నౌకారవాణా మంత్రిత్వ శాఖ
అండమాన్ & నికోబార్ దీవులలో నౌకల మరమ్మతు సౌకర్యాలను పెంచడానికి సవరించిన వ్యయ అంచనాలకు ఆమోదం తెలిపిన షిప్పింగ్ మంత్రిత్వ శాఖ
Posted On:
12 JUN 2020 11:17AM by PIB Hyderabad
అండమాన్ & నికోబార్ దీవులలో ఓడ మరమ్మతు సౌకర్యాల పెంపునకు రూ.123.95 కోట్ల సవరించిన వ్యయ అంచనాకు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తన ఆమోదం తెలిపింది. అండమాన్ & నికోబార్ దీవులకు
షిప్పింగ్ కార్యకలాపాలు జీవనాధారంగా ఉన్నాయి, ఎందుకంటే అభివృద్ధి కార్యకలాపాలలో ఎక్కువ భాగం దానితో ముడిపడి ఉంటుంది. షిప్పింగ్ కార్యకలాపాలను ఎటువంటి అంతరాయాలకు తావు లేకుండా నిరంతరాయంగా ఉంచడానికి, ఓడ మరమ్మతు సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రాంతంలో గణనీయంగా పెరిగిన ఓడ కదలికల కారణంగా, పోర్ట్ బ్లెయిర్‌లో ప్రస్తుతం ఉన్న మరమ్మతు సౌకర్యాలను షిప్పింగ్ మంత్రిత్వ శాఖ పెంపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న డాక్ పొడవు 90 మీటర్లు విస్తరించనున్నారు. ఈ పెరుగుదల ఓడ నిర్మాణం మరియు ఓడ మరమ్మతు పరిశ్రమల విస్తరణకు దోహదం చేసి భారత ప్రభుత్వం యొక్క ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవను మరింతగా సులభతరం చేయనుంది. పోర్ట్ బ్లెయిర్, సౌత్ అండమాన్‌లో డ్రై డాక్ పంపులు మరియు ఉపకరణాల సరఫరా, సంస్థాపన మరియు ప్రారంభంతో సహా మెరైన్ డాక్‌యార్డ్‌లో డ్రై డాక్ -2 విస్తరణ ప్రాజెక్టునకు
కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. కేంద్ర రంగాల పథకం కింద షిప్పింగ్ మంత్రిత్వ శాఖ దీనిని మంజూరు చేసింది. రూ.96.24 కోట్ల అంచనా వ్యయంతో 2016 ఫిబ్రవరిలో.. ఈ ప్రాజెక్టును కేంద్రం 42 నెలల కాలావధితో మంజూరు చేసింది. ఈప్రాజెక్టులో భాగంగా ఎక్కువ మరియు పెద్ద ఓడలను ఉంచడానికి వీలుగా ప్రస్తుత డాక్‌ను 90 మీటర్ల పొడవు వరకు విస్తరించనున్నారు. పోర్ట్ బ్లెయిర్ వద్ద ఉన్న ఓడ మరమ్మతు సౌకర్యాల సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం మరియు ద్వీపవాసుల ఆదాయాన్ని పెంచడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలలో ఒకటి. ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే అవార్డ్ చేయడమైంది. సైట్‌లో ప్రాథమిక పనులు 07.03.2017 న ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులో కొన్ని సాంకేతిక మార్పుల కారణంగా, అంచనా ఖర్చు మరియు సమయం పెరిగిపోయింది. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తాజాగా ఇప్పుడు సవరించిన రూ. 123.95 కోట్ల వ్యయ అంచనాకు ఆమోదం తెలిపింది. డ్రై డాక్ యొక్క పొడిగింపు సౌకర్యం ఆగస్టు, 2021 నాటికి అండమాన్ & నికోబార్‌లో షిప్పింగ్ పరిశ్రమకు అందుబాటులోకి రానుంది.
(Release ID: 1631152)