సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా గల ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ల నుంచి కోవిడ్‌పై వారి స్పందన తెలుసుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
Posted On:
19 JUN 2020 7:24PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా గల ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ల నుంచి , కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కోవిడ్ పై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఒకటిన్నర గంటకు పైగా జరిగిన వెబినార్‌లో చెన్నై, న్యూఢిల్లీ, ముంబయ్, నాగపూర్.పాట్నా, కోల్‌కతా, ఈరోడ్ తదితర నగరాలనుంచి వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ ఫిజీషియన్లు, స్పెషలిస్టులు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ , దేశంలోని వైద్యులు అద్భుతమైన సేవలు అందిస్తున్నారని, సకాలంలో స్పందించి కోవిడ్‌పై విజయవంతమైన పోరాటం సాగిస్తున్నారని అన్నారు. వైద్య రంగం, దేశంలోని వైద్య మౌలిక సదుపాయాల రంగం ప్రస్తుత సంక్షోభ సమయంలో అద్భుత కృషి చేస్తున్నాయని , తద్వారా ఈ రంగాల శక్తిసామర్ధ్యాలు ఏమిటో ప్రపంచానికి తెలిసివచ్చిందని అన్నారు. స్వల్ప వ్యవధిలోనే మార్పులకు అనుగుణంగా తమను తాము మలచుకోగల శక్తిని , ప్రజలకు విజయవంతంగా సేవల అందించే శక్తిని ఇవి చాటాయని అన్నారు.
మెడికల్ మేనేజ్‌మెంట్ లో నాన్ -ఫార్మాకోలాజికల్ ప్రాక్టీస్‌ల గురించి ప్రస్తావిస్తూ డాక్టర్‌జితేంద్ర సింగ్ శ్రేష్ఠమైన యాంటీ మైక్రోబియల్ మందులు వచ్చే వరకు 1970 లేదా 80 ల వరకు ఇండియాలో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, మెడికల్ మేనేజ్‌మెంట్ లో భాగంగా ఉండేవన్నారు. ఆమేరకు, భారతీయ ఫిజీషియన్లు పశ్చిమ దేశాల ఫిజీషియన్ల కంటే, ఇన్‌ఫెక్షన్లు, అంటువ్యాధులను ఎదుర్కొవడంలో బాగా అలవాటు కలిగిన వారన్నారు.
ఈ వెబినార్‌కు డాక్టర్ ఎ .మురుగనాథన్ మాడరేటర్ గా వ్యవహరించారు.ఆరోగ్యసేతు యాప్‌ను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్ళాలని, కోవిడ్‌ను ఎదుర్కోవడంలో భారతీయ నమూనాలపై దృష్టిపెట్టాలని అన్నారు. సబ్‌స్క్రిప్‌క్షన్ ఆధారిత ఇన్సూరెన్స్ పద్ధతిని దక్షిణ భారతదేశంలో కొన్ని ఆస్పత్రులు అనుసరిస్తున్నాయని చెప్పారు
ప్రస్తుతం మన ముందున్న లక్ష్యం గురించి మాట్లాడుతూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కోవిడ్ నియంత్రణకు సంబంధించిన అంశాలపై దృష్టిపెట్టాలని, మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని వేళలా సంసిద్ధంగా ఉండాలని అన్నారు. ఈసందర్భంగా ఆయన ఆయుష్మాన్ భారత్ , ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం గురించి ప్రస్తావించారు. దీనిని భవిష్యత్తులో మరింత విస్తృతం ,సమ్మిళితం చేయవచ్చని అన్నారు.
ఈ వెబినార్‌లో పాల్గొన్న డాక్టర్ల నుంచి పలు సూచనలు వచ్చాయి. ప్రైవేటు రంగంపై తక్కువ నియంత్రణలు ఉండాలని , లైసెన్సు లేకుండా ప్రాక్టీసు చేయడాన్ని అరికట్టడం తక్షణావశ్యకత అని వారు సూచించారు. యువ వైద్యులు మెడికల్ క్లినిక్‌లు ఏర్పాటు చేసేవిధంగా ప్రోత్సహించేందుకు, పిపిపి నమూనాలను ప్రోత్సహించేందుకు వీలుగా అనవసర విధివిధానాలను తొలగించవచ్చని వారు సూచించారు.
(Release ID: 1632837)
Visitor Counter : 187