సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో సుపరిపాలన పద్ధతులపై అంత‌ర్జాతీయ సివిల్

స‌ర్వెంట్ల‌ను ఉద్దేశించి రేపు ప్రసంగించనున్న‌ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

- భారతీయ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం (ఐటీఈసీ), విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సీజీజీ), పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల‌ శాఖలు సంయుక్తంగా కోవిడ్‌-19 పై రెండు రోజుల కార్య‌శాల‌ను నిర్వ‌హించ‌నున్నాయి.

Posted On: 17 JUN 2020 5:59PM by PIB Hyderabad

'కోవిడ్ ‌- 19 - మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో సుప‌రిపాల‌న ప‌ద్ధ‌తులు' అనే అంశంపై ఐటీఈసీ-ఎస్‌సీజీజీలు రేప‌టి (18వ తేదీ) నుంచి రెండు రోజుల వ‌ర్క్‌షాప్‌ను నిర్వ‌హించనున్నాయి. వెబ్‌నార్ ద్వారా నిర్వ‌హించ‌నున్న ఈ వ‌ర్క్‌షాప్‌లో కేంద్ర‌
సిబ్బంది, పీజీ, పించన్ల‌ శాఖ‌ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభ ప్రసంగం చేయ‌నున్నారు. ఈ నెల‌ 18-19 తేదీల్లో జ‌ర‌గ‌నున్న ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ స్టాఫ్, శ్రీలంక ఆర్మీ మేజర్ జనరల్ హెచ్‌జేఎస్ గుణ‌వ‌ర్థ‌న‌, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన సీనియర్ కార్యదర్శులు, భూటాన్, కెన్యా, మొరాకో, మయన్మార్, నేపాల్, ఒమన్, సోమాలియా, థాయిలాండ్, ట్యునీషియా, టోంగా, సుడాన్ మరియు ఉజ్బెకిస్తాన్  నుంచి సీనియ‌ర్ అధికారులు పాల్గొన‌నున్నారు. తొలిరోజు జరిగే ఇతర సెష‌న్ల‌లో కర్ణాటక, గుజరాత్, బీహార్లలో రాష్ట్రస్థాయి ఉత్తమ పద్ధతులు మరియు కేరళ, తెలంగాణ మరియు జమ్మూ & కాశ్మీర్లలో జిల్లా స్థాయి ఉత్తమ పద్ధతులను గురించి వివ‌రించ‌నున్నారు.  జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్య కార్యదర్శి శ్రీ జి.వి.వి.శర్మ రెండవ సెషన్‌కు అధ్యక్షత వహించనున్నారు. మాజీ క్యాబినెట్ కార్యదర్శి శ్రీ అజిత్ సేథ్ మూడవ సెషన్‌కు అధ్యక్షత వహించనున్నారు. రెండవ రోజు సెషన్లలో ఆరోగ్య రంగానికి సవాళ్లు మరియు వందే భారత్ అభియాన్లను గురించి తెలియ‌జేయ‌నున్నారు. ఈ సమావేశాలకు భారత ప్రభుత్వ మాజీ ఆరోగ్య కార్యదర్శి శ్రీమతి సుజతా రావు మరియు ఎయిర్ ఇండియా సీఎండీ శ్రీ రాజీవ్ బన్సాల్‌లు  అధ్యక్షత వహించనున్నారు. భార‌త ప్ర‌భుత్వ డీఏఆర్‌పీజీ, డీపీపీడ‌బ్ల్యూ కార్య‌ద‌ర్శి
డాక్టర్ ఛ‌త్రపతి శివాజీ ఈ వ‌ర్క్‌షాప్‌లో వీడ్కోలు ప్రసంగం చేయ‌నున్నారు. ఈ స‌మావేశాల్లో పాల్గొనే దేశాల సీనియ‌ర్ అధికారులు త‌మ వంతు భాగ‌స్వామ్యంతో చర్చలకు సహకరించనున్నారు.  భారతదేశపు సుపరిపాలన పద్ధతులను ఐటీఈసీ దేశాలకు వ్యాప్తి చేయ‌డానికి గాను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, పరిపాలనా సంస్కరణలు, ప్రజా మనోవేదనల శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌లు ఈ రెండు రోజుల వర్క్‌షాప్‌ను సంయుక్తంగా సూత్రీక‌రించాయ‌ని డీఏఆర్‌పీజీ అదనపు కార్యదర్శి మరియు జనరల్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ వి.శ్రీనివాస్ తెలిపారు.
                           

<><><>(Release ID: 1632213) Visitor Counter : 184