పర్యటక మంత్రిత్వ శాఖ

దేఖో అప్ నా దేశ్ సిరీస్ లో భాగంగా 3వ వెబ్ నార్ ద్వారా హిమాచల్ – అరౌండ్ ద నెక్స్ట్ బెండ్ ను ప్రదర్శించిన పర్యాటక మంత్రిత్వ శాఖ.

Posted On: 12 JUN 2020 6:29PM by PIB Hyderabad

దేఖో అప్ నా దేశ్ వెబ్ సిరీస్ లో భాగంగా 2020 జూన్ 11న కెంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెబ్ నార్ సిరీస్ లో 31వ సెషన్ లో భాగంగా హిమాచల్ – అరౌండ్ ద నెక్స్ట్ బెండ్ ను ప్రదర్శిస్తూ అందమైన గ్రామాలు, పర్వతాలు, సహజ నదులు, సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రధానంగా వివరించే ప్రయత్నం చేసింది. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమం కింద భారతదేశ ఉన్నత వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు దేఖో అప్నా దేశ్ వెబ్ నార్ సిరీస్ ప్రయత్నిస్తోంది.

2020 జూన్ 11న జరిగిన దేఖో అప్ నా దేశ్ వెబ్ నార్ సిరీస్ సెషన్ ను పర్యాటక మంత్రిత్వ శాఖ అదనపు డైరక్టర్ జనరల్ శ్రీ రూపీందర్ బ్రార్ పర్యవేక్షించారు. ఫ్రాంక్ సచ్లిచ్ మాన్న్,  4 టేబుల్స్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు, అంకిత సూద్, మేనేజింగ్ హోస్ట్, సన్ షైన్ హిమాలయన్ అడ్వెంచర్స్ మరియు మైఖేల్ అండ్ దేవాన్షె లిడ్గ్లీ, హిమాలయన్ ఆర్చర్డ్ యజమానులు సమర్పించారు. ముగ్గురు సమర్పకులు గతంలో ఎప్పుడూ ఎవరూ చూడని హిమాచల్ ప్రదేశ్ కీలక ప్రదేశాలను, ప్రత్యేకమైన సాంస్కృతిక, వారసత్వ సంపదను విశదీకరించే ప్రయత్నం చేశారు.

గునేహర్ పేరుతో పిలిచే ఒక ఆసక్తి కరమైన ఆర్ట్ విలేజ్, ప్రకృతి అందాలు, ప్రవాహాలు, అటవీ ప్రాంతాలను ప్రధానంగా చూపడం ద్వారా మిస్టర్ ఫ్రాంక్ సచ్లిచ్ మాన్న్ ఈ సెషన్ ను ప్రారంభించారు. గునేహర్ కాంగ్రా జిల్లాలో ఉంది. ఈ ఆర్ట్ ప్రాజెక్ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, ఎక్కువ గ్రామంలో అధికంగా రద్దీ పెంచకుండా, అందరికీ గ్రామం గురించి, తెలుసుకుని అక్కడి సౌందర్యాన్ని ఆస్వాదించే విధంగా ఆసక్తిని పెంపొందించడం. గునేహర్ రహదారి, రైలు మరియు వాయు మార్గాల ద్వారా అనుసంధానమై ఉన్న  లోయ ప్రాంతాలు. ఇక్కడ అనేక చిన్న గ్రామాలు కలిగి ఉండటమే గాక, 3000 మంది జనాభాను కలిగి ఉన్న అతి పెద్ద పంచాయతీ. ప్రజలు ఎక్కువగా గడ్డీలు, కొంతమేర బారా భంగాలీస్. 100 ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్న ఈ గ్రామ ప్రజలు గొర్రెల కాపరులు. ఇప్పుడు వారిలో చాలా మంది రైతులు. కొంత మంది వర్తకులు, వివిధ పనులు నిర్వహిస్తున్నారు. మారుమూల ప్రాంతానికి చెందిన గ్రామస్తులే అయినప్పటికీ, వారిలో చాలా మంది గౌరవం, పరిజ్ఞానం కలిగి ఉంటారు. 2008 సంవత్సరంలో 4 టేబుల్స్ ప్రాజెక్ట్ మంచి భాగస్వామ్యంతో ప్రారంభమైంది. తర్వాత 2013లో ఆర్ట్ ఫెస్టివల్ జరిగింది. ఆర్ట్ షాప్ట్ అభివృద్ధి అయ్యాయి. కళాకారులను ఖాలీ ప్రదేశాల్లో పని చేసేందుకు ఆహ్వానించాయి, వారి కళాకృతులను అన్ని వర్గాల ప్రజలు అందిస్తారు. ఈ కార్యక్రమం మొత్తం కళాకారులు, సందర్శకులు మరియు గ్రామస్తుల భాగస్వామ్యంతో నడుస్తుంది. గ్రామస్తులు దీన్ని మేళా అని పిలుస్తారు. ఇది విజయవంతమైంది. అంతే గాక చివరి వారంలో థియేటర్, మ్యూజిక్, ఫిల్మ్ స్క్రీనింగ్ మొదలైన వాటితో ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహణ జరుగుతుంది. ఆర్ట్ ఫెస్టివల్ ముగింపు వేడుకలకు స్థానిక సాంస్కృతిక అంశాలు ప్రాతినిథ్యం వహిస్తాయి.

కులు ప్రాంతంలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్ గ్రేట్ హిమాయన్ నేషనల్ పార్క్ ను శ్రీ అంకిత్ సూద్ కళ్ళకు కట్టే ప్రయత్నం చేశారు. గ్రేట్ హిమాయన్ నేషనల్ పార్క్ సైంజ్ లోయ, జివా నల్ లోయ, తీర్థన్ వ్యాలీ మరియు పార్వతి లోయలనే నాలు లోయలతో విస్తరించింది. ఈ పార్కులో అనేక రకాల ఔషధ మూలికలు, 31 క్షీరద జాతులు, 209 పక్షి జాతులతో పాటు ఉభయచరాలు, సరీసృపాలు మరియు కీటకాలతో సహా 1000 మొక్క జాతులను సంరక్షిస్తోంది. జి.హెచ్.ఎన్.పి. యొక్క నాలు క్షీరద జాతులు మరియు దాని మూడు పక్షి జాతులు ప్రపంచ వ్యాప్తంగా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వీటిలో కస్తూరి జింక మరియు పాశ్చాత్య కొమ్ములు గల ట్రాగోపాన్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో మైఖేల్ మరియు దేవాన్షే లిడ్గ్లీ ప్రదర్శించిన మూడవ చిన్న ప్రదర్శన సిమ్లా జిల్లాలోని కోట్ఖై అనే పట్టణం గురించి.

 

·        కోట్ఖై ప్యాలెస్ 800 సంవత్సరాల చరిత్ర గలది. రాజ కుటుంబం ఇప్పటికీ ప్యాలెస్‌లోనే ఉంది.

·        రుఖ్లా గ్రామం ఆపిల్ పంటకు ఆలవాలం. రుఖ్లా నుంచి మూడు గంటల ప్రయాణం మనల్ని గ్రేటర్ హిమాలయాల యొక్క 360 డిగ్రీల దృశ్యాన్ని చూడగలిగే ఎత్తైన ప్రదేశానికి తీసుకెళుతుంది. బ్లాక్ బేర్, బార్కింగ్ డీర్, మస్క్ డీర్, లాంగూర్, చిరుతపులులు మరియు మోనాల వంటి గంభీరమైన వృక్ష మరియు జంతుజాలానికి ఈ గ్రామం ప్రసిద్ది చెందింది.

·        కియారి ఆలయం- కోట్ఖై ఆర్కిటెక్చర్ కలప మరియు రాతితో భూకంప నిరోధకతతో నిర్మించటం జరిగింది.

·        నారాయణ్ ఆలయం- అసలు శైలి ఆధారంగా పునర్నిర్మించటం జరిగింది.

·        నాగా కల్ట్- నాగ దేవతల సంతానోత్పత్తికి సబంధించిన ఓ జలాశయం కింద భాగంలో ఉన్న ప్రాచీన ప్రదేశం.  నాగ్ భూరి మాతా కుమారుడికి సంబంధించిందీ ప్రదేశం. ఆయన హిమాచల్ లో పూజించే శక్తివంతమైన దేవత. గొర్రెల బలితో పాటు, హహాదీ మాండలికంలో పాటలు పాడుతుంటారు.

·        ఆపిల్ సాగు మరింత ప్రత్యేకమైనది.

ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎం.ఈ.ఐ.టీ.వై) రూపొందించిన నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్.ఈ.జి.డి) సహకారంతో దేకో అప్ నా దేశ్ వెబ్ నార్ లను నిర్వహిస్తున్నారు.

 

వెబ్‌నార్ల సెషన్‌లు ఇప్పుడు ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్నాయి.

https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured 

 ఈ లింక్ తో పాటు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క అన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.

వెబ్ నార్ తదుపరి ఎపిసోడ్ 2020 జూన్ 13న ఉదయం 11 గంటలకు జరగనుంది. ట్రెక్కింగ్ ఇన్ ది హిమాలయాస్ – మ్యాజికల్ ఎక్స్ పీరియెన్స్ గురించి ఇది సాగనుంది. రిజిస్ట్రేషన్ కోసం https://bit.ly/HimalayasDAD  లింక్ ద్వారా సంప్రదించవచ్చు. 

 

***



(Release ID: 1631305) Visitor Counter : 190