ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పై తాజా సమాచారం
ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల పెంపు కోసం ప్రైవేటు రంగాలతో నిమగ్నమవ్వాలనీ, క్లిష్టమైన సంరక్షణను సరసమైన ధరలకు అందించాలనీ రాష్ట్రాలను కోరిన - కేంద్రం
Posted On:
15 JUN 2020 8:44PM by PIB Hyderabad
కోవిడ్-19 రోగుల నిర్వహణ కోసం ఐ.సి.యు. పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యంతో ఉన్న పడకలు కలిగిన ఆసుపత్రులతో సహా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కొరతను సూచిస్తూ అనేక నివేదికలు అందుతున్నాయి. కోవిడ్-19 చికిత్స కోసం ఆరోగ్య పరిరక్షణ సేవలు అందిస్తున్న సంస్థలు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, పెద్ద సంఖ్యలో పడకల లభ్యత, క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను సులభతరం చేయడానికి, అందించిన సేవలకు సరసమైన మరియు పారదర్శక ఛార్జీలను నిర్ధారించడానికి ప్రైవేట్ ఆరోగ్య సేవలందించే సంస్థలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ విషయంలో, కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నాయి. ఆసుపత్రుల్లో ఇన్-పేషేంట్ గా చేరిన రోగులకు క్లిష్టమైన సంరక్షణను అందించి, సరసమైన చార్జీలను వసూలు చేసే విధంగా ఏర్పాట్లపై ఆ రాష్ట్రాలు ప్రైవేటు రంగంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
పి.ఎమ్.జి.ఏ.వై. ప్యాకేజీ వివరాలు ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
https://pmjay.gov.in
సి.జి.హెచ్.ఎస్. ప్యాకేజీ రేట్లు ఇప్పటికే రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయి
https://cghs.gov.in/indexl.php?lang=1&level=1&sublinkid=6760&lid=3704).
తరువాతి రేట్లు ప్రాంతాల వారీగా నిర్ణయించడం జరిగింది.
రోగులకు వేగవంతమైన, మంచి నాణ్యతతో కూడిన సంరక్షణను సహేతుకమైన రేట్లతో అందించే విధంగా నిర్ధారించడానికి, స్థానిక ప్రయివేటు ఆరోగ్య సంరక్షణ సంస్థలతో సంప్రదింపులు జరపాలనీ, సహేతుకమైన రేట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించబడింది, అదే సమయంలో ఆరోగ్య సంరక్షణ లో నిమగ్నమయ్యే సిబ్బందికి వ్యక్తిగత భద్రతా పరికరాల కోసం చేసే ఖర్చును కూడా పరిగణలోకి తీసుకోవాలి. రేట్లు, ఒకసారి నిర్ణయించిన అనంతరం, వాటికి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. తద్వారా రోగికి మరియు సేవలందించేవారికి ఈ సమాచారంపై పూర్తి అవగాహన ఉన్నట్లయితే, అక్కడ అందుబాటులో ఉండే సౌకర్యాలను, సామర్థ్యాలను ఉత్తమంగా ఉపయోగించుకోడానికి అవకాశం ఉంటుంది. కోవిడ్-19 రోగులకు సత్వర, మంచి నాణ్యత మరియు సహేతుకమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఈ విధానం సహాయపడుతుంది. అందువల్ల, ప్రయివేటు రంగంలో ఆరోగ్య సేవలందించే సంస్థలు ఈ విధానంలో చురుకుగా పాల్గొనాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ మరియు ప్రయివేటు రంగాల్లో అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
*****
(Release ID: 1631847)
Visitor Counter : 234