హోం మంత్రిత్వ శాఖ

ప్రైవేటు ఆసుత్రుల్లో కరోనా చికిత్స చార్జీలపై పరిమితి విధింపు

సర్వేలనుంచి పరీక్షల నిర్వహణ వరకూ
ఢిల్లీలో కోవిడ్-19 నిర్వహణా చర్యల క్రమబద్ధీకరణ
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆదేశాలపై చర్యల అమలు

ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ రోగుల ఐసొలేషన్ బెడ్ల
చార్జీలు దాదాపు మూడోవంతుకు తగ్గింపు

ఢిల్లీలోని 242 కోవిడ్ వైరస్ కట్టడి ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పూర్తి, మొత్తం 2.3లక్షల జనాభాపై ముగిసిన సర్వే

చవుకగా, వేగంగా నిర్వహించగలిగే ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షల ప్రక్రియ ప్రారంభం; 193 పరీక్షా కేంద్రాల్లో ఇప్పటికే 7,040 మందికి పరీక్షలు, రానున్న రోజుల్లో మరింత వేగంగా పరీక్షల ప్రక్రియ

Posted On: 19 JUN 2020 3:17PM by PIB Hyderabad

ఢిల్లీలో కోవిడ్ రోగులకు చికిత్సపై ప్రజలకు ఊరట  కలిగించే విషయంలో మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా, కోవిడ్-19 వైరస్ నియంత్రణ చర్యలను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ స్వయంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలపై అమిత్ షా చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో  కోవిడ్-19 పరిస్థితిపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గత కొన్ని రోజులుగా జరిగిన  సమావేశాల్లో ఆయన ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా,..పలు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలోని 242 కోవిడ్ కట్టడి ప్రాంతాల్లో ఇంటింటి సర్వే 2020 జూన్ 18వతేదీన ముగిసింది. మొత్తం 2.3 లక్షల మందిపై ఇంటింటి సర్వే నిర్వహించారు.

 అలాగే కేంద్ర హోమ్ మంత్రి ఆదేశాలమేరకు ఢిల్లీలో టెస్టుల సామర్థ్యాన్ని పెంచారు. టెస్టల ఫలితాలను కూడా త్వరగా విడుదల చేస్తున్నారు. త్వరగా నిర్వహించడానికి వీలయ్యే ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షా ప్రక్రియను జూన్ 18 ప్రారంభించారు. ఢిల్లీలోని 193 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 7,040మందికి పరీక్షలు పూర్తి చేశారు. రానున్న రోజుల్లో టెస్టుల సంఖ్య మరింత పెరగనుంది.

  మంత్రి అమిత్ షా నిర్ణయం మేరకు నమూనాల పరీక్షల సంఖ్యను వెంటనే రెట్టింపు చేశారు. కోవిడ్ పరీక్షలకోసం 2020 జూన్ 15 తేదీనుంచి జూన్ 17 తేదీవరకూ ఢిల్లీలో మొత్తం 27,263 నమూనాలను సేకరించారు. అంతకు ముందు రోజువారీగా సేకరించే నమూనాల సంఖ్య 4,000నుంచి, 4,500మాత్రమే ఉండేది.

  ఢిల్లీలోని సామాన్య ప్రజలకు ఊరట కలిగించే చర్యల్లో భాగంగా,.. ప్రైవేటు ఆసుపత్రుల్లో వివిధ కేటగిరీల్లో 60శాతం  కరోనా రోగుల పడకలకు చికిత్సా చార్జీలను ఖరారు చేయడానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ అధ్యక్షతన కమిటీని నియమించారు. ఐసోలేషన్ పడకలకు, వెంటిలేటర్ అవసరంలేని .సి.యు.లకు, వెంటి లేటర్ సదుపాయంతో కూడిన .సి.యు.లకు చార్జీలను ఖరాలు చేసేందుకు కమిటీ నియమితమైంది.

 

ఢిల్లీ ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్సకు కొత్త చార్జీలు

కేటగిరీ

(ప్రైవేటు ఆసుపత్రులు)

 

కొత్త చార్జీలు (రోజుకు)

(పి.పి.., మందులతోసహా)

పాత చార్జీలు (రోజుకు)

(పి.పి.. చార్జీలు కాకుండా)

ఐసొలేషన్ పడకలు

రూ. 8,000-10,000

రూ. 24,000-25,000

వెంటిలేటర్ లేకుండా .సి.యు.లు

రూ. 13,000-15,000

రూ. 34,000-43,000

వెంటిలేటర్.తో .సి.యు.లు

రూ. 15,000-18,000

రూ. 44,000-54,000

 

  అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ల( పి.పి..లు)తో సహా చికిత్స అందించినందుకు రోజుకు 8వేలనుంచి 10వేల రూపాయలు చార్జీలను కమిటీ సిఫార్సు చేసింది. పి.పి..లు, మందులతో సహా ఐసొలేషన్ పడకలకు రోజుకు 13వేల నుంచి 15వేల రూపాయలు, వెంటిలేటర్ల సదుపాయం లేకుండా పి.పి..లు, మందులతో సహా  .సి.యు.సేవలకు రోజుకు 13వేలనుంచి 15వేల రూపాయలు, వెంటలేటర్ సదుపాయంతో కూడిన .సి.యు. సేవలకు పి.పి..లు, మందులతో సహా రోజుకు 15వేలనుంచి 18వేల రూపాయలు చార్జీలు ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. జాతీయ అక్రెడిటేషన్ బోర్డు (NABH)తో ఆసుపత్రికి సంబంధం ఉందా, లేదా అంశం ప్రాతిపదికగా చార్జీలు వర్తిస్తాయని కమిటీ పేర్కొందిప్రైవేసు ఆసుపత్రులు ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీల కంటే కమిటీ సిఫార్సు చేసిన చార్జీలు చాలా తక్కువ. ప్రస్తుతం వివిధ కేటగిరీలకు పి.పి..లు లేకుండా రోజువారీ చార్జీలు వరుసగా 24వేలనుంచి25వేల రూపాయలు,..34వేలనుంచి 43వేల రూపాయలు, 44వేలనుంచి 54వేల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వసూలు చేస్తున్నారు.

 

***

 



(Release ID: 1632761) Visitor Counter : 186