రైల్వే మంత్రిత్వ శాఖ

ఏసీల ద్వారా కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి తీవ్రమయ్యే ప్రమాదం నేపథ్యంలో ఏసీ కోచ్ లు వినియోగానికి తగినవి కావు

· భారతీయ రైల్వే 5231 నాన్ ఎయిర్ కండిషన్డ్ కోచ్ లను ఐసోలేషన్ కోచ్ లుగా మార్చింది

· సహజ కాంతి మరియు గాలి ప్రసరణ కోసం తగినంత వీలుతో సౌకర్యవంతంగా ఉండాలి, ఏసీ కోచ్ లు ఇలాంటి సౌకర్యాన్ని అందించలేవు

· నాన్ ఎయిర్ కండిషన్డ్ కోచ్ లను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చే దిశగా అధికారిక బృందం నిర్ణయం తీసుకుంది

· సాధారణంగా అధిక పరిసర ఉష్ణోగ్రత వైరస్ తో పోరాడేందుకు బాగా సహాయపడడమే గాక, తెరిచి ఉన్న కిటికీల ద్వారా మంచి గాలి ప్రసరణ జరిగి రోగులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు

· నాన్ ఏసీ కోచ్ లను ఈ తరహాలో వినియోగించుకోవడం సాంకేతికంగా, ఆరోగ్య పరంగా అత్యవసరం

· రోగులకు మరియు సిబ్బందికి తగిన సౌకర్యాల కల్పన కోసం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

· ప్రతి ఐసోలేషన్ రైలు తప్పనిసరిగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోవిడ్ -19 ఆరోగ్య కేంద్రాలకు లేదా కనీసం ఒక కోవిడ్ ఆస్పత్రి పర్యవేక్షణలో ఉండాలి. ఇక్కడ రోగుల పరిస్థితి క్షీణించే ప్రమాదం ఉంటే వెంటనే ఆస్పత్రికి మార్చే వెసులుబాటు ఉండాలి.

· రాష్ట్ర ప్రభుత్వాల అభ్

Posted On: 19 JUN 2020 1:43PM by PIB Hyderabad

కోవిడ్ -19 వైరస్ ను ఎదుర్కొనేందుకు చేస్తున్న అవిశ్రాంత పోరాటంలో భాగంగా, ఈ వైరస్ ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే 5231 నాన్ – ఏసీ కోచ్ లను ఐసోలేషన్ కోచ్ లుగా మార్చింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన మార్గనిర్దేశకత్వంలో  కోవిడ్ కేర్ సెంటర్ (సి.సి.సి) స్థాయిలో కోవిడ్ అనుమానిత / ధృవీకరించబడిన కేసుల నిర్వహణ ఇందులో  సాగుతుంది.

ఈ సదుపాయాలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఇంటిగ్రేటెడ్ కోవిడ్ ప్రణాళికలో భాగంగా ఉంటాయి. రాష్ట్రాలు అందించే సౌకర్యాలకు మించి సేవలు అవసరమైనప్పుడు వీటిని వినియోగిస్తారు.

సహజ సిద్ధమైన కాంతితో, సహజ గాలి ప్రసరణ బాగా కావాలి. ఎయిల్ కండిషన్ ద్వారా ఇది సాధ్యం కాదు.

కోవిడ్ రోగుల కోసం ఈ కోచ్ లను మార్చడానికి ముందు ఏసీ, నాన్ ఏసీ కోచ్ ల విషయంలో ఎదురయ్యే సవాళ్ళ గురించి నీతి ఆయోగ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖలు చర్చించారు. ఏసీ ద్వారా కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండే నేపథ్యంలో ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఏసీ కోచ్ లు ఐసోలేషన్ కేంద్రాలకు తగినవి కావని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా సాధారణ, అధిక పరిసర ఉష్ణోగ్ర వైరస్ మీద పోరాటానికి ఉపకరిస్తుందని, తెరిచిన కిటికీల ద్వారా జరిగే సహజ సిద్ధమైన గాలి, వెలుతురు ప్రసరణలు రోగులకు సహాయపడతాయని భావిస్తున్నారు.

సాధికారిక బృందం – 2 నిర్దేశకత్వాన్ని, నిర్ణయాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఐసోలేషన్ కోచ్ లు కోవిడ్ కేర్ సెంటర్స్ గా పని చేస్తున్నాయి. వైద్య పరంగా తేలికపాటి లేదా చాలా తేలికపాటి కేసులు లేదా కోవిడ్ అనుమానిత కేసులుగా నిర్ణయించిన వాటికి మాత్రమే ఇక్కడ సంరక్షణ అందిస్తారు. అలాంటి ప్రతి ఐసోలేషన్ రైలు తప్పనిసరిగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆరోగ్య కేంద్రాలు మరియు కనీసం ఒక కోవిడ్ ఆస్పత్రి పర్యవేక్షణలో ఉండాలి. ఎప్పటికప్పుడు వారు పరిస్థితిని సమీక్షిస్తూ ఇక్కడ రోగుల పరిస్థితి క్షీణించటం ప్రారంభమైతే, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించే సౌలభ్యం ఉండాలి.

కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ తయారు చేసిన కోవిడ్ రైలు విధానాల ప్రకారం, రైలు నిలిపి ఉంచిన ప్లాట్ ఫామ్ పక్కనే ఉన్న ప్లాట్ ఫామ్ పై సంబంధిత ఆరోగ్య యూనిట్ ద్వారా ఒక అత్యవసర పునరుజ్జీవన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. రైలు నిలిపి ఉంచిన ప్లాట్ ఫామ్ పై రైలు చివర ఒక చోట నుంచి మరో చోట మార్చే సౌకర్యం కలిగి ఉండాలి. అదే విధంగా ఈ సౌకర్యం శాశ్వతంగా అందుబాటులో లేని పక్షంలో తాత్కాలికంగానైనా అందుబాటులో ఉండాలి.

రాష్ట్రాలు అందించే సౌకర్యాలకు మించి రోగుల తాకిడి ఉన్న నేపథ్యంలో మాత్రమే ఈ కోచ్ లు ఉపయోగపడతాయని, అలాగే జులై మధ్య వారంలో ఈ కోచ్ లు అవసరం అవుతాయని, ఆ సమయానికి వైరస్ వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని భావించారు.

గాలి ప్రసరణ విషయంలో ప్రమాద కారణంగా ఎయిర్ కండిషన్ కోచ్ లు పనికిరాని నేపథ్యంలో, నాన్ ఏసీ కోచ్ లను కోవిడ్ కేర్ సెంటర్ లు మార్చేందుకు, అదే విధంగా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతత బాగా గాలి, వెలుతు ఉండే ప్రాంతం రోగులు కోలుకోవడానికి సహాయపడుతుందని భావించిన అధికారిక బృందం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

కోవిడ్ రోగుల కోసం ఈ కోచ్ లను మార్చడానికి ముందు ఎసీ మరియు నాస్ ఎసీ కోచ్ ల మధ్య ఉండే వ్యత్యాసాలను, ఎదురయ్యే సమస్యలను నీతి ఆయోగ్ మరియు ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలతో చర్చించారు. ఏసీ వల్ల వైరస్ ప్రసరణ తీవ్రంగా ఉండే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇవి తగివని కావు అని అంగీకరించారు. సాధారణంగా అధిక పరిసర ఉష్ణోగ్రత వైరస్ తో పోరాడేందుకు మరియు తెరిచిన కిటికీలు గాలి ప్రసరణకు సహాయపడతాయని భావిస్తున్నారు.

కిటికీలు మూసి ఉంచితే జూన్ మధ్యలో నాన్ ఏసీ బోగీలు కాస్త వెచ్చగా ఉంటాయి. పరిసరాల ఉష్ణోగ్రత కూడా 43 డిగ్రీల వరకూ ఉండవచ్చు. దోమలు రాకుండా వలలు ఏర్పాటు చేసిన కిటికీలు తెరిచి ఉంచితే, గాలి, వెలుతురు ప్రసరణతో పాటు ఉష్ణోగ్రత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. రుతుపవనాలు, వర్షాల నేపథ్యంలో ఈ రకమైన ఉష్ణోగ్రత తాత్కాలికమైన అంశంగా ఉంటుందని భావిస్తున్నారు.

వేసవి కారణంగా కోచ్ ల లోపల మరింత వేడి ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో, రోగులు మరియు సిబ్బంది సౌకర్యం కోసం ఈ విషయంలో బహుముఖ వ్యూహాన్ని అనుసరించనున్నారు.

క్రింది అంశాలను అనుసరించనున్నారు

1.   ప్లాట్ ఫామ్ ల వద్ద ఉంచిన ఐసోలేషన్ కోచ్ లపై కవర్ షీట్లు (వైట్ కానట్) లేదా తగిన పదార్థాలను ఉంచుతారు. ఇది బయటి వేడి నుంచి రక్షణ ఇవ్వడమే గాక, ఒకటే ఉష్ణోగ్రత ఉండేలా సహాయపడుతుందని భావిస్తున్నారు.

2.   కోచ్ లపై బబుల్ ర్యాప్ మరియు ఫిల్మ్ లను అంటించాలని భావిస్తున్నారు. ఇవి కోచ్ ల లోపలి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ మేర తగ్గిస్తుందని భావిస్తున్నారు.

3.   పై కప్పులకు వేడిని తగ్గించే పెయింట్ : ఐసోలేషన్ కోచ్ ల పైకప్పును వేడిని ఎదుర్కొనే పెయింట్ ను వేయడం ద్వారా నార్తర్న్ రైల్వే ఓ ప్రయత్నం నిర్వహించింది. ఇలా చేయడం ద్వారా కోచ్ లోపల ఉష్ణోగ్రత 2.2 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ తగ్గించవచ్చని తెలిసింది.

4.   ముంబై లోని ఐఐటి సహకారంతో అభివృద్ధి చేసిన మరో పూత విషయంలో కూడా ప్రస్తుతం ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనికి సంబంధించిన చర్చ 2020 జూన్ 20న జరిపి, ఫలితాలను నిర్ణయించనున్నారు.

అదే విధంగా పైకప్పు మీద పెయింట్ వేయడానికి బదులు వెదురు పుల్లలను పరచటం లాంటి ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇది ఉష్ణోగ్రతను మరింత తగ్గిస్తుంది.

5.   పోర్టబుల్ కూలర్లను కోచ్ ల లోపల ఉంచటాన్ని కూడా ప్రయత్నించారు. దీని ద్వారా 3 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర ఉష్ణోగ్రత తగ్గింది.

6.   నీటిని పొగమంచులా ప్రసరింపజేసే వ్యవస్థను కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పొడిగాలి సీజన్ లో, ఉష్ణోగ్రతను తగ్గించటంతో పాటు రోగుల సౌకర్యాన్ని ఈ వ్యవస్థ మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రైల్వే ఈ కోచ్ లను రాష్ట్ర ప్రభుత్వాలకు సేవా ప్రదాతగా అందుబాటులోకి తీసుకురానుంది. కోవిడ్ రోగులకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ఇతర మార్గాలు అందుబాటులో లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వీటిని వినియోగించుకోవచ్చు. ఇందు కోసం 5000లకు పైగా కోచ్ లు సిద్ధంగా ఉన్నాయి. 


(Release ID: 1632812) Visitor Counter : 226