శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆరోగ్యసంరక్షణ సరఫరా చెయిన్‌కు సంబంధించి కీలక సరఫరాల అందుబాటు విషయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసే వెబ్ ఆధారిత ఆరోగ్యపథ్ పోర్టల్ ప్రారంభం
Posted On:
13 JUN 2020 1:45PM by PIB Hyderabad
కీలక ఆరోగ్య సంరక్షణ సరఫరాల అందుబాటు గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఉద్దేశించిన సిఎస్ఐఆర్ జాతీయ ఆరొగ్య సంరక్షణ సరఫరా చెయిన్ పోర్టల్ https://www.aarogyapath.in ఆరోగ్య పథ్‌ను 2020 జూన్ 12న ప్రారంభించారు. ఈ ఆరోగ్యపథ్ పోర్టల్, తయారీదారులు, సరఫరాదారులు, కస్టమర్లకు విస్తృత సేవలు అందిస్తుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రస్తుత జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీ సమయంలో సరఫరా చెయిన్‌లో అంతరాయం ఉన్నచోట, కీలక వస్తువుల ఉత్పత్తిసామర్ధ్యం, వాటిని చేరవేయడం పలు కారణాలవల్ల సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి స్థితిలో ఆరోగ్యపథ్ సమాచార ప్లాట్‌ఫాం బాగా ఉపకరిస్తుంది. ఆరోగ్యకరమైన జీవన మార్గానికి దారి చూపడం దీని దార్శనికత. ఆరోగ్యసంరక్షణకు సంబంధించిన సవాళ్ళను ఎదుర్కొనేందుకు దీనిని రూపొందించారు.
ఈ సమీకృత పబ్లిక్ ప్లాట్‌ఫాం ,కీలక ఆరోగ్య సంరక్షణ వస్తువుల అందుబాటును ఒకే చోట తెలియజేస్తుంది. ఇది కస్టమర్లు సాధారణంగా ఎదుర్కొనే పలు సమస్యలకు పరిష్కారంగా ఉపకరిస్తుంది. పరిమిత సరఫరాలపై ఆధారపడాల్సిరావడం , మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తుల ఎంపికకు ఎక్కువ సమయం పట్టడం, సహేతుక ధరలో తగిన ప్రమాణాలు కలిగిన ఉత్పత్తులను ఎవరు సరఫరాచేస్తారన్నసమాచారం పరిమితంగా అందుబాటులో ఉండడం, కొత్తగా ఆవిష్కరించిన ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలకు ఇది సరైన పరిష్కారంగా పనికి వస్తుంది.
పెద్దఎత్తున కస్టమర్ల నెట్ వర్క్‌ను సమర్ధంగా చేరుకోవడానికి , తయారీదారులు, సరఫరాదారులకు ఎంతగానో ఉపకరిస్తుంది.
అలాగే సమీపంలోనే బాగా డిమాండ్ గల కేంద్రాలైన, పాథలాజికల్ లేబరెటరీలు, మెడికల్‌స్లోర్లు, ఆస్పత్రుల విషయంలో తయారీదారులు, సరఫరాదారుల మధ్య అనుసంధానంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. ఇది వ్యాపార విస్తరణకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుంది. కొనుగోలుదారుల విస్తృతి, ఉత్పత్తులను కొత్త గా కోరేవారు కనిపించడం వంటి వాటివల్ల మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. కాలక్రమంలో ఈ ప్లాట్‌ఫాంను విశ్లేషించి చూస్తే ఉత్పత్తిసామర్ధ్యం మితిమీరి ఉండడం కానీ లేదా, ఉత్పత్తుల కొరత కు సంబంధించిన విషయాలను కానీ ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడానికి వీలుకలుగుతుంది. సరైన సమాచారం లేకుండా ఎక్కువ ఉత్పత్తి చేయడం వల్ల లేదా తగిన ముందస్తు అంచనాలు లేకపోవడం వల్ల కలిగే వనరుల వృధాను అరికట్టడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానానికి గల డిమాండ్‌పై ఇది అవగాహనను కలిగిస్తుంది.
ఆరోగ్యపథ్ అనేది రాగల సంవత్సరాలలో జాతీయ ఆరోగ్య సంరక్షణ సమాచార ప్లాట్‌ఫాంగా అవతరించగలదని సిఎస్ఐఆర్ భావిస్తోంది. భారతదేశంలోచౌకగా ఆరోగ్య సంరక్షణ సరఫరాల అందుబాటు, క్షేత్రస్థాయిలో చిట్టచివరిస్థాయిలోని పేషెంట్లకు సైతం సరఫరాల అందుబాటులోకి తేవడం, ఈ క్రమంలో ఏవైనా లోపాలు ఉంటే దానిని పూరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఈ పోర్టల్‌ను సిఎస్ఐఆర్ డిజి డాక్టర్ శేఖర్ సి మందే సమక్షంలో ,ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ లోని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ శ్రీ రాజేశ్ భూషణ్ ప్రారంభించారు. ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ లో సంయుక్త కార్యదర్శి శ్రీ సుధీర్ గార్గ్, ఫార్మా రంగం నిపుణుడు డాక్టర్ విజయ్ చౌతియావాలే లు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ఈ పోర్టల్‌ను అభివృద్ది చేసినందుకు సిఎస్ఐఆర్ బృందాన్ని డాక్టర్ శేఖర్ మందే అభినందించారు. సిఎస్ఐఆర్ -ఐఐపి డైరక్టర్ డాక్టర్ అంజన్ రే నాయకత్వంలో సర్వోదయ ఇన్ఫోటెక్ భాగస్వామ్యంతో ఈ పోర్టల్‌ను అభివృద్ది చేశారు. వివిధ సంస్థలు, తయారీదారులు, అధీకృత సరఫరాదారులు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అత్యావశ్యక ఉత్పత్తుల అధీకృత సరఫరాదారులు ఈ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకునేందుకు ప్రోత్సహించడం జరుగుతుంది.
(Release ID: 1631379)
Visitor Counter : 322