అంతరిక్ష విభాగం

అంతరిక్ష పరిశోధనల కోసం ప్రైవేటు రంగానికి దక్కనున్న అనుమతులు

గ్రహాన్వేషణ, అంతరిక్ష యాత్రల్లో భాగస్వామి కానున్న ప్రైవేటు రంగం
ఐస్రో ఆస్తులు ఉపయోగించుకునేందుకు అనుమతించనున్న కేంద్రం

Posted On: 09 JUN 2020 8:10PM by PIB Hyderabad

సామర్థ్యాలను పెంచుకోవడానికి, ఐస్రో సౌకర్యాలు, ఇతర ఆస్తులను ఉపయోగించుకునేలా ప్రైవేటు సెక్టారుకు అనుమతి ఇస్తామని కేంద్ర అణుశక్తి, అంతరిక్ష శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్‌ (స్వతంత్ర బాధ్యత) చెప్పారు. మోదీ ప్రభుత్వం 2.0 మొదటి ఏడాదిలో, అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలు అడుగు పెట్టేలా "ఆత్మనిర్భర్‌ భారత్‌" బాటలు పరిచిందన్నారు. తద్వారా, అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం కూడా భాగస్వామి కానుంది.

.    ఉపగ్రహాలు, ప్రయోగాలు, అంతరిక్ష ఆధారిత సేవలు అందించేందుకు ప్రైవేట్ సంస్థలకు కేంద్రం అనుమతి ఇవ్వబోతోంది. దీనిద్వారా గ్రహాన్వేషణ, అంతరిక్షయానం వంటివి చేపట్టడానికి ప్రైవేటు సంస్థలకు ద్వారాలు తెరుచుకుంటాయి.

    భారత్‌ తొలిసారిగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ గురించిన తాజా వివరాలను మంత్రి జితేంద్ర సింగ్‌ వివరించారు. వ్యోమగాముల ఎంపిక ముగిసిందని, రష్యాలో వారికి శిక్షణ ప్రారంభమైందని, కరోనా సంక్షోభం వల్ల అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. త్వరలోనే ప్రాజెక్టు పునఃప్రారంభమవుతుందన్నారు.

    పాఠశాల విద్యార్థుల కోసం, "యంగ్‌ సైంటిస్ట్స్‌ ప్రోగ్రామ్‌-యువిక" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్రో తీసుకొచ్చిందని మంత్రి చెప్పారు. అంతరిక్ష సాంకేతికత గురించి నవతరంలో కనీస జ్ఞానాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన వివరించారు.  

    ***


(Release ID: 1630800) Visitor Counter : 263