రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

పరిశోధన, పరీక్షల నిర్వహణతోనే జాతీయ ఔషధ విద్య, పరిశోధనా సంస్థలకు

స్వావలంబన, సొంత వనరుల సృష్టి: మాండవీయ
ఔషధ ఉత్పత్తులకోసం జాతీయస్థాయి లేబరేటరీలకోసం కృషిచేయాలని సూచన
ఉత్పాదనల రూపకల్పనపైనే కాక, వాణిజ్యపరమైన అంశాలపై దృష్టి ఉండాలని సలహా
జాతీయ ఔషధ విద్య, పరిశోధనా సంస్థల డైరెక్టర్లతో సమీక్ష

Posted On: 11 JUN 2020 4:16PM by PIB Hyderabad

జాతీయ ఔషధ విద్య, పరిశోధనా సంస్థల (నైపెర్) డైరెక్టర్ల సమీక్షా సమావేశం రోజు జరిగింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మొహాళీ, రాయిబరేళీ, హాజీపూర్, గువాహటి ప్రాంతాల్లోని సంస్థల డైరెక్టర్లు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా  పాల్గొన్నారు. పరిశోధన, సృజనాత్మక కార్యకలాపాలలో జాతీయ ఔషధ విద్య, పరిశోధనా సంస్థల పనితీరుపై సందర్భంగా సమీక్ష జరిగింది. ఈ రంగాల్లో పనితీరును ప్రదర్శించేందుకు సంస్థలకు ఉన్న అవకాశాలు, కోవిడ్-19 మహమ్మారిపై దేశం పోరాటం సాగిస్తున్న తరుణంలో సంస్థలు నిర్వహించవలసిన పాత్ర తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

 

 

  సందర్భంగా మంత్రి మాండవీయ మాట్లాడుతూ,..జాతీయ ఔషధ, పరిశోధనా సంస్థలు తమ పరిశోధన, పరీక్షల నిర్వహణ కార్యకలాపాల ద్వారా సొంత వనరులు సృష్టించుకుని స్వావలంబన సాధించవచ్చని సూచించారు. ఉత్పాదనల రూపకల్పనపైన మాత్రమే కాకుండా ఉత్పాదనలకు వాణిజ్యపరంగా  ఉన్న అవకాశాలపై కూడా సంస్థలు అన్వేషణ జరపాల్సిన  అవసరం ఎంతో ఉందని మంత్రి స్పష్టం చేశారు.

 ఔషధ ఉత్పత్తులకోసం జాతీయ స్థాయి లేబరేటరీలను ఏర్పాటు చేసుకోవాలని, సంస్థల ఆదాయ సృష్టికి ఇది కీలకం కావాలని మంత్రి సూచించారు. పరీక్షలు నిర్వహించే లేబరీటరీలను వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఔషధ తయారీ కంపెనీలు, సంస్థలు జాతీయ ఔషధ, పరిశోధనా సంస్థలను ఆశ్రయించవచ్చని కేంద్రమంత్రి సూచించారు. సమీక్షా సమావేశంలో జాతీయ ఔషధ, పరిశోధనా సంస్థల ప్రతినిధులు లేవనెత్తిన పలు అంశాలపై మాండవీయ ప్రతిస్పందిస్తూ సూచనలు చేశారు.

  సమీక్షా సమావేశంలో జాతీయ ఔషధ, పరిశోధనా సంస్థల తరఫున తొలి అధ్యయన పత్రం మొహాళీకి చెందిన సంస్థ డైరెక్టర్ సమర్పించారు. పరిశోధన, ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధి రంగాల్లో, ఔషధ విద్యారంగంలో తమ సంస్థ విజయాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. తాను ఇన్ చార్జి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాయిబరేళీ సంస్థ కార్యకలాపాలను ఆయన వివరించారు. గువాహటి, హాజీపూర్ సంస్థల డైరెక్టర్లు కూడా తమ పత్రాలను సమీక్షా సమావేశంలో సమర్పించారు.

***



(Release ID: 1630929) Visitor Counter : 187