శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 నిర్ధార‌ణ‌కు సరసమైన డయాగ్నొస్టిక్ కిట్‌లను అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహ‌తి

Posted On: 19 JUN 2020 2:21PM by PIB Hyderabad

న‌వ్య క‌రోనా వైరస్ బారి నుండి బయటపడటానికి క‌చ్చితమైన నిర్ధార‌ణ పరీక్షలు చాలా ముఖ్యం. ఈ విషయంలో త‌న వంతు ప్రయత్నాలను వేగవంతం చేస్తూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతీ.. ఆర్ఆర్ యానిమల్ హెల్త్‌కేర్ లిమిటెడ్, గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జీఎంజీహెచ్) వారి సహకారంతో తక్కువ ఖర్చుతో కూడిన డయాగ్నొస్టిక్ కిట్‌లను అభివృద్ధి చేసింది. వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియా (వీటీఎం) కిట్లు, ఆర్టీ - పీసీఆర్ కిట్లు మరియు ఆర్‌ఎన్‌ఏ ఐసోలేషన్ కిట్లుగా దీనిని అభివృద్ధి చేశారు. వీటిఎం కిట్లతో వ్య‌క్తుల నుంచి పరీక్షల కోసం ముక్కు మరియు నోటి  నుంచి నమూనాలను  సురక్షితంగా సేకరించి వాటిని ప్రయోగశాలకు వైర‌ల్ క‌ల్చ‌ర్‌, టెస్టింగ్‌ల కోసం
పంపేందుకు ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ఈ కాలంలో, పరీక్షా విధానం పూర్తయ్యే వరకు వైరస్ న‌మూనాలు చెక్కుచెదరకుండా ఉండాలి. ఈ కిట్ సార్స్‌-కోవ్‌-2 యొక్క సేకరణ మరియు రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర పరిష్కారాన్ని కలిగి ఉంటుంది.
స్థానిక ప‌దార్ధాల‌తో త‌యారీ..
"కిట్ల ధరను తగ్గించడానికి, మేము స్థానిక మార్కెట్లో లభించే పదార్థాలను ఉపయోగించాము. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) సిఫారసు ప్రకారం రూపొందించ‌డ‌మైన‌ది. మేము ఈ కిట్లలో రెండు బ్యాచ్లను నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం), అస్సాం మరియు జీఎంసీహెచ్ లకు అప్పగించాము. ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేలా మేము ఈ కిట్ల‌ను పెద్దమొత్తంలో తయారు చేస్తున్నాము” అని ఈ కిట్ల అభివృద్ధి బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఐఐటీ గౌహ‌తి ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ పరమేశ్వర్ కృష్ణన్ అయ్యర్ అన్నారు.
కిట్ల‌లో రెండు రవాణా మాధ్యమాలు..
ఈ కిట్ల‌లో రెండు రవాణా మాధ్యమాలు ఉన్నాయి, ఒకటి నాసోఫారింజియల్ మరియు మరొకటి ఒరోఫారింజియల్ స్పెసిమెన్ కలెక్షన్ స్వాబ్స్‌. ఈ రెండింటిని
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ధ్రువీక‌రించి సిఫారసు చేసింది. ఈ రెండూ ఉపయోగించడానికి సురక్షిత‌మైన‌వి. ఈ పూర్తి ప్యాకేజీ వైరల్ నమూనాల సేకరణ, రవాణా, నిర్వహణ మరియు దీర్ఘకాలిక ఫ్రీజర్ నిల్వకు అనుకూలంగా ఉంటుంది. రవాణా మాధ్యమం ప్రత్యేకమైన సూత్రీకరణ 72 గంటల వరకు (శీతలీకరించిన ఉష్ణోగ్రత వద్ద) వైరస్ల యొక్క ఉనికిని  కాపాడటానికి సహాయపడుతుంది. సురక్షితమైన న‌మూనా నిమిత్తం షాఫ్ట్ మీద ముందుగానే అచ్చుపోసిన బ్రేక్‌పాయింట్‌తో ఎర్గోనామిక్‌గా దీనిని రూపొందించారు. ఈ శుభ్రమైన వీటిఎం కిట్లు కోవిడ్ -19 సంబంధిత‌ వైరల్ స్పెసిమెన్ సేకరణకు సీడీసీ - సిఫార్సు చేసిన ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉంటాయి. దీనికి తోడు ఇవి యూజర్ ఫ్రెండ్లీ పర్సనల్ ప్యాక్‌లలో ప్యాక్ చేయబడతాయి.
త్వ‌ర‌లో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి..
"ఈ కిట్లు అస్సాంలో సరసమైన మరియు అధిక-నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల అభివృద్ధికి స్పుర‌ణ‌గా నిలుస్తాయి.. దీనికి తోడు ప్రపంచ స్థాయి కిట్‌లను చేరు‌వ చేసుకొనే అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఇవి ఆరోగ్య నిపుణులకు మరియు విద్యార్థులకు కెరీర్ అవకాశాలను కల్పిస్తాయి" అని ప్రొఫెసర్ అయ్యర్ చెప్పారు. ఈ శుభ్రమైన వీటీఎం కిట్‌లతో పాటు ఆర్ఆర్‌ యానిమల్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌తో క‌లిసి ఈ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా ఆర్ఎన్ఏ ఐసోలేషన్ కిట్లు మరియు ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌లను కూడా అభివృద్ధి చేసింది. వివక్త మరియు శుద్ధి చేయబడిన ఆర్ఎన్ఏ ను తరువాత రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ (ఆర్‌టీ) అనే ఎంజైమ్ ద్వారా డీఎన్ఏ గా మార్చబడుతుంది. దీని వ‌ల్ల కోవిడ్ -19 యొక్క ఉనికి ఉందా లేదా అనే సంగ‌తి నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. ఈ కిట్లన్నింటినీ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం ద్వారా అస్సాం అవసరానికి అనుగుణంగా ప్రారంభమైంది, త్వరలో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తేనున్నారు.




(ఎడ‌మ నుంచి కుడికి..) ల‌క్ష్మి రామ‌న్ ఆదిల్‌, పీహెచ్‌డీ విద్యార్థి (ఐఐటీ , గౌహ‌తి) డాక్ట‌ర్ పంక‌జ్ చౌద‌రి (ఆర్ఆర్ యానిమ‌ల్ హెల్తె కేర్‌), ఫ్రొఫెస‌ర్ ప‌ర‌మేశ్వ‌ర్ అయ్య‌ర్‌, ప్రొఫెస‌ర్ సిధార్థ ఘోష్ (ఐఐటీ గౌహ‌తి), డాక్ట‌ర్ అనిల్ బిడ్క‌ర్ (ఆర్ఆర్ యానిమ‌ల్ హెల్త్‌కేర్‌)


(Release ID: 1632753) Visitor Counter : 247