శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సైన్స్ & టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ (ఎస్టిఐపి) 2020 రూపొందించడానికి ప్రజా, నిపుణుల సంప్రదింపుల ‘టౌన్ హాల్ మీట్’

ఈ ప్రక్రియ 4 అత్యంత అనుసంధానించిన ట్రాక్‌ల ద్వారా నిర్వహిస్తారు, విధాన సూత్రీకరణలో సంప్రదింపుల కోసం ఇది సుమారు 15000 మంది వాటాదారులకు చేరుతుంది.

వేర్వేరు మార్గాల ద్వారా సంప్రదింపుల ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, సమాంతరంగా నడుస్తున్నాయి

పూర్తి ప్రక్రియను సమన్వయం చేయడానికి అంతర్గత విధాన పరిజ్ఞానం, డేటా సపోర్ట్ యూనిట్‌తో కూడిన సచివాలయాన్ని డిఎస్‌టి (టెక్నాలజీ భవన్) వద్ద ఏర్పాటు చేశారు.

Posted On: 10 JUN 2020 11:02AM by PIB Hyderabad

ఎస్టిఐపి 2020 టౌన్ హాల్ మీట్, సైన్స్-టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ (STIP) 2020 ను రూపొందించడానికి ట్రాక్- I ప్రజా, నిపుణుల సంప్రదింపుల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు ప్రొఫెసర్ కె విజయరాఘవన్, కార్యదర్శి, డిఎస్టి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ 2020, జూన్ 12 న ప్రారంభించనున్నారు.

ట్రాక్ I కన్సల్టేషన్ ప్రక్రియలో సైన్స్ పాలసీ ఫోరం ద్వారా విస్తృతమైన ప్రజా, నిపుణుల సంప్రదింపులు ఉంటాయి, ఈ విధానానికి కావలసిన వివరాలను అభ్యర్థించడానికి ఒక ప్రత్యేక వేదిక ఇది. ఎస్టీఐపి 2020 సెక్రటేరియట్ అధిపతి, డిఎస్టి అడ్వైజర్ డాక్టర్ అఖిలేష్ గుప్తా కూడా సంప్రదింపుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్ర సలహాదారు కార్యాలయం (పిఎస్‌ఎ కార్యాలయం), సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్‌టి) కొత్త జాతీయ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ (ఎస్‌టిఐపి 2020) ను రూపొందించడానికి సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాయి. ఈ అంశంతో సంబంధం ఉన్న వారందరితో విస్తృత శ్రేణిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. 

ట్రాక్ I లో ఆలోచనపరులు, విధాన పండితులతో సంప్రదింపులు, ప్రజా భాగస్వామ్యంతో ప్యానెల్ చర్చ, ప్రింట్ మీడియా కథనాలు, చిట్ట చివరివరకు చేరేలా కమ్యూనిటీ పాడ్‌కాస్ట్‌లు ఉంటాయి.

ఎస్టిఐపి 2020 సూత్రీకరణ ప్రక్రియ 4 అత్యంత అనుసంధానించబడిన ట్రాక్‌లు ద్వారా నిర్వహిస్తారు. ఇది విధాన సూత్రీకరణలో సంప్రదింపుల కోసం సుమారు 15000 మంది వాటాదారులకు చేరుతుంది. ట్రాక్ I సైన్స్ పాలసీ ఫోరం ద్వారా విస్తృతమైన ప్రజం నిపుణుల సంప్రదింపుల ప్రక్రియను కలిగి ఉంటుంది. ట్రాక్ II విధాన ముసాయిదా ప్రక్రియలో ఆధారాలతో సహా సమాచారం సిఫారసులను అందించడానికి నిపుణులచే నడిచే నేపథ్య సంప్రదింపులను కలిగి ఉంటుంది. ఇందుకోసం ఇరవై ఒకటి (21) ప్రత్యేక నేపథ్య సమూహాలను ఏర్పాటు చేశారు. ట్రాక్ III లో మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలతో సంప్రదింపులు ఉంటాయి, ట్రాక్ IV అత్యున్నత స్థాయి బహుళ-భాగస్వామ్యుల సంప్రదింపులను కలిగి ఉంటుంది.

 అన్ని వేదికలపైనా సంప్రదింపుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 

పూర్తి ప్రక్రియను సమన్వయం చేయడానికి అంతర్గత విధాన పరిజ్ఞానం, డేటా సపోర్ట్ యూనిట్‌తో కూడిన సచివాలయాన్ని డిఎస్‌టి (టెక్నాలజీ భవన్) వద్ద ఏర్పాటు చేశారు.

 

*****



(Release ID: 1630707) Visitor Counter : 277