ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం

కర్ణాటక రాష్ట్రం యొక్క ఐటీ ఆధారిత సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు ఇంటింటి సర్వేను ప్రశంసించిన కేంద్రం

Posted On: 19 JUN 2020 1:28PM by PIB Hyderabad

కోవిడ్ -19 నిర్వహణ విషయంలో కర్ణాటక వినియోగించుకున్న ఉత్తమ విధానాన్ని కేంద్ర ప్రశంసించింది. కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు 1.5 కోట్ల గృహాల్లో భౌతిక లేదా ఫోన్ ఆధారిత సర్వేలు ఇందులో భాగంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలు బహుళ రంగ సంస్థల ప్రమేయంలో హోల్ ఆఫ్ గవర్నమెంట్ విధానంలో భాగంగా అభివృద్ధి అయ్యాయి. అదే విధంగా సాంకేతిక ఆధారిత పరిష్కారాలు దీనికి మద్దతును అందిస్తాయి. దీని ద్వారా వారు ప్రతి కేసును సమర్థవంతగా కనుగొని ట్రాక్ చేస్తారు. తద్వారా ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేస్తారు.

ఈ ఉత్తమ పద్ధతులను తమ తమ వెసులుబాటు ప్రకారం ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ -19 మెరుగైన నిర్వహణ కోసం అందరూ పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం ఇతర రాష్ట్రాలకు సూచించింది.

వ్యాధి బారిన పడేవారి సంఖ్యను తగ్గించేందుకు, అదే విధంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ ఓ కీలకమైన అంశం. భారత ప్రభుత్వం నిర్వచించిన విధంగా అధిక రిస్క్ మరియు తక్కువ రిస్క్ కాంటాక్ట్స్ రెండింటినీ చేర్చటం ద్వారా కాంటాక్ట్ నిర్వచనాన్ని విస్తృతం చేసింది. కర్ణాటకలో ప్రాథమిక మరియు ద్వితీయ పరిచయాల సంఖ్యను కచ్చితంగా గుర్తించి, కఠినమైన నిర్బంధంలో ఉంచారు.

ప్రత్యేకంగా నియమితులైన వ్యక్తుల ద్వారా దశవారీ చర్యలను సూచించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ రూపొందించిన ఎస్.ఓ.పి. వివరాల ప్రకారం 10 వేల మందికి పైగా బాగా శిక్షణ పొందిన క్షేత్ర సిబ్బంది కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం నిర్దిష్ట బాధ్యతలను నిర్వహిస్తారు. కాంటాక్ట్ ట్రేసింగ్ మొబైల్ అనువర్తనం మరియు వెబ్ అప్లికేషన్ భారీ మొత్తంలో పనిని అధిగమించేందుకు, పాజిటివ్ నిర్థారించిన వ్యక్తులు మరచిపోయిన అంశాలు, అదే విధంగా వారు దాచేందుకు ప్రయత్నిస్తున్న వాస్తవాలను బయటకు తీసుకునేందుకు బాగా ఉపయోగపడుతున్నాయి.

ముకిరి వాడలు లేదా ఇతర ప్రాంతాల్లో నివసించే పరిచయాల తప్పనిసరి సంస్థాగత నిర్బంధం ద్వారా పెద్ద కార్పొరేషన్ ప్రాంతాల మురికి వాడల్లో సంక్రమణ వ్యాప్తిని తగ్గించగలిగారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటకకు వస్తున్న వారంతా సేవా సింధు పోర్టల్ లో నమోదు చేసుకోవడం తప్పనిసరి చేయడం జరిగింది. ఇది వారంతా వ్యక్తిగత లేదా సంస్థాగత నిర్బంధంలో ఉన్నప్పుడు వారి పరిస్థితిని తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది. స్వీయ నిర్బంధం అమలు చేయటంలో క్షేత్రస్థాయి కార్మికులకు సహాయపడేందుకు క్వారంటైన్ వాచ్ యాప్ ఉపయోగపడుతుంది. సమాజ భాగస్వామ్యం ద్వారా గృహ నిర్బంధాన్ని అమలు చేసేందుకు రాష్ట్రం మొబైల్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసింది. ఎవరైనా స్వీయ గృహ నిర్బంధాన్ని ఉల్లంఘించినట్లైతే, పొరుగు వారి ద్వారా ఆ సమాచారం తెలుసుకుని, సదరు వ్యక్తులను సంస్థాగత నిర్బంధానికి తరలించటం జరుగుతుంది.

కర్ణాటక చేసిన భౌతిక మరియు ఫోన్ ఆధారిత గృహ సర్వే ద్వారా వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు ఇన్ ఫ్లూయంజా లాంటి అనారోగ్యాలు (ఐ.ఎల్.ఐ), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ అనారోగ్యం (ఎస్.ఏ.ఆర్.ఐ) వంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి సమగ్రమైన చికిత్సను అందించటం జరిగింది.

మే 2020లో జరిగిన ఈ సర్వే ద్వారా 168 లక్షల గృహాలకు గాను 153 లక్షల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవటం జరిగింది. పోలింగ్ బూత్ స్థాయి అధికారులు (బి.ఎల్.ఓ) హెల్త్ సర్వే యాప్ తో పాటు వెబ్ అప్లికేషన్ ను ఉపయోగించటం ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించటంలో నిమగ్నం అయ్యారు. గర్భిణీలు మరియు టిబి, హెచ్.ఐ.వి, డయాలసిస్, క్యాన్సర్ రోగులకు సంబంధించి ఆరోగ్య శాఖ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా, సర్వే ద్వారా సేకరించిన సంపూర్ణ డేటా అందుబాటులో ఉంది. నాస్కామ్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఆప్త మిత్ర టెలి – కన్సల్టేషన్ హెల్ప్ లైన్ (కాల్ నంబర్ 14410) ద్వారా కాంపైన్ ట్రీచ్ ప్రచారం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐ.వి.ఆర్.ఎస్) మరియు అవుట్ బౌండ్ కాల్స్ ద్వారా ప్రమాదంలో ఉన్న గృహాలను చేరుకోవడానికి వినియోగించబడుతోంది. కోవిడ్ -19 లక్షణాలతో ఎవరైనా ఉంటే, వారిని టెలిమెడిసిన్ వైద్యులు పరీక్షించి, సలహాలు అందిస్తారు. అదే విధంగా క్షేత్ర స్థాయి ఆరోగ్య కార్యకర్తలు (ఏ.ఎస్.హెచ్.ఏ.)లు కూడా ఆ గృహాలను సందర్శించి అవసరమైన ఆరోగ్య సేవలను అందిస్తారు. 

 

***



(Release ID: 1632756) Visitor Counter : 173