జల శక్తి మంత్రిత్వ శాఖ

ఒడిశాలోని జల్ జీవన్ మిషన్ పురోగతి నెమ్మదిగా ఉండడంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన కేంద్ర జల్ శక్తి మంత్రి

2020-21లో జెజెఎంకు రూ.812 కోట్లు కేంద్రం ఆమోదం

Posted On: 19 JUN 2020 4:12PM by PIB Hyderabad

జల్ జీవన్ మిషన్ (జెజెఎం) ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ  రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేయాలని  ఒడిశా ముఖ్యమంత్రికి జల్ శక్తి కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ రాసిన లేఖలో కోరారు. 2024 నాటికి ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్ల (ఎఫ్‌హెచ్‌టిసి) ద్వారా ప్రతి గ్రామీణ గృహాలకు సురక్షితమైన తాగునీరు అందించడం ద్వారా గ్రామీణ ప్రజల జీవితాలను మెరుగుపర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న జెజెఎం అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకారం అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధత ఆయన లేఖలో ప్రతిధ్వనించింది.

లక్ష్యాలు వీగిపోవడం, రాష్ట్రం తగు రీతిలో నిధులు వినియోగించుకోపోవడాన్ని కేంద్ర మంత్రి తన లేఖలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఒడిశా రాష్ట్రంలో 2019-20లో కొళాయి కనెక్షన్ల లక్ష్యం 15.61 లక్షలయితే ఇప్పటి వరకు కేవెలం 4.37 లక్షల ఇళ్లకే కనెక్షన్లు ఇచ్చారని ఇది 27.97% అని పేర్కొన్నారు. ఈ అంతరం వల్ల నిధులు తక్కువగా వినియోగించుకుంటున్నారు. 2019-20లో ఒడిశాకు రూ.364.74 కోట్లు కేటాయించారు, అందులో రాష్ట్రం రూ.275.02 కోట్లు మాత్రమే ఉపయోగించుకోగలిగింది. రాష్ట్రం నిధులను పూర్తిగా ఉపయోగించుకోలేక పోయినందున, భౌతిక పురోగతిని వేగవంతం చేయడానికి, నిధుల వినియోగాన్ని మెరుగుపరిచేందుకు నీటి సరఫరా పథకాల ప్రణాళిక, అమలు వ్యూహాన్ని సమీక్షించాలని కేంద్ర మంత్రి సిఎంను అభ్యర్థించారు. ఈ మిషన్ కోసం, అందించిన ఎఫ్‌హెచ్‌టిసిల మంజూరు, అందుబాటులో ఉన్న కేంద్ర నిధులు, రాష్ట్రాల మ్యాచింగ్ గ్రాంట్ ఉపయోగించడం చూసి నిధులు రాష్ట్రాలకు అందుతాయి.

ప్రతి ఇంటికి తాగునీరు అందించడం జాతీయ ప్రాధాన్యత ఎలా అవుతుందో వివరిస్తూ, ఒడిశాకు నిధుల కేటాయింపును రూ.364.74 కోట్ల నుంచి రూ. 812.15 కోట్లకు 2020-21లో పెంచడం గురించి శ్రీ షేఖావత్ తన లేఖలో ప్రముఖంగా ప్రస్తావించారు. రూ.90 కోట్ల ఖర్చు చేయని బ్యాలెన్స్‌తో పాటు, ఈ ఏడాది కేంద్ర కేటాయింపు ₹ 812 కోట్లు, మ్యాచింగ్ గ్రాంట్ లోని రాష్ట్ర వాటాతో  కలిపి 2020-21లో జల్ జీవన్ మిషన్ అమలు కోసం ఒడిశాకు రూ.1,805 కోట్లు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో 100% కొళాయి కనెక్షన్ లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడే ఈ కార్యక్రమానికి  కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధుల వాటాను సకాలంలో రాష్ట్రం అందిస్తుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

2020-21లో, ఒడిశాకు పంచాయితీ రాజ్ సంస్థల 15 వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లుగా రూ. 2,258 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో 50% తప్పనిసరిగా నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యానికి ఉపయోగించబడాలి. ఈ మొత్తాన్ని నీటి సరఫరా, వర్షపు నీటి సేకరణ మరియు నీటి రీసైక్లింగ్‌తో పాటు గ్రామాల్లోని ఓడిఎఫ్ సుస్థిరత పనులకు ఖర్చు చేయాలి..

ప్రస్తుతం ఉన్న కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కేంద్ర మంత్రి లేఖ సరి అయిన సమయంలో ఈ లేఖ రాశారు. సాంఘిక దూరాన్ని అలవాటు చేసుకుంటూ, నీటి సరఫరా పనులను వేగవంతం చేయడంలో వారికి సహాయపడటానికి ఇది ప్రజలలో ప్రవర్తనా మార్పులను కలిగించే సమయం. ప్రజలు ప్రజా నీటి వనరుల కోసం గుంపులుగ గుమిగూడదకుండా ఉండడం ఇపుడు చాలా ముఖ్యం. అందువల్ల, గృహ కొళాయి కనెక్షన్లను అందించడానికి అన్ని గ్రామాలలో నీటి సరఫరా పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది, ఇది స్థానికులకు మరియు వలసదారులకు ఉపాధి పొందడంలో సహాయపడుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

2024 నాటికి రాష్ట్రాన్ని ‘100% ఎఫ్‌హెచ్‌టిసి రాష్ట్రంగా’ మార్చడానికి ఒడిశా సిఎంకు నిరంతరాయంగా మద్దతు ఇస్తున్నట్లు జల్ శక్తి మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్యమంత్రితో జెజెఎం ప్రణాళిక మరియు అమలు గురించి చర్చించాలని భావిస్తున్నారు.



(Release ID: 1632867) Visitor Counter : 168