గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలు సవరించిన ఎం.ఎస్.‌పి. తో ఎం.ఎఫ్.‌పి సేకరణను చేపట్టడంతో గిరిజనుల ఆదాయం పెరుగుతోంది.

Posted On: 09 JUN 2020 11:46AM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి తరువాత పేదలు మరియు అట్టడుగు వర్గాల ప్రజలుకు చేయూతగా కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నందున రాష్ట్రాల నుండి ప్రోత్సాహకరమైన  సానుకూల స్పందన లభిస్తోంది. 

 

గిరిజన ప్రజలకు సంబంధించినంతవరకు, ఆర్టికల్ 275 (I) గ్రాంట్ల కింద నిధులను సమకూర్చడం ద్వారా ఎమ్.ఎఫ్.పి. కోసం ఎమ్.ఎస్.పి. ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రణాళికలు వేయాలని, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైఫెడ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. వన్ ధన్ విలువ చేరిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా వారికి స్వల్ప వ్యవధిలో వెంటనే ఆదాయం చేకూరడంతో పాటు నిరంతర జీవనోపాధి లభిస్తుంది. 

 

ఈ సలహాకు అద్భుతమైన సానుకూల లభించింది. ఈ పథకం కింద 17 రాష్ట్రాలు సేకరణను ప్రారంభించాయి. ఇంతవరకు సుమారు 50 కోట్ల రూపాయల మేర ఎమ్.ఎఫ్.పి.లను సేకరించాయి.  ఈ ప్రయత్నాల వల్ల, 7 రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఏజెన్సీలు ఎం.ఎస్.‌పి. కంటే ఎక్కువ ధరలకు 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఎమ్.ఎఫ్.పి. లను సేకరించాయి. 

 

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎం.ఎస్.‌పి. చర్యలను సకాలంలో ప్రకటించడం,  ఎం.ఎస్.‌పి. లలో చేసిన సవరణలు,  మరియు ట్రైఫెడ్ యొక్క సమిష్టి కృషి ఫలితంగా, గిరిజనులకు మార్కెట్లో ఎం.ఎస్.‌పి. కంటే ఎక్కువ రేటుతో అధిక విలువ లభించింది. 

 

వీటికి అదనంగా, 6 రాష్ట్రాలు ఈ పథకం కింద ఎం.ఎఫ్.‌పి.ల సేకరణ కోసం వి.డి.వి.కె. కు నిధులను బదిలీ చేశాయి.  ఈ విధానం ద్వారా 4.03 కోట్ల రూపాయల మేర సేకరణ జరిగింది.  కోవిడ్ ఉపశమనం కోసం ఆర్టికల్ 275 (I) కింద చర్యలు చేపట్టడానికి 7 రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రణాళికలను సిద్ధం చేశాయి. నిధుల ఆమోదం మరియు మంజూరు కోసం త్వరలో ప్రణాళికలను మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నాయి.

 

గతంలో, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విభాగానికి సహాయపడాలనే ఉద్దేశ్యంతో కొన్ని చర్యలు ప్రకటించింది.  ఎందుకంటే గిరిజనుల ఆదాయంలో ఎక్కువ భాగం చిన్న అటవీ ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాల నుండే వస్తుంది.  ఈ కార్యకలాపాలు కూడా సాధారణంగా  ఏప్రిల్ - జూన్ నెలల మధ్య కాలంలోనే ఎక్కువగా ఉంటాయి. అటవీ ఉత్పత్తులను సేకరించేవారికి ఎం.ఎస్.‌పి.ని అందించడంకోసం మరియు అదనపు విలువను జోడించడానికీ, గిరిజన బృందాలు, క్లస్టర్ల ద్వారా సరైన మార్కెటింగ్‌ను కల్పించడం కోసం రూపొందించిన " కనీస మద్దతు ధర (ఎం.ఎస్.‌పి) మరియు ఎం.ఎఫ్.పి. లకు వేల్యూ చైన్ అభివృద్ధి చేయడం ద్వారా  చిన్న అటవీఉత్పత్తులు (ఎమ్.ఎఫ్.పి) లకు మార్కెటింగ్ యంత్రాంగం" అనే పధకానికి మంత్రిత్వశాఖ ఇప్పటికే మార్గదర్శకాలను ఆమోదించింది. 

 

2020 మే 1వ తేదీన, కేంద్ర ప్రభుత్వం 50 ఎం.ఎఫ్.‌పి.ల కోసం సవరించిన ఎం.ఎస్.‌పి. జాబితాను విడుదల చేసింది. వీటిలో చాలా వరకు ఎమ్.‌ఎఫ్.‌పి. ల ధరలను 30 నుండి 90 శాతం మేర పెంచడం జరిగింది. తద్వారా ఇది గిరిజన సేకరణదారులకు ప్రయోజనం చేకూర్చి పెట్టింది. వీటికి అదనంగా, మరో 23 వస్తువులను ఈ పధకం కింద ఎం.ఎఫ్.‌పి.లుగా చేర్చారు. వీటిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన గిరిజన ప్రజలు సేకరించే వ్యవసాయం మరియు ఉద్యాన ఉత్పత్తులు ఉన్నాయి. 

 

 

చిన్న అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధర పధకం కింద తీసుకున్న చర్యల ఫలితంగా కనీస మద్దతు ధర కింద చేర్చిన మొత్తం ఎం.ఎఫ్.‌పి. ల సంఖ్య 73 కు చేరింది.  ఇది, అన్ని రాష్ట్రాలలో చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించడానికి అవసరమైన వేగం పుంజుకోడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వాల నుండి తగిన ప్రతిస్పందన కోసం ట్రైఫెడ్ చేస్తున్న కృషి బాధిత గిరిజన ప్రజల పరిస్థితిని మెరుగుపరుస్తాయి.

 

 

******


(Release ID: 1630468)