వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

14 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం గురించి చర్చించేందుకు రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ఆహార శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్

· ఈ ఏడాది చివరి నాటికి ఓ.ఎన్.ఓ.సి. పథకాన్ని పూర్తి చేయాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫుడ్ & పి.డి.ఎస్.ను కోరిన శ్రీ పాశ్వాన్

· పి.ఎం.జి.కె.ఏ.వై. కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన 10 రాష్ట్రాలు

Posted On: 18 JUN 2020 7:01PM by PIB Hyderabad

వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కార్యక్రమం ద్వారా ఎన్.ఎఫ్.ఎస్.ఏ. రేషన్ కార్డుదారుల జాతీయ పోర్టబిలిటీ అమలు పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్విహించారు. ఈ 14 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్ సదుపాయాన్ని అమలు చేయడానికి సంసిద్ధత, కార్యాచరణ ప్రణాళికలు మరియు తాత్కాలిక కాలక్రమం అర్థం చేసుకోవటం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశానికి అస్సాం, చత్తీస్ ఘడ్, ఢిల్లీ, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆహార శాఖ మంత్రులు, ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆహార కార్యదర్శులు ప్రాతినిధ్యం వహించారు.

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో వలస కార్మికులు, ఒంటిరగా ఉన్న మరియు అవసరమైన వారికి ఓ.ఎన్.ఓ.సి. పోర్టబిలిటీ ద్వారా వారి ఆహార ధాన్యాల కోటాను పొందటానికి ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందని శ్రీ పాశ్వాన్ తెలిపారు. ఆగష్టు 2020 నాటికి మరో మూడు రాష్ట్రాలు అంటే ఉత్తరాఖండ్, నాగాలాండ్ మరియు మణిపూర్ లు జాతీయ క్లష్టర్ లో చేర్చడం జరుగుతుందని, అదే సమయంలో ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన 14 రాష్ట్రాలను ఓ.ఎన్.ఓ.సి. కింద చేర్చటానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు శ్రీ పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతం తగినంత ఆహార నిల్వ ఉందని, కోవిడ్ -19 కష్టకాలంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. పి.ఎం.జి.కె.ఏ.వై. కింద ఆహార ధాన్యాల పంపిణీని మరో మూడు నెలలు పొడిగించాలని సుమారు 10 రాష్ట్రాలు మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు శ్రీ పాశ్వాన్ తెలిపారు.

ఈ చర్చ సమయంలో మిగిలిన రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు 2020 సెప్టెంబర్ చివరి నాటికి ఈ కార్యాచరణను పూర్తి చేయడానికి తీసుకున్న చర్యలను తెలిపారు. అయితే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పూర్తి అమలు కోసం డిసెంబర్ 2020 ని తాత్కాలిక కాలంగా తెలియజేశాయి.

ఈ సమీక్షా సమావేశంలో అండమాన్ & నికోబార్ ద్వీపం, అరుణాచల్ ప్రదేశ్, లక్ష ద్వీప్ మరియు మేఘాలయ రాష్ట్రాలు  / కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా నెమ్మదిగా ఇంటర్నెట్ లేదా పరిమిత నెట్ వర్క్ కనెక్టివిటీకి సంబంధించిన సవాళ్ళను ప్రస్తావించాయి. దేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకాన్ని సరైన విధంగా, సజావా అమలు చేసేందుకు ఈ సమస్యలను డి/ ఓ టెలికమ్యూనికేషన్ ద్వారా పరిష్కరించే ప్రయత్నాలు సాగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఓ.ఎన్.ఓ.సి. పథకాన్ని వీలైనంత త్వరగా మిగిలిన రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేయటంపై వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయమంత్రి శ్రీ రౌసాహెబ్ పాటిల్ డాన్వే నొక్కి చెప్పారు. ఓ.ఎన్.ఓ.సి. పథకం వల్లే కోవిడ్-19 మహమ్మారి కష్టసమయంలో చాలా మంది వలస కూలీలు తమ ఆహారధాన్యాల కోటాను తీసుకోగలుగుతున్నాయని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో ముగింపు సందర్భంగా శ్రీ పాశ్వాన్ మాట్లాడుతూ, బయోమెట్రిక్ మరియు ఈ.పి.ఓ.ఎస్. ప్రామాణీకరణను వేగవంతం చేయమని మిగిలిన రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. తద్వారా లబ్ధిదారులు తమ సబ్సిడీ ఆహార ధాన్యాల కోటాను దేశంలో ఎక్కడ నుంచైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. 

 

***



(Release ID: 1632472) Visitor Counter : 211