రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వచ్చే ఐదేళ్ళలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్ గా భారత్: కేంద్ర రోడ్డు రవాణాశాఖామంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
18 JUN 2020 5:21PM by PIB Hyderabad
వచ్చే ఐదేళ్ళలో భారతదేసం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల శాఖామంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగానికి వీలైనన్ని రాయితీలు ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నదని చెబుతూ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల మీద జీఎస్టీని12 శాతానికి తగ్గించామన్నారు.
’కోవిడ్ అనంతరం భారతదేశపు ఎలక్ట్రిక్ వాహనాల రోడ్ మాప్’ అనే అంశం మీద ఈ రోజు ఇక్కడ జరిగిన వెబినార్ లో మంత్రి ప్రసంగించారు. ఎలక్ట్రానిక్ వాహన రంగం ఎదుర్కుంటున్న సమస్యలు తనకు తెలుసునని, అయితే వాహనాల ఉత్పత్తి పెరిగే కొద్దీ పరిస్థితిలొ కచ్చితంగా మార్పు వస్తుందని అభిప్రాయపడ్దారు. ప్రపంచం ఇంకెంతమాత్రమూ చైనాతో వ్యాపారం చెయ్యతానికి సిద్ధంగా లేదని, అది భారత్ కు చాలా మంచి అవకాశమని గుర్తుచేశారు.
పెట్రోలియం ఇంధనం అందుబాటు పరిమితంగా ఉన్నందున ప్రపంచం చౌక ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నదని, ఈ సమయంలో విద్యుత్, జీవ ఇంధనాలకు తగిన అవకాశాలుంటాయని వ్యాఖ్యానించారు. వాహనాల రద్దు విధానం గురించి ప్రస్తావిస్తూ దీనివలన ఆతో తయారీ రంగానికి మరింత ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజా రవాణా విధానంలో లండన్ నమూనాను మంత్రి ప్రస్తావించారు. అక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు బాగా పనిచేస్తున్నాయన్నారు. అలాంటి విధానాన్నే అనుసరించటం వలన పేద ప్రయాణెకులు లబ్ధి పొందటంతో బాటు నగరపాలక సంస్థలకు కూడా అనువుగా ఉంటుందని చెప్పారు. త్వరలో చేపడుతున్న ఢిల్లీ-ముంబయ్ గ్రీన్ కారిడార్ లో ఎలక్ట్రిక్ హైవే ను పైలెట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయటం గురించి ఆలోచిస్తున్నామన్నారు.
ఆటో రంగం సామర్థ్యం మీద తనకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ, ఈ ఆర్థిక సంక్షోభ కాలంలోనూ అదే విధమైన ఎదుగుదల, ఆత్మ విశ్వాసం కనబరిస్తే మంచి మార్కెట్ అవకాశాలు సంపాదించుకోవచ్చునని సూచించారు. స్వదేశీ పరిజ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ ప్రధాని ఆత్మ నిర్భర్ భారత్ కు అండగా ఉంటూ ఎదగాలని ఆటో మొబైల్ రంగానికి విజ్ఞప్తి చేశారు.
(Release ID: 1632383)
Visitor Counter : 212