వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
భారత ఆహార సంస్థకు అందుబాటులో 811.69లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద మే, జూన్ నెలల్లో 45.62 లక్షల మంది లబ్ధిదారులకు 22,812 మెట్రిక్ టన్నుల
ఆహార ధాన్యాల పంపిణీ.
2,092 మెట్రిక్ టన్నుల పప్పులు పంపిణీ చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 164కోట్ల మందికి
ఏప్రిల్ నుంచి జూన్ వరకూ 82.16లక్షల మెట్రిక్ టన్నుల
ఆహార ధాన్యాల పంపిణీ
Posted On:
12 JUN 2020 3:32PM by PIB Hyderabad
మొత్తం ఆహార ధాన్యాల నిల్వలు:
భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) 2020వ సంవత్సరం జూన్ 11న వెలువరించిన నివేదిక ప్రకారం ఎఫ్.సి.ఐ. వద్ద ప్రస్తుతం 270.89లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 540.80 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు అందుబాటులో ఉన్నాయి. అంటే,.. మొత్తం 811.69 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల అందుబాటులో ఉన్నట్టు లెక్క. (ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న, ఇంకా గిడ్డంగులకు చేరని గోధుమలు, ధాన్యం దీనికి అదనం) జాతీయ ఆహార భద్రత పథకం, తదితర సంక్షేమ పథకాల కింద ఒక నెలలో పంపిణీ చేసేందుకు దాదాపు 55లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయి.
దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఇప్పటివరకూ 117.43 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను 4194 రైల్వే ర్యాకుల ద్వారా రవాణా చేశారు. రోడ్డు రవాణా, జలమార్గాల ద్వారా కూడా ఆహార ధాన్యాలను రవాణా చేశారు. ఈ మార్గాల ద్వారా మొత్తం 245.23 లక్షల మెట్రిక్ టన్నులను రవాణా చేశారు. నౌకల ద్వారా 15,500మెట్రిక్ టన్నులు చేరవేశారు. ఈశాన్య రాష్ట్రాలకు మొత్తం 11.68లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు రవాణా అయ్యాయి.
వలస కూలీలకు ఆహార ధాన్యాల పంపిణీ (ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ)
దేశంలోని 8 కోట్ల మంది వలస కూలీలకు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీల కుటుంబాలకు, జాతీయ ఆహార భద్రతా పథకం, రాష్ట్రాల ప్రజా పంపిణీ పథకాల పరిధిలోకి రాని వారికి మొత్తం 8లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద పంపిణీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు,.. మే, జూన్ నెలలకు గానూ వలస కూలీలందరికీ తలా 5కేజీల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 5.48లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తీసుకుని,.. మొత్తం 45.62లక్షల మంది లబ్ధిదారులకు 22,812మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశాయి. (మే నెలలో 35.32లక్షల మందికి, జూన్ నెలలో 10.30 లక్షల మందికి పంపిణీ చేశారు.) కోటీ 96లక్షల వలస కుటుంబాలకు, 8కోట్లమంది వలస కూలీలకు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కుటుంబాలకు 39వేల మెట్రిక్ టన్నల పప్పు ధాన్యాల పంపిణీకి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీరెవరూ, జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి గానీ, ప్రజా పంపిణీ పథకం పరిధిలోకి గానీ రారు. వీరికి మే, జూన్ నెలలకు గాను కుటుంబానికి కేజీ చొప్పున పప్పులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల అవసరాన్ని బట్టి పప్పుల కేటాయింపు జరిగింది.
దాదాపు 33,916 మెట్రిక్ ట్నుల పప్పులను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించారు. మొత్తం 23,733 మెట్రిక్ టన్నుల కందిపప్పును వివిధ రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. 2,092 మెట్రిక్ టన్నుల పప్పులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పంపిణీ చేశాయి. ఆహార ధాన్యాలు, పప్పుల పంపిణీకి సంబంధించి వందశాతం ఆర్థిక భారాన్ని భారత ప్రభుత్వమే భరిస్తోంది. దాదాపు 3,109కోట్ల రూపాయల ఆహార ధాన్యాలను, 280 కోట్ల రూపాయల పప్పులను ఈ పథకం కింద భారత ప్రభుత్వం ఖర్చు చేసింది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (ఆహార ధాన్యాలు-బియ్యం,గోధుమలు)
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పంపిణీకోసం ఏప్రిల్ నుంచి జూన్ వరకూ 3 నెలలకు మొత్తం 104.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 15.2 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు అవసరమవుతాయి. ఇందులో 94.71లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 14.20లక్షల టన్నుల గోధుమలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. మొత్తంగా 108.91 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నాయి. ఏప్రిల్ నెలలో 37 లక్షల మెట్రిక్ టన్నులు (అంటే 92శాతం) ఆహార ధాన్యాలను 74కోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మే నెలలో మొత్తం 35.82 లక్షల మెట్రిక్ టన్నులు (అంటే 90శాతం) ఆహార ధాన్యాలను 71.64కోట్ల లబ్ధిదారులకు పంపిణీచేశారు. ఇక జూన్ నెలలో 9.34 లక్షల మెట్రిక్ టన్నులు (అంటే 23శాతం) ఆహార ధాన్యాలను 18.68 కోట్లమంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ పథకం కింద వందశాతం ఆర్థిక భారాన్ని భారతప్రభుత్వమే భరిస్తోంది. దాదాపు 46వేల కోట్ల రూపాయల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, చండీగఢ్, ఢిల్లీ, గుజరాత్ వంటి ఆరు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గోధుమలు కేటాయించారు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పంపిణీకి బియ్యం అందజేశారు.
పప్పులు
మూడు నెలలకు గాను మొత్తం 5.87లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు అవసరమవుతాయి. వీటి పంపిణీకి కూాడా భారత ప్రభుత్వం వందశాతం ఆర్థిక భారాన్ని భరిస్తోంది. ఈ పథకం కింద దాదాపు 5వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తోంది. ఇప్పటివరకూ 5.50లక్షల మెట్రిక్ టన్నుల పప్పులను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించారు. వాటిలో 4.91లక్షల మెట్రిక్ టన్నుల పప్పులు రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు చేరాయి. వాటిలో,..3.06లక్షల మెట్రిక్ టన్నుల పప్పులను ఇప్పటికే పంపిణీ చేశారు. ఇక 2020 జూన్ 10నాటికి మొత్తం 11.87లక్షల మెట్రక్ టన్నుల పప్పుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. (ఇందులో 6.12లక్షల మెట్రిక్ టన్నుల కంది పప్పు, 1.60లక్షల మెట్రిక్ టన్నుల పెసరపప్పు, 2.38లక్షల మెట్రిక్ టన్నుల ఉద్దిపప్పు, 1.30లక్షల మెట్రిక్ టన్నుల శనగపప్పు, 0.47లక్షల మెట్రిక్ టన్నుల ఎర్ర కందిపప్పు ఉన్నాయి)
ఆహార ధాన్యాల సేకరణ
2020సంవత్సరం జూన్ 11నాటికి మొత్తం 376.58లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 734.58 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించారు.
బహిరంగ మార్కెట్ అమ్మకాల పథకం (OMSS):
బహిరంగ మార్కెట్ అమ్మకాల పథకం కింద కిలోగ్రాము బియ్యం ధరను 22రూపాయలుగా, కిలోగ్రాము గోధుమల ధరను 21 రూపాయలుగా ఖరారు చేశారు. బహిరంగ మార్కెట్ పథకం ద్వారా భారత ఆహార సంస్థ లాక్ డౌన్ సమయంలో 5.57 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను, 8.90లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విక్రయించింది.
(Release ID: 1631235)
Visitor Counter : 303