శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19ను సమగ్రంగా ఎదుర్కొనేందుకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి) ఆధారిత వాడిన మాస్క్ డిస్పోజల్ స్మార్ట్ బిన్ మరియు యువి లైట్ బేస్డ్ క్రిమి సంహారక పరికరాన్ని ప్రారంభించేందుకు ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి.తో కలిసి పని చేయనున్న కేరళ.

Posted On: 11 JUN 2020 4:04PM by PIB Hyderabad

కొచ్చిన్ ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న అంకుర సంస్థ వి.ఎస్.టి. మొబిలిటీ సొల్యూషన్స్, కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు సహాయపడే ఉత్పత్తులను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఆటోమేటెడ్ మాస్క్ డిస్పోజల్ మెషిన్ ను ప్రారంభించింది. బిన్ -19 గా పిలిచే ఈ డిస్పోజల్ పరికరాన్ని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ నుంచి జాతీయ ప్రాధాన్యత కలిగిన శ్రీ చిత్ర తిరునాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి), త్రివేండ్రం నుంచి చిత్ర యువి ఆధారిత ఫేస్ మాస్క్ డిస్బోజల్ బిన్ టెక్నాలజీని వినియోగించుకుని అభివృద్ధి చేసింది. తొలి ప్రయత్నంగా ఎర్నాకులం జిల్లా కలెక్టర్ ఎస్. సుహాస్ చేత అధికారికంగా జిల్లా పరిపాలన కేంద్రమైన వారి కార్యాలయంలో ఒక యూనిట్ ను ఏర్పాటు చేశారు.

బిన్ -19 గా పిలిచే ఐఓటి (ఇంటర్నెంట్ ఆఫ్ థింగ్స్) ఆధారిత ఈ పరికరం వినియోగించిన ఫేస్ మాస్క్ లను సేకరించేందుకు అదే విధంగా, నాశనం చేసేందుకు వినియోగించటం జరుగుతుంది. శ్రీ చిత్ర ల్యాబ్ ద్వారా మైక్రోబయోలాజికల్ పరీక్షలు నిర్వహించబడి విజయవంతమైన వాటిలో ఈ పరికరం కూడా ఒకటి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్) మార్గదర్శకాల ప్రకారం దేశంలో యు.వి. ఆధారిత పరికరాల పరీక్షా సంస్థల్లో శ్రీ చిత్ర ఒకటి.

కేరళలో బిన్ -19, యవి స్పాట్ తో ఇలాంటి సదుపాయం లభించటం ఇదే మొదటి సారి అని జిల్లా కలెక్టర్ ఎస్. సుహాస్ తెలిపారు. ఈ ఉత్పత్తులు రాష్ట్రంలో కోవిడ్ -19ను ఎదుర్కొవటంలో కీలక పాత్ర పోషించటమే గాక, పర్యావరణ సమస్యలను తొలగించేందుకు కూడా ఈ ఉత్పత్తులు సహాయపడతాయని తెలిపారు.

వి.ఎస్.టి. వారిచో యు.వి.-బిన్ మరియు బహుళార్ధసాధక క్రిమి సంహారక వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించినందుకు డి.ఎస్.టి. మరియు ఇనిస్టిట్యూట్ సంతోషాన్ని వ్యక్తం చేశాయి. కార్యాలయాలు, గృహాలు మరియు ఇతర బహిరంగా ప్రదేశాల్లో చాలా ఉపయోగకరంగా ఉండే ఈ సాంకేతిక పరిజ్ఞానం మరియు నమూనాను ఈ పరికరాల్లోకి మార్చినందుకు బృందాన్ని అభినందిస్తున్నట్లు తెలిపిన ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. డైరక్టర్ డాక్టర్ ఆశా కిశోర్, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేయటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.  

బిన్ -19 పని తీరును వివరించిన వి.ఎస్.. మొబిలిటీ సొల్యూషన్స్ సి.ఈ.ఓ, శ్రీ ఆల్విన్ జార్జ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉపయోగించిన మాస్క్ లను ఈ బిన్ లోపల కంటైనర్ పడేయడం ద్వారా మొదట క్రిమి సంహారకం అవుతుందని తెలిపారు. క్రిమి సంహారకం చేసిన మాస్క్ లు బిన్ లోపల ఉన్న మరో కంటైనర్ లోకి వెళతాయి. మాస్క్ ను వదిలి వేసే బిన్ -19 కు అనుసంధానించబడిన ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్ సహాయంతో చేతులను కూడా శుభ్రపరచుకోవచ్చు. ఇవి చేసేందుకు బిన్ లో ఎలాంటి స్విచ్ లను తాకటం లేదా ఆపరేట్ చేయవలసిన అవసరం లేదు. వినియోగదారులు మరియు ఆరోగ్య కార్యకర్తల భద్రత కోసం అన్ని విధులు ఆటోమెటిక్ గా హ్యాండ్ ఫ్రీ విధానంలో జరుగుతుంది.

ఆటో శానిటైజర్ డిస్పెన్సర్ (ఇది ఖాళీగా ఉంటే ఎప్పటికప్పుడు హెచ్చరికలు) నావిగేట్ చేయడానికి / కనుగొనడానికి మొబలై అప్లికేషన్ అదే విధంగా బిన్ -19 స్థితి హెచ్చరికల కోసం, పవర్ ఆన్ / ఆఫ్ హెచ్చరికలు, బాక్స్ ఓపెన్ హెచ్చరికల కోసం వెబ్ పోర్టల్ బిన్ -19 యొక్క ఐ.ఓ.టి. లక్షణాలు.

వి.ఎస్.ఎల్. మొబిలిటీ సొల్యూషన్స్, యువి స్పాట్, యువి లైట్ – బేస్డ్ మల్టీ పర్పస్ క్రిమి సంహారకాలతో కోవిడ్ -19 కంబాట్ పోర్ట్ ఫోలియోలో మరొక ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది అతినీల లోహిత క్రిమి సంహారక లైట్లతో బహుళార్థ సాధక క్రిమి సంహారక పరికరం. వి.ఎస్.టి. మొబిలిటి సొల్యూషన్స్ అంతర్గత ప్రతిబింబ ఉపరితలాలు మరియు యు.వి.సి. లైట్లతో ఈ పరికరం సూక్ష్మ జీవులను చంపి, క్రిమి రహితం చేస్తుంది.

ఈ పరికరం ప్రధానంగా కలుషితమైన లేదా ఉపయోగించిన ఫేస్ మాస్క్ లను పారవేసేందుకు మరియు యు.వి.సి. స్థిరమైన లోహ ఉత్పత్తులను తిరిగి వినియోగించేందుకు ఉపయోగిస్తారు. ఈ పరికరం శ్రీ చిత్ర ల్యాబ్ నిర్వహించిన మైక్రో బయాలాజికల్ పరీక్షలో విజయం సాధించింది.

 

Description: Bin19 by SCTIMST Description: UVSPOT by SCTIMST

(మరిన్ని వివరాల కోసం, దయచేసి సంప్రదించండి: శ్రీమతి స్వప్న వామదేవన్, పి.ఆర్.ఓ, ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి, మొబైల్: 9656815943, ఈ-మెయిల్: pro@sctimst.ac.in)



(Release ID: 1630954) Visitor Counter : 208