మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.‌టి.ఎ) నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో హిందీ టెస్ట్ ఫీచర్‌ను ప్రారంభించింది


హిందీలో జె.ఈ.ఈ. మెయిన్ కోసం మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడంలో హిందీ మీడియం విద్యార్థులకు కొత్త ఫీచర్ సహాయం చేస్తుంది - శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్'

9.56 లక్షలకు పైగా విద్యార్థులు నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు మరియు విద్యార్థులు ఈ యాప్ ద్వారా 16.5 లక్షలకు పైగా పరీక్షలు వ్రాశారు - హెచ్‌.ఆర్.‌డి. మంత్రి

Posted On: 21 JUN 2020 3:31PM by PIB Hyderabad

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.‌టి.) నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్లో హిందీ టెస్ట్ ఫీచర్ను విడుదల చేసినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్ప్రకటించారు.  నేషనల్ టెస్ట్ అభ్యాస్ స్మార్ట్ ఫోన్ యాప్లో ఎన్.‌టి. విడుదల చేసిన హిందీ మాక్ టెస్ట్లతో హిందీలో పోటీ పరీక్ష వ్రాయాలని ఇష్టపడే  విద్యార్థులు ఇప్పుడు తమ మొబైల్ పరికరాలనుండి హిందీలో ప్రాక్టీస్ చేయవచ్చునని ఆయన చెప్పారు. 

Dr Ramesh Pokhriyal Nishank@DrRPNishank

मुझे यह बताते हुए खुशी हो रही है कि आज @DG_NTA द्वारा एक और बेहतरीन पहल की गई है, "नेशनल टेस्ट अभ्यास" ऐप में अब अंग्रेजी के साथ-साथ हिंदी के पेपर्स भी सम्मिलित किये गए हैं।
छात्र काफी समय से हिंदी में पेपर्स की मांग कर रहे थे। यह कदम छात्रों की मांग को देखते हुए उठाया गया है।

Embedded video

1,776

3:11 PM - Jun 21, 2020

Twitter Ads info and privacy

827 people are talking about this

 

జె.ఈ.ఈ. మెయిన్, నీట్ తో సహా ప్రవేశ పరీక్షల కోసం ఇంజనీరింగ్ మరియు వైద్య కోర్సులు చదివిన అభ్యర్థులు వారి ఇళ్ల నుండి సురక్షితంగా సిద్ధం కావడానికి వీలుగా, జె.ఈ.ఈ., నీట్ వంటి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.‌టి.ఎ) తన కృత్రిమ మేధస్సు (ఎ.ఐ) శక్తితో కూడిన స్మార్ట్ ఫోన్ యాప్‌ను గత నెలలో ప్రారంభించినట్లు శ్రీ పోఖ్రియాల్ తెలియజేశారు.  ఈ యాప్‌లో ఇప్పటి వరకు విద్యార్థులు 16.5 లక్షలకు పైగా పరీక్షలు వ్రాశారు. మరియు 9.56 లక్షలకు పైగా విద్యార్థులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

 

హిందీ మాధ్యమాన్ని ఇష్టపడే విద్యార్థులు తాము పరీక్షలకు సులువుగా సిద్ధం కావడానికి వీలుగా  హిందీ భాషలో పేపర్లను ప్రారంభించాలని అభ్యర్థించారు.  దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్.టి.ఏ. ఈ ఫీచర్‌ను యాప్ కోసం లాంచ్ చేసింది.  ఇప్పుడు హిందీ భాషా అభ్యర్థులు హిందీలో ఈ పోటీ పరీక్షలకు ప్రాక్టీస్ చేయగలరు లేదా మాక్ పరీక్షలు ఇవ్వగలరు.  భారతదేశం అంతటా విద్యార్థులకు హిందీ వెర్షన్ ఒక వరంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు,  ఆంగ్లం మొదటి భాష కాని విద్యార్థులకు ఇది మరింత అనువుగా ఉంది.  ఇప్పుడు చాలా మంది విద్యార్థులు తమ ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడానికి, దీనిని తప్పక ఉపయోగించుకుంటారు

 

 ఇప్పటికే  ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసిన విద్యార్థులు హిందీలో మాక్ పరీక్షకు ప్రయత్నించడం ప్రారంభించవచ్చు లేదా వారికి ఈ యాప్ లేకపోతే, దాన్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  ఈ యాప్ అధునాతన వెర్షన్ లో నావిగేషన్, సూచనలు, టెస్ట్ టేకింగ్ మరియు విశ్లేషణలను ఇంగ్లీష్ మరియు హిందీ రెండు భాషలలో అందుబాటులో ఉంటాయి.   విద్యార్థులు తమ స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, విద్యార్థులు వారి వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది.  ఆ తర్వాత, వారు తమ భాషా ప్రాధాన్యత గా హిందీని ఎంచుకోవచ్చుఅప్పటి నుండి వారు ఎంచుకున్న పరీక్షకు హిందీ భాషలో మాక్ పరీక్షలు ఇవ్వడం ప్రారంభించవచ్చు.


 

ఆంగ్ల భాషలో మాదిరిగానే, ప్రతిరోజూ, ఎన్.‌టి.ఎ ఒక కొత్త పరీక్షను హిందీలో కూడా ఈ యాప్‌లో విడుదల చేస్తుంది, దీనిని విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకుని సమాధానాలు వ్రాయవచ్చు.  విద్యార్థులు తమ పరికరం  "ఎయిరోప్లేన్ మోడ్" ‌లో ఉన్నప్పుడు, వారు ఈ పరీక్షలను ఆఫ్ ‌లైన్ ‌లో సమాధానాలు వ్రాయవచ్చు. అయితే, ఆ తర్వాత పరీక్షను సమర్పించడానికీ, వాటి ఫలితాన్ని చూసుకోడానికీ మరోసారి ఆన్ ‌లైన్ ‌లోకి రావలసి ఉంటుంది.  త్వరలో చేర్చబోయే జె.ఈ.ఈ. మెయిన్, నీట్ మరియు ఇతర పరీక్షలతో సహా పరీక్షల రోజువారీ జాబితాతో, విద్యార్థులు ఈ పరీక్షలను వారి ఇళ్ల నుండి ప్రాక్టీస్ చేయవచ్చు, వారి సమాధానాల వివరణాత్మక విశ్లేషణతో పాటు, పరీక్షా ఫలితాలను హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా వారి ఇష్టపడే భాషలో వెంటనే వీక్షించవచ్చు. 

 

 

*****



(Release ID: 1633228) Visitor Counter : 241