రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
కనిష్ట మద్ధతు ధరలు తగ్గవచ్చని తాను చెప్పినట్లుగా వచ్చిన వార్తలను పూర్తిగా ఖండించిన శ్రీ నితిన్ గడ్కరీ
- ఇలాంటి పూర్తిగా తప్పుడు వార్తలని నిరాధారమైనవని పేర్కొన్న మంత్రి
- పంటల ప్రత్యామ్నాయ వినియోగాన్ని కనుగొనడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే మార్గాలను చూడటం ద్వారా వారికి మంచి రాబడి లభించగలదని పేర్కొన్న శ్రీ నితన్ గడ్కరీ
Posted On:
13 JUN 2020 4:59PM by PIB Hyderabad
పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పీ) తగ్గవచ్చని తాను చేప్పినట్టుగా వస్తున్న వార్తలను కేంద్ర రహదారి రవాణా మరియు జాతీయ రహదారులు, ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఖండించారు. ఈ విషయానికి సంబంధించి ఒక విభాగం మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా తప్పుడు వార్తలని, అవి నిరాధారమైనవని మంత్రి తెలిపారు. ఎంఎస్‌పీ తగ్గే అవకాశం ఉందని తాను వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధమని కూడా పేర్కొన్నాడు. ఈ అంశంపై శ్రీ గడ్కరీ ఒక ప్రకటన చేస్తూ.. రైతుల ఆదాయాన్ని పెంచే విషయంలో తాను అన్ని వేళల అన్నదాతల పక్షానే నిలుస్తానని ఆయన అన్నారు. వరి , గోధుమ, చెరకు వంటి పంటలను పలు ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించే విషయమై తాను రైతుల పక్షాల వాదిస్తుంటానని ఆయన తెలిపారు. పంటల ఎంఎస్‌పీ పెరుగుదల ప్రకటించినప్పుడు తాను కూడా ఆ సమావేశానికి హాజరయ్యానని మంత్రి గడ్కరీ నొక్కిచెప్పారు. ఎంఎస్‌పీ తగ్గింపు విషయమై బాసటగా నిలబడటం ప్రశ్నే లేదు అని ఆయన పేర్కొన్నారు. రైతులకు మెరుగైన పంట ఆదాయాన్ని అందించే విషయమైన ఎల్లప్పుడూ భారత ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మంత్రి అన్నారు. ఇదే స్ఫూర్తితో ఎంఎస్‌పీని పెంచామని ఆయన తెలిపారు. దేశంలో రైతులకు మేటి ధరలను అందించడానికి పంట పద్ధతిలో మార్పులను అన్వేషించాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఉదాహరణకు, వంట నూనెల ఉత్పత్తి పెరిగిలే తగిన చర్యలు తీసుకుంటే మేలని ఆయన అన్నారు. ఎందుకంటే భారతదేశం వంట నూనెల దిగుమతి కోసం సుమారు 90000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు. ఈ పంటలను మనమే పండించుకోవడం వల్ల దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గడంతో పాటుగా రైతుకు మెరుగైన ఆదాయం లభించగలదని ఆయన వివరించారు. అదే విధంగా, బియ్యం / వరి / గోధుమ / మొక్కజొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడం వల్ల రైతుకు మెరుగైన రాబడి లభించడమే కాకుండా దిగుమతి చమురు బిల్లు కూడా ఆదా అవుతుందన్నారు. అంతేకాకుండా, ఈ జీవ ఇంధనాలు ఎంతో పర్యావరణ అనుకూలమైనవని కూడా శ్రీ గడ్కరీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
***
(Release ID: 1631401)
Visitor Counter : 225