రక్షణ మంత్రిత్వ శాఖ
తూర్పు నావికాదళానికి కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వైస్ అడ్మిరల్ బిస్వాజిత్ దాస్‌గుప్తా
Posted On:
12 JUN 2020 5:38PM by PIB Hyderabad
తూర్పు నావికాదళానికి కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వైస్ అడ్మిరల్ బిస్వాజిత్ దాస్‌గుప్తా, ఏవీస్ఎమ్, వైఎస్‌ఎం, వీఎస్‌ఎం
విశాఖపట్నంలో శుక్రవారం (12వ తేదీ) బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఈ స్థానంలో సేవలందించిన వైస్
అడ్మిరల్ ఎస్.ఎన్.ఘెర్మాడే న్యూ ఢిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖ (నేవీ) ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ నందు కంట్రోలర్
పర్సనల్ సర్వీసెస్‌కు బదిలీపై వెళ్లారు. వైస్ అడ్మిరల్ బిస్వాజిత్ దాస్‌గుప్తా నేషనల్ డిఫెన్స్ అకాడమీ యొక్క పూర్వ
విద్యార్థి. దాస్‌గుప్తా 1985 లో భారత నావికాదళంలో నియమితులయ్యారు. నావిగేషన్ మరియు డైరెక్షన్ల విభాగాంలో
ఈయన సిద్ధహస్తులు. క్షిపణి వ్యవస్థతో కూడిన ఐఎన్ఎస్ నిశాంక్, ఐఎన్ఎస్ కర్ముక్, స్టీల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ టాబర్ మరియు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్తో సహా నాలుగు ఫ్రంట్లైన్ నౌకలకూ ఆయన కమాండ్‌గా వ్యవహరించారు.
పలు హోదాల్లో మెరుగైన సేవలు..
ఇండియన్ నావల్ వర్క్ ఆఫ్ టీం (కొచ్చి) లోని ప్రధాన కార్యాలయంలో ఆపరేషనల్, ట్రైనింగ్ మరియు కమాండర్ వర్క్‌ఫోర్స్ బాధ్యతలు నిర్వహించారు. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (వెల్లింగ్టన్) లో డైరెక్టింగ్ స్టాఫ్‌గాను, నేవీ నావిగేషన్ అండ్ డైరెక్షన్ స్కూల్ ఆఫీసర్ ఇన్‌చార్జీగా వ్యవహిరించారు. వెస్ట్రన్ ఫ్లీట్ యొక్క చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ మరియు ఫ్లీట్ ఆపరేషన్ ఆఫీసర్ నావల్ అసిస్టెంట్‌గా కూడా వ్యవహరించారు. ఫ్లాగ్ ర్యాంకు పదోన్నతి పొందిన తరువాత ముంబైలోని వెస్ట్రన్ నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ నందు చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (ఆపరేషన్స్) గా నియమితులయ్యారు. 2017-18 మధ్యన విశాఖపట్నం వద్ద ప్రతిష్టాత్మక ఈస్టర్న్ ఫ్లీట్ యొక్క కమాండ్ను నిర్వహించారు. ఆ తరువాత న్యూఢిల్లిలోని ఎన్‌సీసీ ప్రధాన కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ గా కూడా ఆయన నియమితులయ్యారు. వైస్ అడ్మిరల్ హోదాలో పదోన్నతి పొందిన తరువాత మరియు విశాఖపట్నం చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు తిరిగి రాకముందు ఈయన న్యూఢిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖ (నేవీ) ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ లో కంట్రోలర్ పర్సనల్ సర్వీసెస్‌గా కూడా వ్యవహరించారు.
వివిధ పతకాలు ఆయన సొంతం..
అడ్మిరల్ బిస్వాజిత్ దాస్‌గుప్తా డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీ, బంగ్లాదేశ్, ఆర్మీ వార్ కాలేజ్, మేహావ్ మరియు న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీల గ్రాడ్యుయేట్. ఫ్లాగ్ ఆఫీసర్ విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు అతివిశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా పతకాలు అడ్మిరల్ బిస్వాజిత్ దాస్‌గుప్తా అందుకున్నారు. ఆపరేషన్ రాహత్ ఆధ్వర్యంలో 2015 లో కలహాలతో బాధపడుతున్న యెమెన్ నుండి తరలింపు కార్యకలాపాలను మేటిగా సమన్వయపరిచినందుకు గాను యుద్ధసేవా పతకాన్ని కూడా ఆయన అందుకున్నారు.
(Release ID: 1631258)
Visitor Counter : 244