నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

స్కిల్ ఇండియా మిషన్ కింద యోగా బోధకులు మరియు శిక్షకులుగా 96,000 మందికి పైగా శిక్షణ పొందారు


యోగా అభ్యర్థులు అత్యధికంగా ఉన్న మొదటి 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ మరియు ఒడిశా ఉన్నాయి

Posted On: 20 JUN 2020 7:06PM by PIB Hyderabad

ఒత్తిడిని తగ్గించి, సంపూర్ణ శారీరక, మానసిక శ్రేయస్సు కోసం యోగాను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా, ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ (ఎం.ఎస్.‌డి.ఇ) శుక్రవారం ఒక వెబి‌నార్‌ను నిర్వహించింది.  ‘యోగా కు ఎస్ అని చెప్పండి మరియు రోగానికి నో అని చెప్పండి’ అనే ఇతివృత్తంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్, యోగా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ హన్సాజీ యోగేంద్రతో పాటు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే సమక్షంలో ఈ వెబినార్ ను నిర్వహించారు. బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (బి&డబ్ల్యు.ఎస్.ఎస్.సి) ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీమతి మోనికా బాల్ ఈ కార్యక్రమానికి సంధానకర్త గా వ్యవహరించారు. కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో, శారీరక దృఢత్వం మరియు మానసిక చురుకుదనాన్ని మెరుగుపరచడంలో యోగా యొక్క ప్రయోజనాల గురించి విస్తృత అవగాహన కల్పించడం మరియు ముఖ్యంగా యోగాను స్వీకరించడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ వెబినార్ ను నిర్వహించారు. 

 రాబోయే ఆందోళన మరియు ఒత్తిడికి యోగా పాత్రను అర్థం చేసుకోవడంలో ప్రజలకు సహాయపడటమే కాకుండా, యువత కోసం యోగా రంగంలో లభించే వివిధ వృత్తిపరమైన అవకాశాల గురించి ఈ వెబినార్  ప్రజలకు అవగాహన కల్పించింది.  యోగా రంగంలో లభించే వివిధ ఉపాధి అవకాశాలను యువత సాధించడంలో స్కిల్ ఇండియా నిరంతర ప్రయత్నాల ఫలితంగా, ప్రధానంగా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పి.ఎం.కె.వి.వై) కింద వివిధ నైపుణ్య కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా 96,196 మంది అభ్యర్థులు ప్రియర్ లెర్నింగ్ గుర్తింపు (ఆర్‌పిఎల్), స్వల్పకాలిక శిక్షణ (ఎస్.‌టి.టి) & స్పెషల్ ప్రాజెక్ట్‌లలో యోగా బోధకులుగా మరియు శిక్షకులుగా శిక్షణ పొందారు. యోగా కోసం మూడు నిర్దిష్ట కోర్సులు ఉన్నాయి - యోగా బోధకుడు (ఎన్.‌ఎస్.‌క్యూ.ఎఫ్ 4), యోగా శిక్షకుడు (స్థాయి 5) మరియు సీనియర్ యోగా శిక్షకుడు (స్థాయి 6).  మంత్రిత్వ శాఖ మరియు బ్యూటీ & వెల్నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (బి&డబ్ల్యు.ఎస్.ఎస్.సి) ఈ గొప్ప మైలురాయిని చేరుకోవడానికి సహాయపడిన కొంతమంది ముఖ్యమైన భాగస్వామ్య సంస్థల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ మరియు పతంజలి ఉన్నాయి.   నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో - ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి.   2020-2021 విద్యా సంవత్సరం నుండి సిబిఎస్ఇ పాఠశాలల్లో XI తరగతి నుండి ప్రారంభమయ్యే యోగాలో వృత్తి విద్యా కోర్సులను బి&డబ్ల్యు.ఎస్.ఎస్.సి.కలిగి ఉంది, బి&డబ్ల్యు.ఎస్.ఎస్.సి. యొక్క యోగా ఉద్యోగ అవకాశాలు అన్ని రాష్ట్రాలలోని అన్ని సమగ్రా శిక్షా పాఠశాలల్లో దాని ఉన్నత మాధ్యమిక విభాగాల కోసం అందుబాటులో ఉన్నాయి. 

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ మాట్లాడుతూ,  “యోగా అనేది కేవలం ఆధ్యాత్మికత గురించి మాత్రమే కాదు; ఇది ఒక నైపుణ్యం మరియు వాస్తవానికి ఒక పరిశ్రమకు సంబంధించినది.  నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ఎదురయ్యే వివిధ సవాళ్లతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సతమతమౌతున్నందున, ప్రస్తుత కాలంలో యోగా యొక్క ప్రాముఖ్యత మరింత కీలకంగా మారింది.  ఇటువంటి క్లిష్ఠ సమయాల్లో మనమందరం యోగాను స్వీకరించాలి, ఎందుకంటే ఇది మన మానసిక చురుకుదనాన్ని మరియు శక్తిని పెంచడానికి సహాయపడుతుంది, ఇది మనలను చాలా ప్రశాంతంగా మరియు మరింత ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.  యోగా కేవలం భంగిమ మాత్రమే కాదు; ఇది ఒక యోగా జీవన విధానం. ” అని పేర్కొన్నారు. 

 “యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మార్చడానికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనా విధానంతో అనుసంధానించబడిన ఎం.ఎస్.డి.ఈ. ప్రయత్నాలకు ధన్యవాదాలు, భారతదేశం యొక్క మారుమూల ప్రాంతాలకు కూడా యోగా చేరుకుంది.  కౌశల్ వికాస్ కేంద్రాల ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలలోని ప్రజలు కూడా యోగా నేర్చుకుంటున్నారు. మొత్తం దేశంలో నైపుణ్యాభివృద్ధి పూర్తి స్థాయిలో విస్తరిస్తోంది, అదేవిధంగా, యోగా కూడా యువతకు ఒక గొప్ప ఉపాధి ఎంపికగా మారింది, ”అని గురుదేవ్ అన్నారు.

దేశంలో యోగా బోధకులు మరియు శిక్షకుల అవసరం గురించి కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే మాట్లాడుతూ, “యోగా అనేది ప్రాచీన వేద సంప్రదాయ మూలాలున్న మన భారతదేశం నుండి ప్రపంచానికి అందిస్తున్న ఒక అమూల్యమైన బహుమతి" అని వ్యాఖ్యానించారు.   "గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం అన్వేషణలో యోగా అతిపెద్ద ప్రజా ఉద్యమాలలో ఒకటిగా అవతరించిందని మన గౌరవప్రదమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కూడా పేర్కొన్నారు.  ప్రధానమంత్రి ఆశయానికి అనుగుణంగా, మేము బ్యూటీ & వెల్నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (బి&డబ్ల్యు.ఎస్.ఎస్.సి) తో కలిసి యోగా రంగంలో వివిధ వృత్తిపరమైన అవకాశాల గురించి అవగాహన పెంచుకోవడానికి మరియు ఆశాజనక భవిష్యత్తు కోసం యోగాను స్వీకరించడానికి యువతను ప్రోత్సహిస్తున్నాము.  కోవిడ్-19 అనంతర పరిస్థితుల్లో, ధృవీకరించబడిన యోగా బోధకులు మరియు శిక్షకుల డిమాండ్ పెరుగుదలతో,  సమర్ధవంతమైన శ్రామిక శక్తిని పెంచే నైపుణ్యం యొక్క అత్యవసర అవసరాన్ని నేను ఊహించాను.  యోగాను నిజంగా విశ్వవ్యాప్తంగా మార్చడానికి మరియు యోగా రంగంలో లాభదాయకమైన ఉపాధి అవకాశాలను అన్వేషించడానికి దేశవ్యాప్తంగా యువతను శక్తివంతం చేయాలనే మా ఆశయానికి మేము కట్టుబడి ఉన్నాము.” అని కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే వివరించారు. 

యోగా యొక్క ప్రయోజనాల గురించి, డాక్టర్ హన్సాజీ యోగేంద్ర మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, భారతదేశంలో పెరుగుతున్న నైపుణ్యాభివృద్ధి అవసరాన్ని మరియు ఆరోగ్యంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన సమాజంలో అవసరమైన మార్పును తీసుకురావడంలో యోగా ఎలా కీలక పాత్ర పోషించిందో చర్చించామని చెప్పారు.  ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ఈ వ్యాధితో పోరాడటానికి మరియు పటిష్టమైన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోడానికీ  యోగా చాలా అద్భుతమైన సాధనంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ఎం.ఎస్.‌డి.ఇ. యొక్క అమలు సంస్థ అయిన జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలోని బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (బి&డబ్ల్యు.ఎస్.‌ఎస్.‌సి) యోగా ను ఉపాధి అవకాశంగా అభ్యర్థుల నైపుణ్యాన్ని తీర్చిదిద్ధేందుకు అనేక కార్పొరేట్ సంస్థలతోనూ, ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తోంది.  ఈ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో, సిడెస్కో ఇంటర్నేషనల్, వైట్ లోటస్ మరియు ఇంటర్నేషనల్ యోగా అలయన్స్ వంటి సంస్థలు ఉన్నాయి.  యోగాలో భారతీయ యువత నైపుణ్యం కోసం డాక్టర్ హెచ్.ఆర్.నాగేంద్ర మరియు డాక్టర్ హన్సాజీల సమక్షంలో బి&డబ్ల్యు.ఎస్.సి. సంస్థ, యోగా ఇన్ స్టిట్యూట్ తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

 

*******


(Release ID: 1633128) Visitor Counter : 181