాంక్షలు, జై జగన్నాథ్: అమిత్‌ షా

Posted On: 22 JUN 2020 7:30PM by PIB Hyderabad

    ప్రఖ్యాత పూరి క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్రను నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు అనుమతినివ్వడం పట్ల  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంతోషం వ్యక్తం చేశారు. "ఒడిశా సోదర, సోదరీమణులకు, ముఖ్యంగా జగన్నాథుడి భక్తులకు ఇది ప్రత్యేకమైన రోజు. రథయాత్ర కొనసాగించుకోవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పు పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది" అంటూ అమిత్‌ షా వరుస ట్వీట్లు చేశారు. 

    ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భక్తుల మనోభావాలను అర్థం చేసుకోవడమేగాక, మన కర్మభూమి సంప్రదాయాలను పాటించేలా సంప్రదింపులు జరిపినందుకు నాతోపాటు, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తులందరినీ సంతోషంలో ముంచెత్తింది.

    ఈ అంశాన్ని పరిష్కరించేందుకు అధికారులతో అత్యవసర సంప్రదింపులు జరిపినట్లు అమిత్‌ షా వెల్లడించారు. "ప్రధాని ఆదేశాల మేరకు గత సాయంత్రం.., పూరి రాజు గజపతి మహరాజ్‌, పూరి శంకరాచార్యతో మాట్లాడి రథయాత్రపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నా. ఈ ఉదయం సొలిసిటర్‌ జనరల్‌తో మాట్లాడా" అని అమిత్‌ షా చెప్పారు.

    "రథయాత్ర కేసు ప్రాముఖ్యత దృష్ట్యా సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్‌ ఎదుట మధ్యాహ్నం విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మార్గం సుగమమైంది" అని అమిత్‌ షా వెల్లడించారు. 

    ఒడిశా ప్రజలకు శుభాకాంక్షలు, జై జగన్నాథ్ అంటూ అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

 

 

Amit Shah@AmitShah

Today is a special day for all of us, particularly our Odia sisters and brothers as well as devotees of Mahaprabhu Shri Jagannath Ji. The entire nation is delighted by the decision of the Honourable Supreme Court to ensure the Rath Yatra goes on.

जय जगन्नाथ!

31.1K

5:36 PM - Jun 22, 2020

Twitter Ads info and privacy

6,030 people are talking about this

Amit Shah@AmitShah

It makes me, as well as crores of devotees across India happy that PM @narendramodi not only understood the sentiment of the devotees but also initiated consultations which ensured that the great traditions of our land are observed.

17.2K

5:36 PM - Jun 22, 2020

Twitter Ads info and privacy

3,517 people are talking about this

Amit Shah@AmitShah

Last evening, as per the instructions of PM @narendramodi, I spoke to Gajapati Maharaj Ji (The King of Puri) and the respected Shankaracharya Ji of Puri and sought their views on the Yatra. This morning, on PM’s instructions, I also spoke to the Solicitor General.

17.5K

5:36 PM - Jun 22, 2020

Twitter Ads info and privacy

3,716 people are talking about this

Amit Shah@AmitShah

Considering the urgency and importance of the matter, it was placed in front of a vacation bench of the Supreme Court and the hearing took place this afternoon, which paved the way for the important decision by the SC.

Congratulations to the people of Odisha.
जय जगन्नाथ!

11.6K

5:36 PM - Jun 22, 2020

Twitter Ads info and privacy

2,800 people are talking about this

 

******



(Release ID: 1633477) Visitor Counter : 144