విద్యుత్తు మంత్రిత్వ శాఖ
విద్యుత్ రంగంలో పరస్పర సహకారానికి భారత్, డెన్మార్క్ ఎంవోయూ
ప్రయోజనాంశాల రూపకల్పనకు ఏర్పాటుకానున్న సంయుక్త బృందం
పరస్పర లబ్ధికి బలమైన, దీర్ఘకాలిక సహకారం ఉండాలని ఇరు దేశాల నిర్ణయం
प्रविष्टि तिथि:
08 JUN 2020 3:56PM by PIB Hyderabad
విద్యుత్ రంగంలో పరస్పర సహకరించుకోవడానికి భారత్, డెన్మార్క్ నిర్ణయించాయి. భారత్, డెన్మార్క్ విద్యుత్ శాఖల మధ్య ఈ దిశగా అవగాహన ఒప్పందం కుదరింది. సమానత్వం, పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికగా, బలమైన, దీర్ఘకాలిక సహకారం ఉండాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అవగాహన ఒప్పందంపై జూన్ 5, 2020న సంతకాలు చేశాయి.
భారత్ తరపున కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సహాయ్.. డెన్మార్క్ తరపున, భారత్‌లో డెన్మార్క్ రాయబారి ఫ్రెడ్డీ స్వాన్ సంతకాలు చేశారు.
తీర ప్రాంత గాలి, దీర్ఘకాలిక విద్యుత్ ప్రణాళికలు, అంచనాలు, గ్రిడ్ అనుకూలత, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అనుకూలతలు, పవర్ ప్లాంట్‌ల ప్రోత్సాహం, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో వైవిధ్యం వంటి అంశాల్లో రెండు
దేశాల మధ్య సహకారాన్ని ఎంవోయూ ప్రోత్సహిస్తుంది. ఈ అంశాల్లో భారతీయ విద్యుత్ మార్కెట్ డెన్మార్క్ నుంచి లబ్ధి పొందుతుంది.
గుర్తించిన అంశాలను వృద్ధి చేసేందుకు, సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. రెండు దేశాల కార్యదర్శి స్థాయి అధికారులు ఈ బృందానికి అధ్యక్షులుగా, సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. వీరు స్టీరింగ్ కమిటీకి నివేదిస్తారు.
విద్యుత్ రంగంలోని గుర్తించిన అంశాల్లో పరస్పరం ప్రయోజనాలు పొందేలా వ్యూహాత్మక, సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహించడానికి రెండు దేశాలు చర్యలు తీసుకుంటాయి.
(रिलीज़ आईडी: 1630235)
आगंतुक पटल : 312