జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ కింద 2022-23 నాటికి కర్నాటక గ్రామాల్లో ఇంటింటికీ నీటి పంపులు

Posted On: 08 JUN 2020 5:42PM by PIB Hyderabad

 

జల శక్తి మంత్రిత్వశాఖ వారి జల్ జీవన్ మిష న్ ను కర్నాటకలో అమలు పరచటానికి ఆ రాష్ట్రం వార్షిక కార్యాచరణ పథకాన్ని సమర్పించింది. త్రాగునీరు, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ఆ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి రూపొందించిన కార్యాచరణ పథకాన్ని ఆమోదించింది. ప్రధాని అత్యంత ప్రాధాన్యమిస్తున్న పథకాల్లో ఒకటైన జల్ జీవన్ మిషన్ మిషన్ అమలు చేయటానికి రాష్ట్రాలతో కలిసి జల్ జీవన్ మంత్రిత్వశాఖ ఒక రోడ్ మాప్ తయారుచేస్తూ 2024 నాటికి రోజుకు ఒక్కొక్కరికి 55 లీటర్ల నీరు అందేలా చూడాలని నిర్ణయించింది.

కర్నాటక రాష్ట్రం 2022-23 నాటికి 100% ఇళ్ళనూ చేరాలని అనుకుంటోంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 89  లక్షల ఇళ్ళు ఉండగా ఇప్పటివరకూ  24.50  లక్షల ఇళ్ళకు పంపు కనెక్షన్లున్నాయి. 2019-20 లో 22,127 కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్ళకు కూడా నీటి పంపులు ఇవ్వాల్సి ఉంది.  2020-21 రాష్ట్రం 23.57 లక్షల ఇళ్ళకు పంపు కనెక్షన్లు ఇవ్వటానికి పథక రచన చేస్తోంది. పైగా ఒక జిల్లా, 5 బ్లాకులు, 8,157  గ్రామాలకు 2020-21 లో నూరుశాతం అందించాలని నిర్ణయించింది. ప్రాధాన్య ప్రాంతాల మీద దృష్టి సారిస్తూ, అందరికీ సమన్యాయం జరగాలని మంత్రిత్వశాఖ అధికారులు నొక్కి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీనవర్గాలకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నదన్నారు. ఇప్పుడున్న 3,139 నీటి సరఫరా వ్యవస్థల కింద 23.57 ఇళ్ళ నీటి పంపులను కూడా  ఈ ఏడాదే బలోపేతం చేయటానికి రాష్ట్రం కట్టుబడి ఉందన్నారు.

కర్నాటకలో రెండు ప్రాధాన్య జిల్లాలున్నాయి. అందువలన రాష్ట్రం వీటికి ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా సూచించారు. అదే సమయంలో నీటికొరత ఉన్న ప్రాంతాలమీద, నాసిరకం నీరు అందుతున్న ప్రాంతాలమీద, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉండే గ్రామాలమీద సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింది గ్రామాల మీద దృష్టిపెట్టాలని కూడా సూచించారు. 


కర్నాటకలో 2020-21లో జల్ జీవన్ మిషన్ అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం రూ. 1,189.40 కోట్ల నిధిని ఆమోదించింది. అది నిరుడు కేటాయించిన రూ.  546.06  కంటే చాలా ఎక్కువ. పంపుల సంఖ్య దృష్ట్యా ఫలితాలు చూపాలని రాష్ట్రాన్ని కేంద్రం ఈ సందర్భంగా ఆదేశించింది. ఆ ఫలితాల ఆధారంగా మరిన్ని నిధులిచ్చే అవకాశముంటుందని తెలియజేసింది.  రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రారంభ నిల్వ రూ.55.67  కోట్లు ఉండగా ఈ ఏడాది కేటాయింపు రూ.1,189.40 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిసి మొత్తం జల్ జీవన్ మిషన్ కింద రూ.2,709.25 కోట్లు అందుబాటులోకి వస్తుందని  గుర్తు చేసింది.
అదే విధంగా 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంటు కింద రాష్ట్రానికి రూ. 3,217 కోట్లు అందుతాయని, అందులో నిబంధనల ప్రకారం 50% మొత్తాన్ని నీరు, పారిశుద్ధ్యం మీద ఖర్చు చేయాల్సి ఉంటుందని కూడా కేంద్రం తెలియజేసింది. గ్రామీణ ఉపాథి కల్పన, జిల్లా ఖనిజాభివృద్ధి నిధి, సి ఎస్ ఆర్ నిధి, లోకల్ ఏరియా డెవలప్ మెంట్ ఫండ్ తదితర అనేక పథకాలను కలుపుకుంటూ ప్రణాణికలు అమలు చేయాలని కేంద్రం తెలియజేసింది. ప్రతి గ్రామానికీ గ్రామాభివృద్ధి పథకం రూపొందించి జల సంరక్షణ లాంటి కార్యకలాపాలు చేపట్టేలా చూసి త్రాగునీరు కచ్చితంగా లభించటానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. 
గ్రామాలలో నీటి సరఫరా కోసం రూపొందించే ప్రణాళిక, ఆచరణ, నిర్వహణలో స్థానిక గ్రామ పంచాయితీలను, వాడకం దారులను భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనివలన దీర్ఘకాల సుస్థిరతత సాధ్యమవుతుంది. జల్ జీవన్ మిషన్  ఒక ప్రజా ఉద్యమంలా సాగేందుకు దీన్ని ఒక ప్రచారోద్యమంలా చేపట్టాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే గ్రామాలలో  నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పనలోనూ, వాటి నిర్వహణలోనూ స్వయం సహాయక బృందాలను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.  


నీటి వనరులను మొదటి విడత రసాయనిక పరీక్షలు చేయటం, రెండో విడత బాక్టీరియా కాలుష్యం ఉందేమో పరీక్షించటం కూడా జల్ జీవన్ మిషన్ లో భాగాలు. పైగా, నీటి నాణ్యతా పరిరక్షణలో భాగంగా బాక్టీరియా కాలుష్యాన్ని కూడా వర్షాలకు ముందు, వర్షాల తరువాత  రెండుసార్లు పరీక్షిస్తారు. రాష్ట్రాలు కూడా కచ్చితంగా నీటి వనరులను పరీక్షించాలనే నిబంధన విధించారు.  అదే విధంగా ప్రజలు కూడా నీటి నాయత పరీక్షించేలా లేబరేటరీ సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలో ఐదుగురు మహిళలకు ఈ శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి లేబరేటరీలకు అక్రెడిటేషన్ ఇవ్వటం మీద కూడా దృష్టి సారిస్తారు. 2020-21లో 30 నీటి పరీక్షా కేంద్రాలను ప్రామీణీకరించాలని కర్నాటక భావిస్తోంది.

ఇప్పుడున్న కోవిడ్-19 నేపథ్యంలో  నీటి సరఫరా, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యమిస్తూ  గ్రామాల్లో నైపుణ్యమున్న, పాక్షిక నైపుణ్యమున్న వలస కార్మికుల జీవనోపాధికి వీలుగా పనులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో గ్రామాలలో త్రాగు నీటు సౌకర్యం కల్పించటం మీద కూడా దృష్టిపెట్టాలన్నారు.

***



(Release ID: 1630325) Visitor Counter : 171