ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యొక్క బాధ్యతాయుతమైన మరియు మానవ – కేంద్రీకృత అభివృద్ధి మరియు వినియోగానికి మద్ధతుగా వ్యవస్థాపక సభ్యుడిగా గ్లోబర్ పార్ట్నర్ షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జి.పి.ఏ.ఐ)లో చేరిన భారతదేశం.
Posted On:
15 JUN 2020 4:59PM by PIB Hyderabad
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై గ్లోబల్ పార్ట్నర్ షిప్ (జి.పి.ఏ.ఐ లేదా జి.ఈ.ఈ-పి.ఏ.వై) ప్రారంభించేందుకు అమెరికా, బ్రిటన్, ఈ.యూ, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటరీ, జపాన్, మెక్సికో, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్ తో సహా ప్రముఖ ఆర్థిక వ్యవస్థల లీగ్ లో భారత్ చేరింది. జి.పి.ఏ.ఐ. అనేది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యొక్క బాధ్యతాయుతమైన అభివృద్ధి మరియు వినియోగానికి మార్గనిర్దేశం చేసే ఒక అంతర్జాతీయ మరియు బహుళ-వాటాదారుల చొరవ, ఇది మానవ హక్కులు, చేరిక, వైవిధ్యం, ఆవిష్కరణ మరియు ఆర్థిక వృద్ధిపై ఆధారపడింది. పాల్గొనే దేశాల అనుభవం మరియు వైవిధ్యాన్ని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చుట్టూ ఉన్న సవాళ్ళు మరియు అవకాశాల గురించి బాగా అర్థం చేసుకోవడానికి ఇది ఈ దిశగా మొదటి ప్రయత్నం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ – సంబంధిత ప్రాధాన్యతలపై అత్యాధునిక పరిశోధన మరియు అనువర్తిత కార్యకలాపాలకు మద్ధతు ఇవ్వడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై సిద్ధాంత మరియు అభ్యాసం మధ్య అంతరాన్ని తగ్గించడానికి చొరవ ఇందులో భాగంగా ఉంది.
భాగస్వాములు మరియు అంతర్జాతీయ సంస్థల సహకారంతో, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యొక్క బాధ్యతాయుతమైన పరిణామాన్ని ప్రోత్సహించేందుకు జి.పి.ఏ.ఐ. పరిశ్రమ, పౌర సమాజం, ప్రభుత్వాలు మరియు అకాడమిక్ కు చెందిన ప్రముఖ నిపుణులను ఒకే వేదిక మీదకు తీసుకు వస్తుంది. అదే విధంగా ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ -19 సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మెరుగైన ప్రతిస్పందన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పరపతి పొందగలదో చూపించేందుకు పద్ధతులను కూడా రూపొందిస్తుంది.
భారతదేశం ఇటీవలే జాతీయ ఎ.ఐ.స్ట్రాటజీ మరియు జాతీయ ఏ.ఐ. పోర్టల్ ను ప్రారంభించింది. అదే విధంగా విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఈ-కామర్స్, ఫైనాన్స్, టెలి కమ్యూనికేషన్స్ వంటి వివిధ రంగాల్లో ఏ.ఐ.ని అభివృద్ధి దిశగా నడిపించటం ప్రారంభించింది. వృద్ధి మరియు అభివృద్ధిని భర్తీ చేయడం ద్వారా విధానానికి సంబంధించిన వ్యవస్థాపక సభ్యునిగా జి.పి.ఏ.ఐ.లో చేరటం ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యొక్క అభివృద్ధిలో ప్రపంచంతో పాటు భారతదేశం చురుగ్గా పాల్గొనటంతో పాటు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా దాని అనుభవాన్ని మరింత పెంచుతుంది.
పారిస్ లోని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓ,ఈ.సి.డి), అదే విధంగా మాంట్రియల్ మరియు పారిస్ లలో ఒక్కొక్కటి చొప్పున రెండు కేంద్రాల నిపుణులచే నిర్వహించబడే ఒక కార్యనిర్వాహక సచివాలయం ద్వారా జి.పి.ఏ.ఐ.కి మద్ధతు అందిస్తుంది.
****
(Release ID: 1631879)
Visitor Counter : 269