ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్స్
రెమ్‌డెసివిర్ గురించి
కోవిడ్ -19 ప్రోటోకాల్ క్లినికల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెమ్‌డెసివిర్ వాడకం గురించి,దేశంలో దాని అందుబాటుగురించి
కొన్ని మీడియా సంస్థలలో వార్తలు వచ్చాయి.
Posted On:
14 JUN 2020 3:39PM by PIB Hyderabad
కోవిడ్-19 కు సంబంధించి తాజా క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్స్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 2020 జూన్ 13న జారీ చేసింది. ఇందులో రెమ్‌డెసివిర్‌ను ఇన్వెస్టిగేషనల్ థెరపి కింద , వివిధ పరిమితులతో అత్యవసర పరిస్థితులలో , టొసిలిజుమాబ్, కన్వల్సెంట్ ప్లాస్మాతోపాటు ఆఫ్ లేబుల్ ఉపయోగానికి దీనిని చేర్చడం జరిగింది. ఈ చికిత్సల ఉపయోగం పరిమిత ఫలితాలు, ప్రస్తుతం పరిమిత అందుబాటు ఆధారంగా ఈ థెరపీల ఉపయోగం ఉన్నట్టు ఆ ప్రొటోకాల్‌లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రెమ్‌డెసివిర్ ను అత్యవసర పరిస్థితులలో వాడకానికి పరిశీలించవచ్చు. ఆక్సిజన్ ఉపయోగిస్తున్న స్థితిలొ ఉన్నపేషెంట్లకు, ప్రత్యేక విరుద్ధ లక్షణాలు ఏవీ లేనప్పుడు , ఒక మాదిరి స్థాయిలో అనారోగ్యం ఉన్నప్పుడు దీనిని వాడడాన్నిపరిశీలించవచ్చు.
ఈ మందును ఇప్పటికీ అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(మార్కెట్ ఆథరైజేషన్‌కు) ఆమోదించలేదు. ఇండియా వంటి చోట అత్యవసర పరిస్థితులలో దీనిని కొనసాగిస్తున్నారు.
మన దేశంలో కోవిడ్ -19 నిర్ధారిత పెద్దలు లేదా పిల్లలకు , కోవిడ్ అనుమానిత కేసులకు , లేదా లేబరెటరీలో నిర్దారించిన కేసుల విషయంలో తగిన ఆంక్షలతో అత్యవసర మందుల వినియోగానికి సంబంధించి కింది షరతులు పాటించాల్సి ఉంటుంది. ఈ మందుల వినియోగం విషయంలో ప్రతి పేషెంటుకు సమాచారం ఇచ్చి వారి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అదనపు క్లినికల్ ప్రయోగాల పరీక్షల ఫలితాలను ప్రభుత్వానికి సమర్పించాలి. చికిత్స పొందిన పేషెంట్ల యాక్టివ్ సర్వైలెన్స్ సమాచారాన్ని సమర్పించాలి. రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్, దానితోపాటు యాక్టివ్ పోస్ట్ మార్కెటింగ్ సర్వైలెన్స్, తీవ్ర ప్రతికూలతలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన సమాచారం కూడా సమర్పించాలి. దీనికితోడు మొదటి మూడు బ్యాచ్‌ల దిగుమతి అయిన సరకు కు సంబంధించి పరీక్ష నివేదికను సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు సమర్పించాలి( సిడిఎస్‌సిఒ).
మెస్సర్స్ గిలీడ్ సంస్థ , ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ-సిడిఎస్‌సిఒకు , రెమ్‌డెసివిర్ దిగుమతి, మార్కెటింగ్‌కు 2020 మే 29 న దరఖాస్తు చేసింది. ఈ అంశంపై తగిన పరిశీలన అనంతరం ఈ మందు అత్యవసర వినియోగానికి 2020 జూన్ 1న అనుమతి మంజూరు చేయడం జరిగింది. పేషెంట్ భద్రత, మరింత సమాచార సేకరణ లక్ష్యంతో దీనికి అనుమతివ్వడం జరిగింది.
ఆరు భారతీయ కంపెనీలు, మెస్సర్స్ హెటిరో, మెస్సర్స్ సిప్లా, మెస్సర్స్ బిడిఆర్, మెస్సర్స్ జుబిలియంట్, మెస్సర్స్ మిలాన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కూడా ఈ మందు భారత్‌లో తయారీ , మార్కెట్ కోసం సిడిఎస్‌సిఒకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ ఐదు కంపెనీలు మెస్సర్స్ గిలీడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ దరఖాస్తులను సిడిఎస్‌సిఒ ప్రాధాన్యతా ప్రాతిపదికన, సంబంధిత చట్టాలు , విధి విధానాలకు అనుగుణంగా పరిశీలిస్తోంది. ఈ కంపెనీల తయారీ సదుపాయాల పరిశీలన మధ్యంతర దశలో ఉంది. ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం సమాచార పరిశీలన, స్టెబిలిటీ టెస్టింగ్, ఎమర్జెన్సీ లేబరెటరీ టెస్టింగ్ జరుగుతోంది. ఇది ఇంజెక్షన్ రూపంలో వాడేది కావడంతో దాని నాణ్యత, ఉనికి, వ్యర్థాలు, బాక్టీరియల్ ఎండోటాక్సిన్ పరీక్ష, స్టెరిలిటీ వంటివాటిని పేషెంట్ భద్రత దృష్ట్యా అత్యంత జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతుంది. అందువల్ల ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీలు అందజేయవలసి ఉంటుంది. సిడిఎస్‌సిఒ ఇందుకు సంబంధించిన సమాచారం కోసం ఎదురుచూస్తోంది. ఇందుకు సంబంధించి అవసరమైన మద్దతును ఆయా కంపెనీలకు ఇస్తోంది. అత్యవసర నిబంధనలను ఉపయోగించి, ఈ కంపెనీలకు లోకల్ క్లినికల్ ట్రయల్స్ నుంచి ఇప్పటికే మినహాయింపు ఇచ్చారు. రెగ్యులేటరీ ప్రక్రియలను వేగవంతం చేసేందుకు సిడిఎస్‌సిఒ తగిన ఏర్పాట్లు చేసింది.
(Release ID: 1631536)
Visitor Counter : 286