పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
భారత్‌లోకి అన్యదేశ జంతు జాతుల దిగుమతి, స్వాధీన ప్రక్రియ క్రమబద్ధీకరణకు తాజాగా అడ్వైజరీని జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
Posted On:
11 JUN 2020 2:59PM by PIB Hyderabad
అన్యదేశాల నుంచి జంతువులు లేదా మొక్కల జాతులు వాటి అసలు పరిధి (స్థానం) నుంచి కొత్త ప్రాంతాలకు తరలించబడుతాయి. తరచుగా కొత్త ప్రదేశాల వారికి ఆయా ప్రాంతాల ప్రజలు ఈ తరహా జాతుల్ని పరిచయం చేస్తూ ఉంటారు. దేశంలోని కొంత మంది పౌరులు కలిసి సీఐటీఈఎస్‌ను (అంతరించిపోతున్న జాతులలో అంతర్జాతీయ వాణిజ్య సమూహాం) ఏర్పాటు చేశారు. పలు రకాల అన్యదేశాల జంతు జాతులను కొందరు తమ ఆధీనంలో చేర్చుకున్నారు. రాష్ట్ర / కేంద్ర ప్రభుత్వాల స్థాయిలో ఇటువంటి జాతుల పెంపకం లేదా వాటిని కలిగి ఉండే విషయమై ఏకీకృత సమాచార వ్యవస్థ ఏదీ అందుబాటులో లేదు. రానున్న ఆరు నెలల్లో స్వచ్ఛందంగా బహిర్గత విధానం ద్వారా అటువంటి జంతు జాతులను కలిగి ఉన్న వారి నుండి స్టాక్ సమాచారాన్ని సేకరించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయించింది. ఈ తరహా జంతువులను కలిగి ఉండడం, కొత్త సంతానం, అలాగే దిగుమతి మరియు మార్పిడికి సంబంధించిన అంశాలను ఇకపై నమోదు చేయనున్నారు. ఇది ఆయా జాతుల మెరుగైన నిర్వహణకు సహాయపడనుంది. సరైన పశువైద్య సంరక్షణ, గృహ నిర్మాణం మరియు జాతుల శ్రేయస్సు యొక్క ఇతర అంశాలకు సంబంధించి మేటి నిర్వహణకు గాను ఆయా జంతువులను కలిగి ఉన్న వారికి తగిన మార్గనిర్దేశం చేసేందుకూ ఇది దోహదం చేయనుంది. అన్యదేశ జంతువుల సమాచారం జంతు, మానవుల భద్రతను నిర్ధారించడానికి ఈ విషయమై ఎప్పటికప్పుడు తగు మార్గదర్శకత్వం చేసేందుకు దోహదం చేస్తుంది. వాటికి జూనోటిక్ వ్యాధుల నియంత్రణ మరియు నిర్వహణలోనూ ఇది సహాయపడనుంది. అడ్వైజరీ జారీ అయిన తేదీ నుంచి ఆరు నెలలలో అన్యదేశ జంతు జాతులకు సంబంధించి స్వచ్ఛందంగా సమాచారం తెలియజేసే వారు.. ఎలాంటి ప్రతాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ఆరు నెలలు దాటిన తర్వాత చేసిన ఏదైనా డిక్లరేషన్ కోసం, డిక్లరర్ ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు మరియు నిబంధనల మేరకు అవసరానికి తగ్గట్టుగా డాక్యుమెంటేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అన్యదేశ జంతు జాతులకు సంబంధించి వాటిని కలిగి ఉన్న యజమానులు స్టాక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వెబ్‌సైట్ (www.parivesh .nic.in) ను సందర్శించి అవసరమైన ఫారాలను నింపాలి.
మరింత వివరణాత్మక సలహా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
(Release ID: 1630918)
Visitor Counter : 508